రారే! రారే! - రారే, రారే, రమణుల్లార! -
రమణీలోలుని తోడ ఆడగా ||
;
శిరసున శిఖి పింఛము కదల ;
నీలి ముంగురులు అల్లన చెదర ;
కస్తురి తిలకపు నుదుట స్వేదము :
ముత్యపు దండై మెరసి కదలగా
ఆడెనుచెంగున, అంగన చెంగట :
ఆడెను కృష్ణుడు, బృందావనిలో ||
;
నీలికన్నుల నిగ్గులు కదల ;
వాలుచూపుల కాంతులు మెరయ ;
ఎదపై కౌస్తుభ హారము కులుకగ
కేకి భుజముపై గారము లొలుకగ
ఆడెను కృష్ణుడు దాగుడుమూతలు ;
కొమ్మల దాగిన కొమ్మల తోడ ||
*************************************;
see this song in Beautiful Magazine :- =
LINK :- ప్రాంజలి ప్రభ ; కృష్ణ భక్తి ;
; ------- ఊయలలు :- [ పాట 11 - బుక్ పేజీ 22 ]
అఖిలవనిత - 35871 pageviews - 856 posts, [ May 20, 2016 ]
No comments:
Post a Comment