Monday, February 27, 2012

గురు శిష్య పరంపర


;
నీలాల మేఘాలు దడబిడా వచ్చేయి;
ఆకసములోన ఆగమాగం చేస్తు, అల్లరిగ తిరిగేను;
మొయిళులను సాగరుడు పరికించి
చల్లనీ గాలులను పంపేడు;

శీఘ్రమే అవి వెళ్ళి, మబ్బులకు చెప్పాయి
"మలయ పవనాలము; మమ్ము మీ గురువులుగ,
నియమించినాడు జల దేవుడు"
గాలులకు శిష్యులై, మబ్బులు నేర్చాయి;
ఉరుముల గీతములు, మెరుపుల కావ్యములు;

ఇన్ని విద్యలు తెలిసి ఉన్నట్టి జలదములు,
అందరి మన్ననల నించక్క పొందాయి;

చినుకుల బాలురు నీరదమ్ముల విద్యార్ధులైనాయి;
వాన చినుకులు వైన వైనాలుగా;
మడుగు, చెరువులు, ఏరు, జలనిధుల నెన్నిటినొ;
వసుధ జననికి ఒసగ; 
ధరణి మృదు హాసముల సకల ప్రాణులకును, 
హర్షాతిశయ దివ్య దీవెనలు ఒసగేను! 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Friday, February 24, 2012

నాకీ photo నచ్చింది.


ఈ నాటి సామాజిక పరిస్థితులలో
బాల్య దశలోని సౌకుమార్య, లాలిత్యాలు
ఎంతవరకు సురక్షితముగా ఉన్నవి?
ఈ ఫొటో- ఇందులో- సూక్ష్మం గా, నేటి అవస్థలను,
చూసీ చూడగానే ఆకట్టుకునే వ్యంగ్య భావములోని వ్యగ్రత-
అందుకే నాకు ఈ photo నచ్చింది.

ఇరుక్కున్న ముక్కు


Beaverton City Library


చిలక చిలక, రామ చిలుక;
ముక్కు మీద టెక్కు కోపం; 
కోపం, అలుక కుప్పలు అయ్యి; 
ముక్కు కాస్తా ఎర్రన ఆయెను;

ఎర్రన, తిమ్మన- 
ముక్కు కవితలకు; 
అల్లికలెన్నో అందించినది 
రాచిలకమ్మ చిన్ని నాసిక

ఎర్రని -అలకల- కినుకల శుకము 
దోర జామ పళ్ళను చూసీ……….
చూసీ, చూడగనే…….. 

Q:- ఆ! ఏం చేసినది? 
     ఆహాహా! ఏమి చేసినది?

జామ కాయను కొరికె కసుక్కున;
పండులొ ముక్కు ఇరుక్కున్నది
జామ కాయను కొరికె కసుక్కున;
పండులొ ముక్కు ఇరుక్కొన్నది! 

కొమ్మలొ కోతి నవ్వె కిసుక్కున!                         
హ్హి హ్హి హ్హీ! వ్వె వ్వె వ్వే!
వెక్కిరింతల కోతికి డిల్లా!
చక్కిలిగింతల జిల్లాయీలు!

                      (అందరూ నవ్వుతారు)

హ్హి హ్హి హ్హీ! వ్వె వ్వె వ్వే!

]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]
Published On Friday, February 10, 2012 By ADMIN. 
Under: ఆట - పాట, పాటలు. 
రచన  : కాదంబరి పిదూరి


Thursday, February 23, 2012

పరాంతిక సీత, Butter fly


పరాంతిక సీత: శ్రీరాముని ధర్మ పత్ని సీతాదేవి-
ఈ పేరును ఒక సీతాకోకచిలుక- సంపాదించుకున్నది.
హిమాలయాలు, కాశ్మీరు, ఇంకా
ఉత్తర భారతదేశము, టిబెట్, సిక్కిం, తైవాన్, మలయా మున్నగు దేశాలలో
ఈ పరాంతిక సీత- అనే జాతిని పరిశోధకులు  కనుగొన్నారు.
Ussuri, Sakhalin మున్నగు కంట్రీలలో కూడా ఈ ~ ఉన్నవి.
The Chestnut Tiger (Parantica sita)[Danaid group]
వీని రెక్కలు ప్రత్యేకత వలన ఈ గుర్తింపు వచ్చినది.
క్రింది రెండు రెక్కలు, వింత రంగును కలిగినవి.
ఛెస్ట్ నట్ వన్నె= దీనినే ఇండియన్ రంగు- అని
పేరును - విదేశీయులు- పెట్టారు-
గోధుమ రంగు మిళితమైన ఎర్ర రంగును ఛెస్ట్ నట్/ ఇండియన్ ఎరుపు రంగు-
అనే  పేరుతో పిలుస్తున్నారు.
Chestnut/ Indian red, is a color, a medium brownish shade of red

ఇండియన్ బటర్ ఫ్లై ఆర్గనైజేషన్ ఇత్యాది సంస్థలు
మన  ఇండియాలోని సీతాకోకచిలకల గురించి విషయసేకరణలో నిమగ్నమై, కృషి చేస్తూన్నవి.

Wednesday, February 22, 2012

శోభిల్లు బొమ్మల కొలువులు!



















కొండల దేవరా! కొలువునకు వేళాయె!
కొలువు తీరగ స్వామి! తీరుగా రావోయి!
మా కన్నులందున నీవున్న దృశ్యాలు;
ఉన్నత శోభల బొమ్మల కొలువులు!    ||మా కన్నులందున||

నీ తీపి పలుకులలొ సతి సోగ చూపులు;
కుదురుగా ఉయ్యాల లూగుచుండంగా;
కొండల దేవరా!
కొలువునకు వేంచేయ- మరచినావేమో!?
ఔరౌర!గొబ్బున రావోయి!      ||మా కన్నులందున|| 

సోమరిపోతు అయి; విహగ రాజు అటనె;
మబ్బు పీఠము పైన కూర్చుండి పోయేనొ?
గరుడ వాహన!
నీవు, కొలువునకు రాకుండ ఇంటనే ఉన్నావ!?
ఔరౌర! వేగమే రావోయి!       ||మా కన్నులందున||

ఆదిశేషుడు క్షీర ; సంద్రమ్ములోనే;
మత్తుగా కూళయై; బబ్బుండిపోయేనొ?;
పన్నగ శయనుడా!
కొలువునకు దయ సేయ- బద్ధకిస్తున్నావా?
ఔరౌర! దబ్బున రావోయి!     ||మా కన్నులందున||

&&&&&&&&&&&

Thursday, February 16, 2012

అత్తరు పలుకుల చిలకమ్మ




చిలకరించవే! చిలుకా!
పన్నీటి పలుకులను
చిలకరించవే! చిలుకా!||

మా పద్మావతీ వదన బింబము
జేవురించి, వసి వాడి ఉన్నది
ఎందుకనో, ఏమో గానీ, ఎరుగ నేరకున్నాము
లిప్తపాటులో సతి కినుక పోవగా
               || చిలకరించవే! ||

ఒక్కుమ్మడిగా ఓరచూపులు
జారుచు, నాధుని ప్రణయ పంజరము
లీలగనవగా, మదన సంబరము
అది గని ప్రకృతి ముదమున నవ్వగ
             || చిలకరించవే! || 
;

Wednesday, February 8, 2012

ఇబ్బడి ముబ్బడిగా క్రిష్ణ ప్రభలు









వెన్నెలా! వీక్షించుమమ్మా!
మబ్బు పలకను అందుకొనుమా!
నుడులు రాయుట నేర్చుకొనుమా!
దొరికె నేడు అవకాశం, - మహదవకాశం ||

నీలాల నీరములందు కేళీ
కృష్ణమూరితి ఈదులాడెను
తరంగముల పంక్తులందున;
వరదగుడుల లిపుల కూర్చిన
అక్షరాబ్యాసమ్ము చక్కగ జరుగుచున్నాది:
చూసి శ్రద్ధగ నేర్చుకొనుమా!

||దొరికె అవకాశం- మహదవకాశం ||


నీలి యమునా జలములందున;
మురిపాలు ఒలికే బాల క్రిష్ణుని;
ఆటపాటలు ఎంతొ ముద్దు!
ఇటు యామినికి అటునిఖిల జగతికి
కనుల నిండుగ వీక్షించి;
పొందుగ పరవశములన్

||దొరికె అవకాశం- మహదవకాశం ||
;

పల్లె పట్టులు వ్రేపల్లెలు;
బృందావనమున యమున సొగసుల;
క్రిష్ణ మరకత శోభలన్
ఇమ్మడిగా.....
అందుకొనె నింగి!
ముమ్మడిగా.....
శోభిల్లెను అవని ||
;

Tuesday, February 7, 2012

చిందు గోపాలం! సందె గోపాలం!



అందునా, నేనందునా!

;
బాలకృష్ణుడు వీడు ఇడుగో!
తన ప్రతి హేల- లీలా బింబమవగా;

అందునా, నేనందునా!?
చిందు గోపాలం! సందె గోపాలం!  ||

ఇంత కోపాలెందుకంటా!
అంతటీ సణుగుడులు, చిరు బుర్రులూ
అడగగానే యశోదమ్మ;
నెమలి ఈకలు ఇవ్వలేదని.....
||చిందు గోపాలం! సందె గోపాలం!||

గొణుగుడు, గుణుపు అలకలు;
ఎందుకోయీ? తెలుపవోయీ!
కుండ గోకుడు గోదావరి-
పిన్ని రోహిణి ఇవ్వలేదని
||చిందు గోపాలం! సందె గోపాలం!||
;

దోబూచులాటల మేటి క్రిష్ణుడు;
అందు వీడే! ఇందు వీడే!
వేరె నీకై వెదుకనేల?
సర్వంతర్యామివి నీవేనయా!
||చిందు గోపాలం! సందె గోపాలం!

           అందునా, నేనందునా!? ||

Monday, January 30, 2012

తెలుగు నదుల సందడి



జాతర! జాతర! జాతర! ;
గలగలల జాతర! ||

గోదారి, క్రిష్ణ వేణి, గంగమ్మ ఉరకలు
గౌతమీ కిన్నెరల కెరటాల తీవెలపై
వీణా గానములను వినిపించుము! వెన్నెలా! ||

తుంగభద్రా ఝరిలో జలకాలు ఆడుతూ
ముచికుందా కెరటాల మురిపాల సాగుతూ
ఉర్వికి వేంచేయండి ప్రాగ్ ఉదయ కిరణమ్ములార!

నాగావళి, పినాకినీ వాహినీ పద ముద్రల
గగన నీలిమలు శోభిలు నర్తనములు సేయగా
ప్రకృతియై తనరండీ సకల సౌందర్యాలూ!  ||

రాధా కృష్ణ చలనములు ఇతిహాసములు


chalanamulu itihAsamulu

రాధా కృష్ణుల చైతన్యం
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||

అద్దరి ఇద్దరి యమునా ఝరికి ;
కదిలే అలలకు గురువులైనవి;
ఇరువురి జల ప్రతి బింబాలు;
రాధా కృష్ణుల చైతన్యం  
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||  

మీ, క్రిష్ణ రాధికా బోధనల
అలలు నేర్చినవి
కదన కుతూహల రాగములు
రాధా కృష్ణుల చైతన్యం
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||

శశి బింబముల వెన్నెలకబ్బెను
కథా కథనముల చాతుర్యం
ప్రకృతి మోవికి అద్దినది సుందర దరహాసం
రాధా కృష్ణుల చైతన్యం
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||
;

Sunday, January 29, 2012

వృక్ష మహిమ



;
మన హిందూ జ్యోతిష్యశాస్త్రానికీ, ఖగోళశాస్త్రానికీ అవినాభావ సంబంధం ఉన్నది.
అలాగే ఆయుర్వేద వైద్య విధానానికీ,ప్రకృతికీ కూడా!
ఈ సంప్రదాయమే “అహింసా విధానానికి” మూలస్తంభం గా నిలిచినది.
అందువలననే దేవాలయాలలో హిందూదేవ, దేవతా మూర్తులకు,
అనుసంధానంగా వాహనము బొమ్మ,
అలాగే ప్రతి గుడిలోనూ కనీసం ఒక చెట్టు-
స్థల వృక్షము సిద్ధాంత నిబంధనలతో ఉంటూన్నవి.
చెట్లు కొట్టేస్తూ, అడవులకు చేటు తెస్తూన్న
మానవుని స్వార్ధపరత్వం పర్యావరణానికి కలిగిస్తూన్న అపకారం ఎంతో-
అంచనాలకు అందనిదని,
అటు ప్రకృతిప్రేమికులూ, ఇటు వాతావరణ సైంటిస్టులూ ఘోష పెడ్తూనేఉన్నారు.
“వృక్షో రక్షతి రక్షితః” –
ధరణీ ప్రేమికులందరూ జపిస్తూనే ఉన్న
ఈ “వృక్షో రక్షతి రక్షితః” గొప్ప మంత్రము.

**********************************

స్థలములకూ, జాగాలకూ అపరిమిత డిమాండు ఏర్పడింది.
అందునా ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో మిన్ను తాకే ధరలు!!!!!
ఇలాటి పరిస్థితులలో మేడ్చల్ లో సాయిగీత ఆశ్రమము స్థాపించబడింది.
ఇక్కడ ఆయుర్వేద, ఖగోళ, చాంద్రమాన మూలసూత్రాలను
ప్రాతిపదికగా తీసుకుని వృక్షాలను పెంచుతున్నారు.
అవి కల్పవృక్షములు, దేవతావృక్షములు.
వీనిని “ధన్వంతరీ వృక్షములు” అని పిలుస్తున్నారు.
ఆశ్రమ నిర్వాహకులు “వృక్ష మహిమ” అనే పుస్తకమును అచ్చు వేసారు.
ఆశ్రమ సిద్ధాంతములు, ధ్యేయ, లక్ష్య, నియమాదులను
యావన్మందీ తెలుసుకోవడానికి ఈ పొత్తము ఉపకరిస్తుంది.

**********************************

“వృక్ష మహిమ” 203 పేజీలతో, కన్నులకు
ఏ మాత్రమూ శ్రమ లేకుండా చదివేటట్లుగా చక్కని ముద్రణతో వెలువడింది.
ఇందులో ఉన్న అనేక వివరములు;

విషయసూచిక:-

సాయిగీత ఆశ్రమము స్థాపన
ప్రకృతిలో చెట్లు, వాటి మహిమ
మహిమాన్విత వృక్షాలు
భక్తుల అనుభవాలు
పుట్టిన వారం అనుసరించి
ప్రత్యేక చెట్టును పూజించే వివరములు
వృక్షదేవతల నామావళి
శ్రీ సాయి నామావళి
శ్రీ వినాయక (విఘ్నేశ్వర) నామావళి
శ్రీ ఆంజనేయ; శ్రీ గరుడ నామావళి
అభయ మూర్తుల క్షేత్రము
గరుడ క్షేత్రము
ఆశ్రమ వైద్య కార్యకలాపాలు
ఆశ్రమములో జరిగే పండుగలు
ఆశ్రమ ప్రచురణలు

ఇలాగ అనేక వివరములతో పాటు
“పూజ్య సద్గురుగారి దివ్యవాక్కులు” భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నవి.

**********************************
;
;
” శివానంద లహరి”లో అయస్కాంతము చెట్టు ను గురించి
61 శ్లోకమును ఈ పుస్తమునకు (వృక్ష మహిమ)
మొదటి పుటలలో స్వీకరించారు. ఆ శ్లోకము:-

అంకోలం నిజ బీజ సంతతిః – అయస్కాంతో ఫలం సూచికా |
సాధ్వీ నైజ విభుం, లతాక్షతిరూహం, సింధుస్సరి ద్వల్లభమ్|
ప్రాప్నోతీహ యధా తధా పశుపతేః పాదారవిందద్వయమ్|
చేతోవృత్తిః రూప్యేత్యతిష్ఠతి సదా సా భక్తిరుచ్యతే|

తాత్పర్య భావము:- మనోవృత్తి పరమాత్మను వదలకుండినచో
అదే “భక్తి” అని వక్కాణము.

అమోఘ ప్రతిభాశాలి శ్రీ ఆది శంకరాచార్య రచించిన “శివానంద లహరి” లోని
61 వ శ్లోకం ఇది. అంకోలం విత్తనములు తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి.
ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల
ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి
లతలు/ తీగ- పాదపము యొక్క మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది.
నది సముద్రములో కలుస్తుంది.
పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు
భక్తి భావనలు లీనమౌతాయి.” అంటూ
శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.

ఇలాగ – ఊడుగ చెట్టు అనగా అంకోలం తరువును గురించిన
ప్రస్తావన ఉన్నది. ” Eranzhil tree / azhinjil (Tamil) /
అంకోలం చెట్టు Kanchi Mahaperiyavar,
Sri Chandrasekharendra Sarasvathi Swami:

భక్తి మార్గము యొక్క విశిష్టతను ” శివానంద లహరి”లోని
61వ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని చేసిన వర్ణన ఆణి ముత్యమే కదా!
తమిళ నాడులో “అంకోల గణపతి దేవళము” ఉన్నది.
స్వయం భూ గణపతి అంకోల పాదపము వద్ద వెలసెను;
అందు చేత ఆ సైకత వినాయకుడు – అంకోల గణపతి గా వాసి కెక్కెను.
తెలుగులో అనేక వ్యవహార నామాలు కలవు;

*********************************************************;

“వృక్ష మహిమ” అనే వారి పుస్తకము
2001 సంవత్సరమునాటి నుండి 5 ముద్రణలు పొందినది.
“వృక్ష మహిమ”
ధర: రూ. 30.00
కాపీలకు:-
సాయిగీతా ఆశ్రమము,
వయా బోయిన్ పల్లి,
మేడ్చల్ రోడ్,
కండ్లకోయ బస్ స్టాప్ ఎదురు రోడ్ లో;
మేడ్చల్ తాలూకా, రంగారెడ్డి జిల్లా;
ఫోను:(040)27500127;
(040)27500694;
(08418)248247)
e-mail: saigeethaashram@yahoo.com
swww.saigeethaashram.org


http://sgashram.org/index.html

[custom_author=కాదంబరి]

LINKS to essay&other informations:-
వృక్ష తరువు చెట్టు మహిమ (Web: pustakam.neth)
ప్రకృతి జనని,కోణమానిని;  టపా తేది: 28-10-10
రాసిన వారు: కాదంబరి
**************************

వివిధ సమీక్షలు


Debra Dembowski


COMMENTS తెలుగు
వృక్ష మహిమ
Posted  December 26, 2011  by  అతిథి
రాసిన వారు: కాదంబరి **************************
మన హిందూ జ్యోతిష్యశాస్త్రానికీ, ఖగోళశాస్త్రానికీ
అవినాభావ సంబంధం ఉన్నది.
అలాగే ఆయుర్వేద వైద్య విధానానికీ,ప్రకృతికీ కూడా!
ఈ సంప్రదాయమే “అహింసా విధానానికి” మూలస్తంభం గా నిలిచినది.
అందువలననే దేవాలయాలలో హిందూదేవ, దేవతా మూర్తులకు,
అనుసంధానంగా వాహనము బొమ్మ, అలాగే ప్రతి గుడిలోనూ
కనీసం ఒక చెట్టు- స్థల వృక్షము సిద్ధాంత నిబంధనలతో ఉంటూన్నవి.
చెట్లు కొట్టేస్తూ, అడవులకు చేటు తెస్తూన్న
మానవుని స్వార్ధపరత్వం పర్యావరణానికి కలిగిస్తూన్న
అపకారం ఎంతో- అంచనాలకు అందనిదని, [...]

FULL STORY »

4
COMMENTS తెలుగు
V.A.K. “ఆలాపన” కు “జై” అన్న ముళ్ళపూడి వేంకటరమణ
Posted  November 21, 2011  by  అతిథి
వ్రాసిన వారు: కాదంబరి ****************
వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు
అవిరళ కృషికి మహోద్గ్రంధ రూపమే
513 పుటల “ఆలాపన”.
శ్రీమతి భార్గవి గారికి ‘పుస్తకప్రపంచం’
ఋణపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఎందుకంటే సాహిత్యము అనే మొక్కకు నీరు పోసి,
సంరక్షణ చేసే వరద హస్తములు ఎప్పుడూ వందనీయాలే!
డాక్టర్ భార్గవి గారితో:”మాట మాట” (436నుండి 495 పేజీల వఱకు)
ఇంటర్వ్యూ ఈ పుస్తకమునకు హైలైట్. భార్గవి గారు 200 పేజీలు ఔతుందని
అనుకుని, ప్రచురణా కార్యక్రమానికి [...]

FULL STORY »

1
COMMENTS తెలుగు
ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము
Posted  July 23, 2011  by  అతిథి
రాసిన వారు: కాదంబరి *****************
“ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” –
రచయిత:- డాక్టర్ మంకాల రామచంద్రుడు గండ పెండేరములను,
అనేక బిరుదు సత్కారములను పొందిన విద్వాంసుడు ప్రకాశ రావు.
ఆశావాది ప్రకాశ రావు “ఆసాది” అనే దళిత ఉప కులమునకు చెందిన వ్యక్తి.
ఆసాదుల వృత్తి- కథా గానము.
వి.సుబ్రహ్మణ్యము నిఘంటు నిర్మాణ శాఖాధిపతి.
వడ్లా సుబ్రహ్మణ్యము ఆధ్వర్యములో మంకాల రామచంద్రుడు,
అవధానాచార్య ఆశావాది ప్రకాశ రావు గారి
జీవన ప్రస్థాన, సాహిత్య సృజన, కృషీ క్షీర [...]

FULL STORY »

0
COMMENTS తెలుగు
గొల్లపూడిమారుతీరావు ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా”
Posted  July 17, 2011  by  అతిథి
రాసినవారు: కాదంబరి ************ నిడదవోలు వేంకటరావు గొప్ప పరిశోధకుడు, పరిష్కర్తగా సాహితీ లోకములో గౌరవాన్ని పొందారు. గొల్లపూడి మారుతీరావు చెప్పినట్లుగా- నిడదవోలు వేంకటరావుకు అస్మదీయులందరికీ ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయి. గొల్లపూడి మద్రాసు రేడియో స్టేషన్ లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూన్నారు. ఆయన నిడదవోలు వేంకటరావును- ఒక ప్రసంగమును రికార్డు చేసారు. ఆకాశవాణి బిల్డింగులో నిడదవోలు వేంకటరావు వ్యాసాన్ని చదువగా, రికార్డు చేయడం పూర్తి ఐనది. ఆనక అక్కడ కబుర్లూ, సంభాషణలూ సాగాయి. నిడదవోలు వేంకటరావుగారికి మాటిమాటికీ- “అసలు”అనడము [...]

FULL STORY »

8
COMMENTS పాతబంగారం
కథ కంచికి…
Posted  August 5, 2010  by  రవి
..మనం ఇంటికి. మడతకుర్చీలో
 తాతయ్యా, పెరట్లో బాదం చెట్టు గట్టుకింద
అమ్మమ్మా, మనవలకు జానపద కథ చెబితే
ఆ కథ  ఇందాకటి  వాక్యంలా
అందంగా, అలవోకగా, సాంత్వనగా ఉంటుంది.
కథ చివర్లో బూచి మీద మంచి గెలుస్తుంది.
ఆ  ముగింపు – కథను కంచికి పంపేసి బుడతణ్ణి
ఇంటికి తీసుకొచ్చి నిదురపుచ్చుతుంది.
బిడ్డ మనసులో ఆనందం – నిద్రలో చిరునవ్వై,
కథ చెప్పిన తాతయ్య గుబురు మీసాలమాటున ఒదిగిపోతుంది.
ఇంతకూ బుర్రమీసాల తాతయ్యకూ, ముగ్గుబట్ట తల మామ్మకూ [...]

Total reviews ;
;