Sunday, May 29, 2016

గోరుముద్దలు

గోరుముద్దలు తినగ వేళాయెరా!  
రా! రా! రారా! క్రిష్ణా! ; 
కోలుకోలంటావు, 
గోల చేస్తుంటావు ;  
రావోయి క్రిష్ణా! గోపాల బాల క్రిష్ణా!
 వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||
;
అడుగులన్నీ నాట్యముద్రలైనాయి ; 
పడగపై వింత నాట్యముద్రలైనాయి; 
కాలిగోటిన మొత్తి,  కాళీయు మదమణచి; 
అలసిపోయావేమో! రావోయి క్రిష్ణా! 
గోపాల బాల క్రిష్ణా!
వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||
;
శకటాసురుని అకట! 
విసిరేసినావు! 
నీ తుంటరితనమును 
కట కటా! వేగలేనౌరౌరా! ; 
ఆపరా! ఆపరా! ఆపరా!
రావోయి క్రిష్ణా!
గోపాల బాల క్రిష్ణా!
వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||
;
గోవర్ధనమ్మును కొనగోట నిలిపినావులే!
చమత్కారివి నీవు ఔరౌరా! 
అంత పెద్ద  కొండను ఇట్టే ఎత్తిన నా వ్రేలు ఇదియే! 
అనుచు నాకు చూపిస్తూను ; 
ఈ గోరుముద్ద నాకు చాలదంటావు!
నాకు చాలదనబోకుమురా! బాలక్రిష్ణా! 
గోప బాలక్రిష్ణా!  గోపాల బాల క్రిష్ణా!
 వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||| 

*******************************,
;
gOrumuddalu tinaga wELAyerA!  raa! rA! rArA! krishNA! ; 
kOlukOlamTAwu, gOla chEstumTAwu ;  raawOyi krishNA! 
వేNulOlaa! winOdI! krishNA!  ||
;
aDugulannii nATyamudralainaayi ; 
paDagapai wimta nATyamudralainaayi; 
kaaligOTina motti,  kALIyu madamaNachi; 
alasipOyAwEmO! rAwOyi krishNA! gOpAla 
bAla krishNA! వేNulOlaa! winOdI! krishNA! || 
SakaTAsuruni akaTa! wisirEsinAwu!
;
nI tumTaritanamunu kaTa kaTA! wEgalEnauraurA! ; 
aaparaa! aaparaa! aaparaa!
raawOyi krishNA!
వేNulOlaa! winOdI! krishNA!  ||
;
gOwardhanammunu konagOTa nilipinaawulE! 
chamatkaariwi niiwu aurauraa! ; 
amta pedda  komDanu iTTE ettina naa wrElu idiyE! 
anuchu naaku chuupistuunu; ii 
gOrumudda naaku chaaladamTAwu! 
naaku chaaladanabOkumurA! 
baalakrishNA! aa wrElu idiyE! ; 
anuchu naaku chuupistuunu; 
ii gOrumudda naaku 
chaaladamTAwu! 
naaku chaaladanabOkumurA! baalakrishNA! 
gOpa baalakrishNA! 
వేNulOlaa! winOdI! krishNA!  || 
;
****************************************,
;
గోరుముద్దలు   :-   [ పాట 16 - బుక్ పేజీ 27  ] 
gOrumuddalu   :-   [ పాట 16 - బుక్ పేజీ 27  ]  

No comments:

Post a Comment