మురళికి ఎంతో ఉల్లాసం! -ఎందు వలన? ఎందు వలన?మిత్రులార! చెప్పండీ!క్రిష్ణయ్య చేతి చివురు వ్రేళ్ళుఆ వేణువు పై ఆడినందు చేతనే,నేస్తులార తెలిసినదా?!వెదురు తోపులకు ఇప్పుడు – ఇంత పారవశ్యమేల?బోలు వంశి కాస్త - మధు రాగమ్ముల గూడుగా మారెనుకద!నిలువెల్లా ఓ మురళీ! – పులకరింతలేలనే?కన్న(ని) కెంపు పెదవుల్లు – తాకి తాకగానేజలదరింపు గాన లహరిగ – మారుట వింత కాదు లేవమ్మా!muraLiki eMtO ullaasaM! -eMdu valana? eMdu valana?mitrulaara! cheppaMDI!krishNayya chEti chivuru vrELLuaa vENuvu pai aaDinaMdu chEtanE,nEstulaara telisinadaa?!veduru tOpulaku ippuDu – iMta paaravaSyamEla?bOlu vaMSi kaasta - madhu raagammula gUDugaa maarenu kada!niluvellaa O muraLI! – pulakariMtalElanE?kanna(ni) keMpu pedavullu – taaki taakagaanEjaladariMpu gaana lahariga – maaruTa viMta kaadu lEvammaa!
Monday, January 31, 2011
మురళికి ఎంతో ఉల్లాసం!
Saturday, January 29, 2011
అప్సరసలు కనుక్కున్నారు
మాధవ మందిర సోపానముల ;రాధిక నిలిచిన పరవశ శిల్పమ్ముక్రిష్ణా! నీ ధన రాశి తానే గదరా! ||ఏమని తాని నిన్నే తలచెనో ;రామ చక్కనీ భామామణి ఇటు ;ఆమనినే గొని తెచ్చినదీ ;ఈ మహిని పావనిగ ఒనరించినది ||తథికిట తకధిమి, నీ నర్తనలకు ;మధు రస పథముగ తానే ఆయెను;అచ్చర కిన్నెర మనో నాయిక ;ఇచ్చట రాధను కనుగొనినారుమేదినికి దిగి వచ్చిరి వారు ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$apsarasalu kanukkunnaaru ;_____________________maadhava maMdira sOpaanamula ;raadhika nilichina paravaSa Silpammu ;krishNA! nI dhana rASi taanE gadarA! ||Emani taani ninnE talachenO ;raama chakkanI BAmAmaNi iTu ;aamaninE goni techchinadI ;I mahini paavaniga onariMchinadi ||tathikiTa takadhimi, nI nartanalaku ;madhu rasa pathamuga taanE aayenu;achchara kinnera manO nAyika ;ichcaTa raadhanu kanugoninaarumEdiniki digi vachchiri vaaru ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
ధ్యాన మహత్తు
ఆధరువాయెను నీదు ధ్యానము ;మదిని మందిరముగ నిర్మించ గల ;సాధనమ్మది - ఓ చిలకా!(అను పల్లవి);;;;;ధ్యాన మహిమను తెలుసుకో మరి, ఓ చిలుకా!||ధ్యాన మహిమ||వేణువు ఊదీ ఊదగనే ;రాణువ కెక్కెను మలయ మారుతము ;జాణ తనమ్ముల తంత్రీ వీచీ ;పంక్తుల నింగిని తుల తూచేను||ధ్యాన మహిమ||గగన నీలిమను ఆ నది యమునకు :పంచి ఇచ్చితివి, చిరు గాలీ!నీల మోహనుడు క్రిష్ణునికీ ;ప్రియ నేస్తము ఐనది యమున||ధ్యాన మహిమ||(ధ్యాన మహత్తు )$$$$$$$$$$$$$$$$$$$$$aadharuvaayenuswaami dhyaanamu ;madini maMdiramugaa nirmiMcha galasaadhanammadi, O chilukaa! ||(anu pallavi) ;;;;;dhyaana mahimanutelusukO mari, O chilukaa!||dhyaana ||vENuvu UdI UdaganE ;raaNuva kekkenu malaya maarutamu ;jaaNa tanammula taMtrI vIchI ;paMktula niMgini tula tUchEnu ||dhyaana ||gagana nIlimanuaa nadi yamunaku :paMchi ichchitivi, chiru gAlI!nIla mOhanuDu krishNunikii ;priya nEstamu ainadi yamuna || dhyaana ||
నీ శ్రీకర కరములు
నీ - క్రీగంటి చూపులలొ ఎత్తి పట్టితివిఆరాధన కర్పూర హారతినీ ;శ్రీ నాథుని ఎదలో నిలిపిన తల్లీ! ||కందనీనులే, నీ - పతి కరములుచంద మామ వెన్నెల మా భక్తి;పందిరి వేతుము భరవాసాగానీ కందు సంశయము వలదమ్మా!!తొందరించకు,"పతి!రా! రమ్మ"నిముందరే త్వర పడి తోడ్కొని పోకు ||చందనార్చిత జానకి రమణా!నీకందరు ఎన్నగ కన్న బిడ్డలే!రాకెందు వదన! శ్రీ రమా రమణుడా!పల్లవ పాణీ! ఇంగితమెరిగితి;ఇంకెందుకు విడుతును కలనైనా?నాకందినట్టి ; నీ శ్రీకర కరములు ||
ఆడేరు పిల్లలు రా చిలుక సొగసులు
మబ్బులకు వైనంగమెరుపుల్ల తీగలుబిగియించినాదినీలాల గగనమ్ము;వాన జల్లుల్లోనతనివి తీరాఆట పాటలచెంగు చెంగునగంతులేస్తూనుఆడేరు పిల్లలురా చిలుక సొగసులుముద్దు బాలలచరణ - పట్టీలు, మువ్వలులయ తాళములనునేర్పుతూ ఉండగాశృతి చేసుకుంటూను - నీలాంబరంతన నూత్న సంగీత లహరికలనుతొలి కారు రాగాలశృతి మేళవింపులతొహర్ష సంగీతమునువినిపిస్తు ఉన్నాది.
జమ్మి ఆకు బంగారం
మృదు రాగం ప్రతిఫలం
రావి చెట్టు, జమ్మి చెట్టు
వేప, మఱ్ఱి, అశ్వత్థం
దండం, దండం!
తులసి దళం, వంశి వనం
నారి కేళం, తాళ పత్రం
దండం, దండం!
వ్యాస ముని భారతం
“జయం, జయం!”(*)
లేఖకుడు విఘ్నేశ్వర
దండం, దండం!
శ్రీ బాల క్రిష్ణా!
వట పత్ర శయనుడా! శ్రీ శేష శాయీ!
తులసీ వన మాల ధారి! వంశీ వినోదీ!
శ్రీ బాల క్రిష్ణా! ఇదిగో నవనీతం;
మృదు రాగం జగతికి
లభియించే ప్రతిఫలం
{ (*)“మహా భారతము” అసలు పేరు “జయం”}
రేగుచున్న శివ జటా జూటములు
నమ్మరాని వింత
ధరిత్రి నమ్మగ రాని వింతలలోన ఇది -మిరుమిట్లు గొలిపెడి వింత సౌరు ఇది! ||కరుణార్ద్రతలను ఒసగే దేవా!దొరవూనీవే; దొంగవు నీవే!;ఔరౌరా!నవనీత చోరుడా!ధరిత్రి నమ్మగ రాని వింతలలోన -మిరుమిట్లు గొలిపెడి వింత సౌరు ఇది! ||కన్నయ్యా! అవ్యాజ ప్రేమలను, ;పొన్నుగ జగతికి పంచే దొరవు,ఎన్నగ చోద్యము! లీలా క్రిష్ణా!ధరిత్రి నమ్మగ రాని వింతలలోన ఇది -మిరుమిట్లు గొలిపెడి వింత సౌరు ఇది! ||
Friday, January 28, 2011
అవనిని అన్నిటి తత్వము మారెను
చిరు గాలి మయ బ్రహ్మ
సకల జనులనూ సేద దీర్చెడుచకిత చిత్ర లేఖన నైపుణ్యములకు నిలయము గాలి ||ధరిత్రి పయిన తిరుగు వారికి ;నిరతము స్వామి నామ స్మరణమునెమెరుపు బంగరు మందిరమ్ములుగ చేసేచిరు గాలి మయ బ్రహ్మను మించినది ||పేరు పొందినది యమునా శీతల తుషార బిందులమలయ - మారుతము , నీ ముంగురు ఊయెలలందునసౌరుగ ఊగు చనువు నీ కడదొరుకుట కడు ఔచిత్యమె కదరా, కన్నయ్యా!! ||
నీటి బుంగ మనసు - జల తరంగిణి
ప్రేమ గీతల ముగ్గుల బందీ
నీమము కదటే, మానస హంసకు
తామసమేలనె, ఓ చిలుకా! ! ||
శ్రీ వేంకట రమణుని
రామ చక్కనీ నామ సుధా ఝరి
గోముగ చక్కర్లు కొడుతూ ఈదుట :
ప్రేమ గీతల ముగ్గుల బందీ
నీమము కదటే, రామ చిలుకరో! ||
శ్రీ రంగ నాథునీ, మంద హాసములు ;
రంగరించు శృతి గమకపు అలలు
శ్రీ గీత తరంగిణి ఉల్లాసములు
నీటి బుంగ మా హృదయములాయెను
ఉదయార్ద్ర ప్రభా జల తరంగిణులు ||
Monday, January 24, 2011
గాలి - సుగంధముల గని
గాలికి మోదం కూర్చును పూవులు ;పువ్వుల నేస్తం చేయగనే ;సుగంధమ్ముల గనిగా ఆయెను గాలి.పువ్వులతోటి స్నేహ హస్తమును ;అందుకున్నదీ చిరు గాలి ;ఐనది గాలి ఆ వెనువెంటనె ;సౌగంధమ్ముల మ(క)రంద పెన్నిధి!మలయ పవనములు సాగీ, సాగీ, పయనాలు;పైరుల, తరువుల పలకరింపులు ;ప్రజలందరికీ ప్రకృతి జననీ – అర్చనఎపుడూ ఆమోదం, అది ఆహ్లాదకరం.ప్రకృతిలోని ప్రాణి కోటితో ;జతలు కూడిన సమ తౌల్యతపై ;ఆప్యాయతలు, అవగాహనలు,సదా ఉండ వలె సజ్జనులారా!"అనుచు, బుజ్జగించుచూ,నుడివెను ఉదయం.
పచ్చ దనాలు, పైరు తరువులు జంట కవులుగా ముచ్చట్లు
స్నేహ బంధము
కెంపు భాండమని భ్రమంచిన విహంగ రాజు
గుమ్మ పాలు తెచ్చాను ;
చెంగనాలు చాలునురా! ;
అమ్మ కొంగు
చాటు బిడ్డ! ;
కావేటి శ్రీ - రంగ నాథ! రావోయీ!
ఇటు రావోయీ! ||
పల్లె పట్టు కామ ధేను ;
విల్లిదిగో, కొల్లలుగా ;
తెల్ల వెన్నెలంటి పాలు
కురిసేను కురిసేను ||
ఉరికి ఉరికి ధారలయే;
తరిపి పాలు నీ కొరకే ;
ఆ - విరి పొదు
గులు చూడ చూడ ;
సిరి పారిజాతముల కన్న ;
పరమ మూల్యమే సుమా! తెలియుమురా! ||
పెదవి తిరుగు వంపులలో ;
ఒదిగి తొంగి చూచేటి ;
పాల నురుగు సరళి చూసి ;
మేలు కెంపు భాండమని ;
తలచి గరుత్మంత రాజు దుమికేను :
నా మేలి ముసుగు ఇదిగోరా, దాక్కోరా!
ఈ రాధమ్మ-
మేలి ముసుగు ఇదిగోరా, దాక్కోరా! ||
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
gumma paalu techchaanu ; - cheMganaalu chaalunuraa! ;
amma koMgu chATu biDDa! ; - kaavETi SrI raMga naatha!
raavOyI! iTu raavOyI! ||
palle paTTu kaama dhEnu ; - villidigO, kollalugaa ;
tella vennelaMTi paalu kurisEnu ||
taripi paalu nI korakE ; - uriki uriki dhaaralugaa
aa viri podugu chUDa chUDa ; - siri paarijaatamula kanna ;
parama mUlyamE sumaa! teliyumurA! ||
pedavi tirugu vaMpulalO ; - odigi toMgi chUchu chunna
paala nurugu saraLi chUsi ; - mElimi keMpu BAMDammani ;
talachi
garuDa raaju dumiki,dumiki; - eduTa vaalEnu, hammayyO! ;
naa mEli musugu idigOraa, daakkOraa! -
I raadhamma - mEli musugu idigOraa, daakkOraa! ||
Sunday, January 23, 2011
ఎరుక తెలుపు దొరసాని
స్వామి వారి మనోగతం ; భామ పద్మకే ఎరుక ;
ఎరుక తెలుపు దొరసాని ; సిరి దేవి కూడ తెలుపలేని ||
కప్పూరపు హారతులను ;
తెప్పలుగా తేలు పొగలు;
అప్పుడే గేలి సేయు ;
గొప్ప మొయిలు రాసులను
“మేమె స్వామి నలముకున్న
తోమరంపు నీలిమల ”ని; సిరి సిరి! ||
దూది మబ్బు రాసులతో ;
వాదమ్ములు ధూమములవి ;
మోదముగా సేయును వీనులకు విందులు ;
మీదు మిక్కిలిగ సిరి నవ్వుల ;
మేదినికి ఒసగు లీల లెన్న తరమ? సిరి సిరి! ||
&&&&&&&&&&&&&&&&&&&&&&
svaami vaari manOgataM ;
BAma padmakE eruka ;
eruka kUDa telupu dorasaani ;
siri dEvi kUDa telupalEni ||
kappUra haaratulanu ;
teppalugaa tElu pogalugaa ;
“mEme swaami nIlima”ni ;
goppa moyilu(lanu) gEli sEyu ||
dUdi mabbu raasulatO ;
vaadammula dhUmamulavi ;
mOdamugaa vInu viMdu ;
mIdu mikkili siri navvula ;
mEdiniki osagu lIla lenna tarama? siri siri! ||
&&&&&&&&&&&&&&&&&&&&&&
Saturday, January 22, 2011
తిరు గిరులను చేయును, పారిజాత సుమ రాశిగ
Tuesday, January 18, 2011
పాల సంద్రములనుచు భ్రమ
గుజ్జు వెన్నలు, జున్నుగ్రోలరా, కన్నయ్య! ;అనుచు బ్రతిమాలుచు నుండు యశోదమ్మ ||నిగ్గుటద్దం లాంటి మనసున్న పిల్లడు ;మా బాల క్రిష్ణుడు ;ఆబాల గోపాలమానసోల్లాసములు ||ఉగ్గు పాల నురుగు లురికి , పొంగేటి ;ఆ లేత బుగ్గలు చూసి మురిసేనమ్మ ; డు ;పాల్గారు బుగ్గలను బుల్లి సొత్తలు మీటువాల్గన్నులందున నెమలి పింఛాలు ||పాల బురుగులు చేయుఅధరాల సందడులు ;పాల సంద్రములనుచు భ్రమ తోడ ఈ నాడు ;వేయి పడగల ఆది శేషుండు దుమికెనే!బోసి పోయిన వైకుంఠమ్ము నుండిసప్త ద్వారమ్ములు వెడలి వచ్చినాయి;పల్లవాంగుళులందువేణు మృదు రవళులయె ||
Saturday, January 15, 2011
నందన వనమున నాకము బస
గోరంత వెన్న ముద్దచాలు! చాలన్నాడే! ;కొన గోటి మీదగిరిని ;నిలిపినట్టి గిరి ధారి,గోవర్ధన గిరిధారి ;గోవిందుడు, మన గోవిందుడు ||మనసిజుని జనకుడు ;మన పాలిటి కల్ప తరువు ;కను మాయగ స్వర్గమ్మేబృందా-వనిలో విడిది సేసె!మనసారా తలుచుదు(/ద)ము ;గోవిందుని, మన గోవిందుని ||మదనోత్సవ విలాసుడు ;కొదమ సింహ సమానుడు;అదరహో! బహు తుంటరి! ;మది మదినీ అలరించును ;వీని - గోలంతా కళలుగా ;వెల్లి విరియు హరి విల్లులు ||
@@@@@@@@@@@@@@@
naMdana vanamuna naakamu basa
___________________________
gOraMta venna muddachaalu! chaalannaaDE! ;kona gOTi mIda girini ;nilipinaTTi giri dhaari,gOvardhana giridhaari ;gOviMduDu, mana gOviMduDu ||manasijuni janakuDu ;mana paaliTi kalpa taruvu ;kanu maayaga swargammEbRMdaa-vanilO viDidi sEse!manasaaraa taluchudu(/da)mu ;gOviMduni, mana gOviMduni ||madanOtsava vilaasuDu ;kodama siMha samaanuDu;adarahO! bahu tuMTari! ;madi madinI alariMchunu ;vIni gOlaMtaa kaLalugaa ;velli viriyu hari villulu ||@@@@@@@@@@@@@@@@@@
Friday, January 14, 2011
తీపి అచ్చులు, హల్లులు
ముక్క, ముక్క - చెరుకు ముక్కముక్కలోన తీపి రసముతీయని రసమును తీసీ తీసీబానలలోన మెండుగ వండీదండిగ బెల్లపు దిమ్మలు వచ్చె!మధురమ్మౌ ఆ అచ్చులు తెచ్చీనాన్నారేమో అమ్మకు ఇచ్చిరి;అమ్మ చేతి కమ్మని స్వీట్లునచ్చెను పిన్నలు, పెద్దలందరికి!అరిసెలు తింటూ గంతులు ఆటలు;"చిందులు చాలును! చదువుల వేళయె!"నంటూ తాత గద్దించెను"అచ్చులు, హల్లులు నేరుస్తాముభారత మాతకు జై!జై!జై!జోతలు!రేపటి పౌరులం పిల్లలమేము!"
Wednesday, January 12, 2011
చంద్రుని పూర్వ పుణ్యము
సంభ్రమానందములు ;వ్రేపల్లె వాసులకు - కైవశమ్మాయెనమ్మా!వనితరో! కైమోడ్పు కన్నయ్యకే! ||చిన్నారి క్రిష్ణయ్య ;చిరు నవ్వు శిల్పములు ;ఆ కళా నైపుణ్యముల్ ;కూడి, నిత్య పౌర్ణిమలాయెను;చందురుని - పూర్వ పుణ్యములేమిటోను?బూచి రేయిని విడిచి;వినీల గాత్రుని పొందెనమ్మా! ||క్రిష్ణయ్య వేసేను ; బుడి బుడి అడుగులను!;పద ముద్ర పద్మమ్ములు ; ప్రతి అడుగు చూడగానూ;ఓ జనని!- ఆటలకు గురువులాయే!;నాట్యాలు నేర్పెనమ్మా! జనులకు నాట్యాలు నేర్పెనమ్మా! ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
SaMBramaanaMdamulu ;vrEpalle vaasulaku ; kaivaSammaayenammaa!vanitarO! kaimODpu kannayyakE! ||chinnaari krishNayya ;chiru navvu Silpamulu ;aa kaLA naipuNyamul ; kUDi,nitya paurNimalE aayenu;chaMduruni -pUrva puNyamulEmiTOnu? ||krishNayya vEsEnu ;buDi buDi aDugulanu!;prati aDugu chUDagaanuu;O janani! , aaTalku guruvulaayE!;naaTyaalu nErpenammaa! –janulaku naaTyaalu nErpenammaa! ||
Tuesday, January 11, 2011
కవితల చెక్కిలి బంగరు రజనులు
;;;;;;;;;;;మబ్బులు,మబ్బులు, మబ్బులుదుబ్బుల మబ్బులు దబ్బున వచ్చెనుమెత్తని మబ్బులు మెత్తల మబ్బులు,తొలకరి ఆటల ముద్దుగ వచ్చెను ||మబ్బులు,మబ్బులుదూది మబ్బులు,నీలి మబ్బులుఛప్పన్నారు దేశాలన్నీ ;చుట్టి వచ్చిన చిత్రపు మబ్బులు ||నెమలి నాట్యముల ప్రేక్షకులు!మల్లీశ్వరికి నేస్తాలు,దేవుల పల్లి కలము కజ్జలముల్చిటికెల చిందుల చెంగున వచ్చెను ||కాళిదాసుని కవితల పల్లకీధవళపు మబ్బులు"మేఘ సందేశము" ఒడిలో బాలలుకవితల చెక్కిలి బంగరు రజనులు ||మిల మిల తారల చుట్టాలు;తళుక్కు మెరుపుల నేస్తాలువాన చినుకుల పందిరులుగగనపు పౌడరు పఫ్(=puf) లు మబ్బులు ||
పరిమళాల పెన్నిధి!
గాలికి మోదం కూర్చును పూవులుపువ్వుల నేస్తం చేయగనేసుగంధమ్ముల గనిగా ఆయెను గాలిపువ్వులతోటి స్నేహ హస్తమునుఅందుకున్నదీ చిరు గాలిఐనది గాలి;ఆ వెనువెంటనెసౌగంధమ్ముల నిలయము, పెన్నిధి!మలయ పవనములు సాగీ, సాగీ, పయనాలు;పైరుల, తరువుల పలకరింపులు ;ప్రజలందరికీ ప్రకృతి జననీ – అర్చనఎపుడూ ఆమోదం, అది ఆహ్లాదకరం.ప్రకృతిలోని ప్రాణి కోటితోజతలు కూడిన సమ తౌల్యతపైఉండ వలెను అవగాహన సదా సజ్జనులారా!బుజ్జగించుచూ, నుడివెను ఉదయం.
తోడు నీడల బంధాలు, ముచ్చట్లు
కొమ్మలు -కోయిల, పిచ్చుక, రామ చిలుకలు,మైనా, నెమలి, పాల పిట్టలు,అగణిత వన్నెల విహంగాళికీ ఆరామాలు !కన్ను దోయితో సొగసు వీక్షణంకర ద్వయముతొ కార్యాచరణంపదముల జంట చేర్చును గమ్యం!వీనులు రెండూ శ్రావ్య మోహనం ;పెదవులు జత పడి, పదముల కేళీజతలు జతలుగా స్నేహాలు;జట్టు కట్టిన నేస్తాలు ;తోడు నీడల బంధాలు ;చేతులు కలిసిన చప్పట్లు ;జంట కవులకు ముచ్చట్లు;
Subscribe to:
Posts (Atom)