Thursday, May 19, 2016

మయూరి పింఛము


పింఛమంత దాచినావు; 
గుబురు పింఛమంత దాచినావు ; 
ఓ మయూరీ! 
నీవెంతటి గడుసరివే! 
నీ పింఛమెంత ధన్యమో ||
;
రెండు కనులు చాలవని: 
వేల కనులు మేనులోన : 
ధారణను చేసినావు ||
;
చిన్నారి కన్నయ్య వచ్చెనని, 
ఏ రీతిని కనుగొందువో : 
అలికిడికే  -
'పులకింతల  పురి' ని విప్పి ఆడేవు ||       

===============================,

# mayuuri pimCamu :- 
  
pimCamamta daachinaawu; 
guburu pimCamamta daachinaawu ; 
O mayUrI! 
niiwemtaTi gaDusariwE! 
nI pimCamemta dhanyamO ||
;
remDu kanulu chaalawani: 
wEla kanulu mEnulOna : 
dhAraNanu chEsinAwu ||
;
chinnaari kannayya wachchenani, 
E rItini kanugomduwO : 
alikiDikE 
'pulakimtala-puri'ni wippi ADEwu ||  

**********************************,


   మయూరి పింఛము :-  [ పాట 20 - బుక్ పేజీ 31 ]     :-  

No comments:

Post a Comment