Saturday, September 15, 2018

బలభద్ర పాత్రునిదె అంతా భారం

మళ్ళీ ఘర్షణ క్రిష్ణయ్య ; 
అన్న తోటి ఇటు - మళ్ళీ మళ్ళీ ; - 
కృష్ణ ;- 
నేను మన్ను తింటినని చాడీలు ; 
ఆపకుండగా చెబ్తుండడము పరిపాటి ; 
నీకు భలే అలవాటు, ఓ అన్నా,
నీకిది సతతం సతాయింపులే!
బలరామ ;- 
ఐతేనేమి, నిఖిల విశ్వములు నీ వదనమున ; 
చూపిన జాలము నీదేను ; 
తరియించెనులే యశోద మాత ;
మన యశోద మాత ; || 
కృష్ణ ;- 
జగతి కోసమా నీ చింత!? 
ఆదిశేషు అపర అవతారము నీవు ; 
అందుకె ఇవిగో లోకములు ; 
నీ శిరసున పెట్టేస్తున్నాను ; 
ఇకపై అంతా నీదే భారం ; 
సహస్రఫణాళి క్షీరాబ్ధివాసీ! నేటి కిప్పటికి - నా అన్నా! 
బలభద్ర పాత్రుని రూపమున ; 
అలరారేటి సోదరుడా! ఇవిగో కొనుమా, 
బుజబుజ రేకుల ఇంపు ముద్దులు ;  ||                 

పాట - 2 ; 
============================;
paaTa - 2 ;- 
maLLI gharshaNa krishNayya ; 
anna tOTi iTu - maLLI maLLI ;
kRshNa ;- nEnu mannu timTinani caaDIlu ; 
aapakumDagaa cebtumDaDamu paripaaTi ; 
neeku bhalE alawaaTu ;
O annaa,neekidi satatam sataayimpulE!
balaraama ;- aitEnEmi, 
nikhila wiSwamulu nee wadanamuna ; cuupina 
jaalamu needEnu ; tariyimcenulE yaSOda mAta ; ||
;
kRshNa ;- jagati kOsamaa nee cimta!? 
aadiSEshu apara awataaramu neewu ; 
amduke iwigO lOkamulu ; 
nee Sirasuna peTTEstunnaanu ; 
ikapai amtaa needE bhaaram ; 
sahasraphaNALi ksheeraabdhiwaasee! ; 
nETi kippaTiki - naa annaa! 
balabhadra paatruni ruupamuna ; 
alaraarETi sOdaruDA! iwigO konumaa,
bujabuja rEkula impu muddulu ;  || 

అన్న బలరామ్ వేసెను ఛూమ్ మంత్రం

బలరామ్ ;- చెప్పిన మాట వినవు కదా ; 
ఉన్న మాటంటే ఉలుకు నీకు ; 
మన్ను బొక్కుట నీ అలవాటు ;
తెగ బొక్కుట నీ అలవాటు ;
మిన్నుల నీలపు వన్నె క్రిష్ణుడా! ;  || 
;
క్రిష్ణ ;- ఐతే అమ్మకు చెప్పుట నీ అలవాటే, 
అన్నా, చాడీలు చెప్పుట నీకలవాటే,  
హన్నా అంటూ నా చెవిని ; 
మెలితిప్పినది అమ్మ యశోద, 
అమ్మా! ఇంకా నా ఈ చెవి నొప్పి ;  || 
; &
కృష్ణ ;- నల్లని వాని ఇరు కర్ణములు ; 
ఎర్రని రంగున - వింతగున్నవిలే భలేగా,
అనుచూ నా నేస్తాలు హేళన చేతురు ; 
గున్నమామిడి తోపుల వద్ద ఎగతాళి  చేతురు ;  || 
;
బలరామ ;- ఛూమ్ మంత్రం వేస్తాను, 
సరేనా, కన్నయ్యా ; 
కాకీ కాకీ - కలవల కాకీ ; 
మా తమ్ముని బాధను ఎత్తుకు పో! ;  
అంటూ అన్నయ - బలరామన్నయ్య ; 
వేసెను ఉత్తుత్తి  మంత్రం ; 
చిటికెలొ రోదన మటుమాయం ; 
అన్నదమ్ములు ఆటలు సందడి ; 
వెన్నెల విందులు బహు పసందులు ;  || 
;        
==========================;
;
ceppina maaTa winawu kadaa ; 
unna maaTamTE uluku neeku ; 
mannu bokkuTa nee alawATu ;
tega bokkuTa nee alawATu ; 
minnula neelapu wanniya krishNuDA! ;  || 
;
krishNa ;- aitE ammaku ceppuTa nee alawaaTE, 
annaa, ceppuTa neekalawaaTE : 
hannaa amTU naa cewini ;

melitippinadi amma yaSOda, 
ammaa! imkaa naa ee cewi noppi ;  || 
& ;-
] kRshaNa ;- nallaniwaani iru karNamulu ; 
errani ramguna - wimtagunnawilE BalEgA ;
anucuu naa nEstaalu hELana cEturu ; 
gunnamaamiDi tOpula wadda egatALi  cEturu ;  || 
;
balaraama ;- Cuumm mamtram wEstaanu, 
sarEnaa, kannayyaa ; 
kaakee kaakee ; kalawala kaakee ; 
maa tammuni baadhanu ; 
ettuku pO!"  amTU 
annaya - balaraamannayya ; 
wEsenu uttutti  mamtram ; 
ciTikelo rOdana maTumAyam ; 
annadammulu aaTalu samdaDi ; 
wennela wimdulu bahu pasamdulu ;  || 
;

భామిని పౌర్ణమి పర్వాలు

వెదజల్లీ జల్లీ వెన్నెల ; 
జాబిలి పూవై నింగిని ;
చల్లీ చల్లీ పుప్పొడి ; 
పారిజాతం పూవులయె ;  ||
;
ముసురు ముసురులు 
ముదిగారములు ; 
అభిషేకిస్తిమి క్రిష్ణుని - తామేనని ;  ||

మురిసీ మురిసీ మబ్బులు ; 
కన్నయ నీలిమ పొందెనని  ;
కురిసీ కురిసీ నవ్వులు ; 
భామిని పున్నమి పండగలయె ;  ||
;
మసిలీ మసిలీ ప్రతి అడుగు ; 
ముని మానసము హర్ష ప్రసూనం ; 
గోపీ కృష్ణ రాసలీలలు ; 
లక్షణ పరిమళ సంపూర్ణం ;  ||
;   
================;
;
wedajallee jallee wennela ; 
jaabili puuwai nimgini ;;
callee callee puppoDi ; 
paarijaatam puuwulaye ;

musuru musurulu ;
mudigaaramulu ; 
abhishEkistimi krishNuni tAmEnani ;
;
murisee murisee mabbulu ; 
kannaya neelima pomdenani 
kurisee kurisee nawwulu ; 
bhaamini punnami pmDagaye ; 
;
masilee masilee prati aDugu ; 
muni maanasamu harsha prasuunam ; 
gOpee kRshNa raasaleelalu ; 
lakshaNa parimaLa sampuurNam ;  || 

దశదిశలను తోటలుగా మలచేటి కిలకిలలు

ఉప్పొంగి ఉప్పొంగి 
ఉరకలేస్తున్నాది ; 
నీలి యమున వాహిని ; 
ఎందుకని? ఎందుకని? ఎందుకని?;  || 

నల్ల నల్లనివాడు ; 
తెల్ల నవ్వుల వాడు ; 
అల్లరల్లరి వాడు ; 
అలనల్లన వస్తూన్నది - 
ఎవ్వరది? ఎవ్వరనీ!? ; 
ఆ వచ్చేది మన క్రిష్ణమ్మ ;  || 

యమున తరంగాల పయిన ; 
వయ్యారము లొలక బోసేను వెన్నెల ;
సయ్యాటల తెలి వెన్నెల ; 
వ్రేపల్లియ యావత్తు - చేరేను యమునా తటి ; 
సరిత్తు యావత్తు నిలువెత్తు గిలిగింతలు ; 
రాసనాట్య వేదికయే ఐనందున ; 
రాసనాట్య వేదిక - తానే అయినందున ;  || 

రాసలీల రాసలీల రాసలీల ; 
ఎటు చూసిన రాసలీల ;

చిటికె చిటికె చిటికెలు ; 
చిటి వేళ్ళపైన చిటికెలు ;

కొస వ్రేళ్ళ పైన చిటికెలు ; 
చప్పట్లు చప్పట్లు చప్పట్లు ; 
కలువ పువ్వులంటి అర చేతుల చప్పట్లు ; 

కిలకిలలు కిలకిలలు కిలకిలలు ; 
కిలకిలల నగవులన్ని వెదజల్లు తావులతొ ; 
దశదిశలను  తోటలుగా మలచేటి కిలకిలలు ;  || 
;
=============================;  ;
;
uppomgi uppomgi urakalEstunnaadi ; 
neeli yamuna waahini ; 
emdukani? emdukani? emdukani?;  || 

nalla nallaniwADu ; tella nawwula wADu ; 
allarallari wADu ; 
alanallana wastuunnadi - ewwaradi? 
ewwaranee!? ; 
aa waccEdi mana krishNamma ;  || 

yamuna taramgaala payina ; 
wayyaaramu lolaka bOsEnu wennela ;; 
sayyaaTala teli wennela ; 
wrEpalliya yaawattu ; 
cErEnu yamunaa taTi ; sarittu yaawattu niluwettu 
giligimtalu ; 
raasanaaTya wEdikayE ainamduna ; 
raasanaaTya wEdika taanE ayinamduna ;  || 

raasaleela raasaleela raasaleela ; 
eTu cuusina raasaleela ;

ciTike ciTike ciTikelu ; 
ciTi wELLapaina ciTike  ;
kosa wrELLa paina ciTikelu ; 
cappaTlu cappaTlu cappaTlu ; 
kaluwa puwwulamTi 
ara cEtula cappaTlu ; 

kilakilalu kilakilalu kilakilalu ; 
kilakilala nagawulanni ;
wedajallu taawulato ; 
daSadiSalanu  tOTalugaa 
malacETi kilakilalu ;  ||

కళ్ళలోన లక్ష వత్తులు - ఎదురుతెన్నులు

కళ్ళలోన యావత్తూ ; 
ఎదురుచూపులు ; 
క్రిష్ణయ్యా. నీ కోసము - 
ఎదురుతెన్నులు ;  ||
;
కళ్ళలోన వత్తులు ;
వేలు, లక్ష వత్తులు ;
క్రిష్ణయ్యా, నీ కోసము - 
ఎదురుతెన్నులు ;  ||
;
ఆట పాట చిత్రముల ; 
యవనిక తానెప్పుడూ ; 
విశాలమౌ యమునా సైకతమ్ములందున  ; 
కోట్లాదిగ పరివ్యాప్తిత హర్షముల వలయాలు ;  ||

నాట్య కళల లోకమ్ములు ; 
ఇట నెలకొన్నవి నీ కతమున ; 
ఇతిహాసము కథలకు కితకితలు ; 
నీ కతముననె కన్నయ్యా! 
మా చిలిపి చిన్నారి క్రిష్ణమ్మా ;  ||
;
===============;
kaLLalOna yaawattuu ; 
edurucuupulu ; 
krishNayyaa, nee kOsamu ;
edurutennulu ;  ||
;
kaLLalOna wattulu ;
wElu, laksha wattulu ; 
krishNayyaa. nee kOsamu - 
edurutennulu ;  ||

aaTa paaTa citramula ; 
yawanika taaneppuDU ; 
wiSaalamau yamunA saikatammulamduna  ; 
kOTlaadiga pariwyaaptita harshamula walayaalu ;  ||
;
naaTya kaLala lOkammulu ; 
iTa nelakonnawi nee katamuna ; 
itihaasamu kathalaku kitakitalu ; 
nee katamunane kannayyaa! 
maa cilipi cinnaari krishNammaa ;  ||  

పుష్ప లతల నిశ్శ్రేణి ఆలంబన ఆరోహణ

ఆలంబనమే - 
అతని నవ్వు కాంతుల ; 
పుష్ప లతల నిశ్శ్రేణి ;
ఆలంబనమే - ఆరోహణమే ;  || 
;
ఆరోహణ ఆరోహణ ; 
సంగీతం రాగముల ; 
మృదు మాధురి ఆరోహణ ;  || 
;
లాక్షణికం లాక్షణికం ; 
లక్షణమౌ లాక్షణికం 
సూత్రముల అల్లికలను అందించును ; 
అతగాడి సుతిమెత్తని హొయలొలికే కదలికలు ;  || 
;
కదలికలే నాట్యాలు, లాస నర్తనముల ; 
ఎల్లరిని పులకింతల తేలించే అతడెవరు, అతనెవరు!? 
నెనరుగ చెప్పాలంటే - వేరెవ్వరు ఔతారు, 
మన అందరి శ్యామకృష్ణుడే కదటే ఓయమ్మా! ;  || 
;
================; ;
;
aalambanamE - 
atani nawwu kaamtula ; 
pushpa latala niSSrENi ;
aalambanamE - aarOhaNamE ;  || 
;
aarOhaNa aarOhaNa ; 
samgeetam raagamula ; 
mRdu maadhuri aarOhaNa ;  ||
;
laakshaNikam laakshaNikam ; 
lakshaNamau laakshaNikam 
suutramula allikalanu amdimcunu ; 
atagaaDi sutimettani kadalikalu ;  ||
;
kadalikalE nATyaalu, laasa nartanamula ; 
ellarini pulakimtala tElimcE ataDewaru, atanewaru!? 
nenaruga ceppaalamTE - wErewwaru autaaru, 
mana amdari SyaamakRshNuDE kadaTE OyammA! ;  ||

Friday, September 14, 2018

పల్లెపట్టు గుబాళింపు

ప్రకృతికి పులకింత,
బ్రహ్మ తూలికకు ;
పన్నీటి చిలకరింత,
పల్లెపట్టు గుబాళింపు ;  ||
;
వెన్నెల, వెన్నెల, వెన్నెల ;
వెన్నెల కొలతలు ఎంత?
వెన్నెల తూకం ఎంత?
దుత్తలోని వెన్నలతొ సరి సమం ;  ||
;
వెన్నెల, వెన్నెల, వెన్నెల ;
వెన్నెల తూకం ఎంత?
వీశ, మానిక, కుంచం ;
ఆ గగన పర్యంతం ;   ||
;
వెన్నెల బరువు ఎంత? 
మన కృష్ణుని నవ్వు అంత ;
కాదు, క్రిష్ణ హాసములకు ;
ఎంత మాత్రమూ సరితూగవులే!
అవి సరితూగవులే!  ;   ||

యమునానది వడ్డాణం

నందనవనము,
శ్రీ బృందావనము  ;  ||
;
నది ఒడ్డు వడ్డాణం! 
వ్రేపల్లెకు -
ఆ యమునానది వడ్డాణమే! ;  ||
;
దోబూచి, దొంగాట  -  గుజ్జనగూళ్ళు ;
ఎన్నెన్నో క్రీడలను - అందించెను ఈ తోట ;
అందించినదీ తోట  ;  ||
 ;
ధరణి దివికి ఒసగేటి అభినందనము ;
ఇదే ఇదే-
ధరణి - దివి కొసగే అభినందనము  ;  ||

టిక్ టిక్ టిక్ కోలాటం

మోదముల సందడి, నిత్య సందడి ;
సందడితో త్రుళ్ళింతల నందనవనము,  
బృందావనము ; శ్రీ బృందావనము ; ||
;
మల్లె, పొగడ, చేమంతీ విరుల భాష "సౌగంధం" : 
సుగంధముల బృందావని ; భువికి రాజ పతకము ;  ||
;
గోప వనితల చేత ; దండలు, పువుల దండలు ;
దండలతో పాటుగా కోల కర్రలు ;
దండములు; వెదురు దండములు ;
టిక్ టిక్ టిక్ ; టిక్కు టిక్కు టిక్కు ;  ||
;
కోలాటపు కర్రలను అందుకొనెను రాధిక ఆను;
కళలకు కాణాచి తాను; కోమలత్వ పెన్నిధి ;

క్రీడా దండమ్ముల వడివడి సవ్వడి ;
టిక్ టిక్ టిక్ ; టిక్కు టిక్కు టిక్కు ;  ||
;
కోలాటపు కర్రలను అందుకున్నది రాధ ;
టిక్ టిక్ టిక్ - టిక్కు టక్కు టిక్కు టుక్కు టెక్కు  ;
వాసంత  ఋతువు - అందుకునెను ఆహ్వానము!
ఆహ్లాదపు ఆహ్వానము! హర్ష ఆహ్వానములు ; ||

కలల ఊట కన్న బాట

పదే పదే అదే మాట ; 
తుంటరి గోవిందు పేరు ; 
లోలాక్షీ! ఏమందును, 
అది, నిద్దుర - స్వప్నాల -
ఊట కదటే ఓ యమ్మా :   || 
;
ప్రతి క్షణము, ప్రతి పూట వింత ఈ క్రిష్ణ లీల ; 
ప్రతి రోజు, ప్రతి చోట అదే దే క్రిష్ణ హేల ;
అది, నిద్దుర - మెలకువల -
స్వప్నాల - ఊట కదటె ఓ యమ్మా :   || 
;
వాడుకతో అతను నడచు వింతదైన బాట ; 
భక్త కోటిని చేర్చును లక్షణంగ సంక్లిష్ట రహిత సీమ ;
అది, జాగృత్ - చేతనల -
స్వప్నాల -ఊట కదటె ఓ యమ్మా :   || 
;
అలుపు సొలుపు నెరుగనీయని నడక ;
ఎల్ల జనులు చేరేటి - గమ్యం తేనె తేట ;
వెల్లడి అగు ప్రతి మనిషికి, అది గొప్ప వేడుక ;
ఆనందం, ఆదర్శం - లక్ష్యసిద్ధి ధీమా :   || 
;
పదే పదే అదే మాట ; తుంటరి గోవిందు పేరు ;  
వెంట వెంట వచ్చేస్తూ - అండ ఉండు శ్రీరక్ష  ;
========================;
;
padE padE adE mATa ; tumTari gOwimdu pEru ; 
lOlaakshee! Emamdunu, adi niddura - 
swapnaala uuTa kadaTE O yammaa :  || 
prati kshaNamu, prati puuTa ; 
wimta ee krishNa leela ; 
prati rOju, prati cOTa adE idE krishNa hEla ;  || 
waaDkatO atanu naDacu ; wimtadaina bATa ;
bhakta kOTini cErcunu ;
lakshaNamga samklishTa rahita seema ;;  ||
alupu solupu neruganeeyani naDaka ;
ella janulu cErETi - gamyam tEne tETa ;
wellaDi agu prati manishiki, adi goppa wEDuka ;
aanamdam, aadarSam - lakshyasiddhi dheemaa ; 

గాలి చెవులు మెలితిప్పి వేణువులో కూర్చిన ప్రజ్ఞ

గాలి చెవులు మెలి త్రిప్పి ; 
వేణువులో కూరినావు ; 
ఆహాహా! నీ చేష్ఠలు, చిలిపి చర్యలు ;  || 
;
కొండగాలి ఏమో అదుపు లేనిది ;
ఎండ గాలి సెగలు, పొగలు ఎగజిమ్మేను ;
నీదు - నెమ్మేను కమిలిపోవుననీ నాకు భీతి ;  ||  
;
పిల్లగాలి తెచ్చినది మల్లె తావిని  ;
నది మలయ సమీరం - చల్లనిది ఉన్నది ; 
ఇది చాలు కదా, అంటేను నవ్వుతావు ;  ||  
;
నీ నవ్వుల ఓలలాడు - నిఖిల విశ్వ తేజములు  ;  
నిను కంటూ - ప్రతి ఒక్కరము ఇపుడు ;
మాత యశోదలమే ఐతిమిలే వేణుధరా ;  || 
;
=
gaali cewulu meli trippi ; 
wENuwulO kuurinaawu ; aahaahaa! 
nee cEshThalu, cilipi caryalu ; ;  || 
;
2] komDagaali EmO adupu lEnidi ;
emDa gaali segalu, pogalu egajimmEnu ;
needu - nemmEnu kamilipOwunanee naaku bheeti ;  || 
;
pillagaali teccinadi malle taawini ;
nadi malaya sameeram - callanidi unnadi ; 
;
idi caalu kadaa, amTEnu nawwutaawu ;
nee nawwula OlalADu - nikhila wiSwa tEjamulu 
ninu kamTU - prati okkaramu ipuDu ; 
maata yaSOdalamE aitimilE wENudharaa ;

తన నవ్వు కాగడా దివిటీలు

Qn :- రాధిక మనోహరుడు ;  
రాధికకా మనోహరుడు ఇతడు!? ;
Ans ;- రాధికా మనోహరుడు - ఇతడే, 
నీలమోహనాంగుడు, కృష్ణుడు ;  || 
;
మేలిముసుగు జల్లెడ బాగున్నది ;
నీ మేలిముసుగు జల్లెడ బాగున్నది! ; 
ధూళిని వడబోసి, మనము  ;
చుక్కలను ఇద్దాము నింగికి ; 
తళుకు చుక్కలను ఇద్దాము నింగికి ; ; 
అంటూంటాడు బహు తుంటరి ;   ||
;
ఆరు బయట తోటలు ; 
ఆ పచ్చిక బయలులు ;
కనబడదు తేటగా ఆరంజ్యోతి ; 
ఆ అరుంధతీ తారనిపుడు చూడాలి తక్షణం ; 
వృషభాను పుత్రీ! 
సత్వరమే ఇవ్వు నాకు నాకు  ;
కాగడా, దివిటీలను; 

శత కోటి  వెలుగు నీ నవ్వులను ;  ||
;
======================; ;
;
mElimusugu jalleDa baagunnadi ;
nee mElimusugu jalleDa baagunnadi! ; 
dhuuLini waDabOsi, manamu  ;
cukkalanu iddaamu nimgiki ; 
taLuku chukkalanu iddaamu nimgiki ; ; 
amTuumTaaDu bahu tumTari ;   ||
;
aaru bayaTa tOTalu ; 
aa paccika bayalulu ;
kanabaDadu tETagaa aaramjyOti ; 
aa arumdhatee taaranipuDu cUDAli takshaNam ; 
wRshabhaanu putri , 
satwaramE iwwu naaku naaku  ;
kaagaDA, diwiTeelanu; 

Sata kOTi  welugula nee nawwulanu ;  ||