Tuesday, May 31, 2016

చిడిముడి ఎందుకు?

చిడిముడి ఎందుకు - 
అడుగులు వేయగ ; 
అదిగో! తిరుమల!
దివ్య తిరుపతిని శ్రీ హరి        || 
;
వరముల గొడుగు వేంకటరణుడు; 
విరాళి వరముల అనుగ్రహమ్ముల; 
పెన్నిధి ఆతడు ; 
వరదహస్తుని చల్లని నవ్వుల నీడల 
మనము సేదదీరుదము! || 
;
సద్భావనలతొ ముడిపడి ఉండగ ; 
దేవుడు సప్తగిరీశుడు ఆప్తుడు ; 
ప్రజలందరికీ అండగ ఉండగ 
దోవలు అన్నియు పూలపాన్పులే! 
ఏమాత్రము ఇకపై 
అలసట అన్నది లేనే లేదుగ! || 
;
శాంతి స్నేహం సామరస్యాది
భావనల పర్ణకుటీరము 
ప్రతి మానసము ; 
కాంతిరూపుని కటాక్షానుగ్రహ 
ఫలితమ్ములుగా, 
దొరికిన సంపద భాగ్య ప్రభలయి; 
మెండుగ భక్తి - 
చిత్తములందున ముడిపడి ఉండగ ||
;
==============================,
;
# chiDimuDi emduku - 
aDugulu wEyaga ; 
adigO! tirumala!
diwya tirupatini Sreehari || 
;
waramula goDugu wEmkaTaraNuDu; 
wiraaLi waramula anugrahammula; 
pennidhi aataDu ; waradahatuni 
challani nawwula nIDala manamu sEdadiirudamu! || 
;
sadbhaawanalato muDipaDi umDaga ; 
dEwuDu aptagiriiSuDu aaptuDu ; 
prajalamdarikii amDaga umDaga ; 
dOwalu anniyu puulapaan pulE! 
Emaatramu 
ikapai alasaTA annadi lEnE lEduga! || 
;
SAmti snEham saamarasyaadi 
bhaawanala parNakuTIramu prati 
maanasamu ; kaamtirUpuni 
kaTAkshaanugraha phalitammulugaa, 
dorikina sampada bhaagya prabhalayi; 
memDuga bhakti - chittamulamduna 
muDipaDi umDaga ||

****************************************, 
by ;- [ భక్తి గీత దళ ] =
] చిడిముడి ఎందుకు? ;/
దివ్య తిరుపతి 

;
అఖిలవనిత ;t 35995 ; - 868 posts ;on May 30, 2016  
;

No comments:

Post a Comment