Friday, May 6, 2016

జడివాన ! జడివాన ! జడిపించకోయీ!

జడివాన ధారలై కురియుచున్నాది, 
ధారలతొ ధారలు పెనవేసుకొనుచు || 
జడివాన !  జడివాన ! జడిపించకమ్మా! 
గోపెమ్మలందరూ తడియుచున్నారు;
జడివాన !  జడివాన ! జడిపించవద్దు!  ||
 ;
నీలోన అంతగా అలజడులు ఏలనే!?; 
రాధ జడకుచ్చులకు దీటుగాను ; 
నీ మబ్బు మెరుపుల్లు నిలువగలిగేనా? 
జడివాన , అంతగా అలజడులు ఏలనే!? || 
;
మిన్నాగు జడను ఒడిసిపట్టేను ;   
క్రిష్ణయ్య- రాధమ్మ జడలను ఇట్టె పట్టేను ;   
శేషశయనుని కూడ ఉలికిపడ జేసిన 
మిన్నాగు జడ తనది , చూసినావా!?  
;
జడివాన, త్రుళ్ళకు!  త్రుళ్ళిపడబోకు! 
రాధమ్మ జడగంట సవ్వడులు,  నీకు 
లభియించుచున్న మంచి కానుకలు!
ఊహూ!
"మనకు" దొరికినవి 
ఈ రవళి బహుమతిలు  || 

===================================,

# jaDiwaana dhaaralai kuriyuchunnaadi, 
dhaaralato dhaaralu penawEsukonuchu || 
jaDiwaana !  jaDiwaana ! jaDipimchakammA! 
gOpemmalamdaruu taDiyuchunnaaru;jaDiwaana !  
jaDiwaana ! jaDipimchawaddu ||
;
neelOna amtagaa alajaDulu ElanE!?; 
raadha jaDakuchchulaku deeTugaanu ; 
nii mabbu merupullu niluwagaligEnA? 
jaDiwaana , amtagaa alajaDulu ElanE!? || 
;
minnaagu jaDanu oDisipaTTEnu ;   
krishNayya- raadhamma jaDalanu iTTe paTTEnu ;   
SEshaSayanuni kuuDa ulikipaDa jEsina 
minnaagu jaDa tanadi , chuusinaawaa!?  
jaDiwaana, truLLaku! truLLipaDabOku!
raadhamma jaDagamTa sawwaDulu ; 
niiku labhiyimchETi mamchi kaanukalu
uuhuu! "manaku"
dorikinawi ii mamchi bahumatilu  || 

&&&&&&&&&&&&&&&&&&&&&&&,
;   
                            కార్తీక దీపాలు 
పాట - 2 ;- 

నీదు చివురు వ్రేళులు
వంశీ వేదికపైన - నర్తనములు సేయగా
రాగ మధువు లొలికించుము,
గోవర్ధన గిరి ధారీ! వన మాలీ! ||

1.తరగ నురుగులపై -
మణి మయ దీపాలను
వెలిగించెను జాబిలి -
కార్తీకము కాబోలని -
విచ్చేసెను ఋతు రాణి ||

2. నంద వ్రజము ఇటీవల –
ధరణి కుంకుమాయెనని
కనుగొన్నది కొండ గాలి
వేణువును బ్రతిమాలి –
నృత్యములను నేర్చినది ||

&&&&&&&&&&&&&&&&&&&&&

[ కార్తీక దీపాలు :- LINK - అఖిలవనిత . blog  ; 2009 ▼  February (23) ]
;

No comments:

Post a Comment