Thursday, May 26, 2016

హేమహారములు / గాలి వలువ [ song 2 ]

తెరువరా నీ కన్నుదోయి! ; 
దోసిలిని భక్తి ముడిచి ఒగ్గీ,  
వేచి చూచుచు నిలిచె నిఖిలము ; 

నీ కోసమేను శ్రీకృష్ణస్వామీ! || 
;
పూలతావుల చందనమ్ముల రంగరించి ; 
హరివిలుల హొయలు హేమహారమ్ములను; 
నీదు గళమున వేయవలెనని ; 
నీలి గగనము వేచిఉన్నది; 
రాగదోయీ! లేచి, రాగదోయీ!  || 
మంచు ముత్యపు ద్యుతిని కలిపిన ; 
కస్తూరి తిలకము తీర్చిదిద్దగ; 
ఎల్ల ప్రకృతి ఎరుకతో ఎట్టెదుట నిలిచీ,  
నిలువుకాళ్ళ జీత మడుగుచు ; 
నీదు అడుగుల మడుగులొత్తుచు ; 
రాగదోయీ! లేచి, రాగదోయీ!  ||
;
==============================;

             hEmahaaramulu/ gaali waluwa  :-  

teruwaraa nii kannudOyi! ; 
dOsilini bhakti muDichi oggI, ggi 
WEchi chuuchuchu niliche nikhilamu ; 

nii kOsamEnu SrIkRshNaswAmI! ||
;
puulataawula chamdanammula ramgarimchi ; 
hariwilula hoyalu hEmahaarammulanu; 
niidu gaLamuna wEyawalenani ; 
niili gaganamu wEchiunnadi; 
raagadOyii! lEchi, raagadOyii!  || 
;
mamchu mutyapu dyutini kalipina ; 
kastuuri tilakamu tiirchididdaga; 
ella prakRti eTTaeduTanu ; 
erukatO niluwukaaLLa jIta maDuguchu ; 
niidu aDugula maDugulottuchu ; 
raagadOyiiI! lEchi, raagadOyii!  || 
;
@@@@@@@@@@@@@@@@@@@@@ 
;
హేమహారములు / గాలి వలువ :-   [ పాట  13 - బుక్ పేజీ  25 ] 
gaali waluwa :-   [ pATa  13 - buk pEjI  25 ] 

No comments:

Post a Comment