Wednesday, May 4, 2016

భామినులార! సరగున రండీ!

పరుగిడి, వడివడి, వేగమె రండీ
  ఏ మాత్రము జాప్యమును సేయకనూ;
  భామినులార! సరగున రండీ!
         సత్వరమే తామెల్లరునూ
             పరుగిడి, వడివడి, వేగమె  రండీ!  ||

తులసీ మాలలు అల్లుదము
కళకళలాడును హరిత వర్ణముల  
జలజనాభునీ గళమున దళములు ||

నయగారముల మందారములను
దామోదరునికి సింగారించి

హొయలు పూలకు నొసెగెదము   || 

           [song - 1 ]

******************************,
song - 2  ;
                   క్రిష్ణుని కొన గోళ్ళు ;-
గోపాల బాలుడు- బృందావన సంచారి
మురళీ ధరుడు, మురిపాల క్రిష్ణుడు; 
మన పాలి దేవుడు ||
;
గోరు ముద్దలన్నిటినీ మెసవుచుండును; 
కూర్మి- యశోదమ్మ గారాలపట్టి వీడేను!
మాకెల్లపుడూ వీని ధ్యాస; వీడము ఈ ధ్యానము  || 

గోటి మీద కొండనే నిలిపి ఉంచినాడు; 
గోటి కింద పెద్ద పాము నణచినాడు గదటమ్మా!
సాటిలేని మేటి; అసాధ్యుడంటె వీడేను ||
;
గోరు మీద వెన్న ముద్ద చాలంటాడు; / కొసరుచుండెను; 
సంగోరు భాగమీవే అని రాధను బులిపించును 
గోపాలబాలుడు గోవిందుడు పురుషోత్తముడు  ||

******************************,

క్రిష్ణుని కొన గోళ్ళు  22, ఆగస్టు 2011, సోమవారం
క్రిష్ణుని కొన గోళ్ళు [konamanini.blog] 
అఖిలవనిత
Pageview chart 35630 pageviews - 843 posts, last published on May 4, 2016 - 1 follower

తెలుగురత్నమాలిక
Pageview chart 5361 pageviews - 149 posts, last published on Mar 27, 2016 - 1 follower

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65564 pageviews - 1041 posts, last published on Feb 28, 2016 - 8 followers

No comments:

Post a Comment