Sunday, March 20, 2011

దండాలు అందుకో! శ్రీ తిరుమలేశా!


పారిజాత దళము శత కోట్లను ;
పరచి ఉంచిన కొండ దారులందు
భక్త కోటి సేయు అధిరోహణం
వే వేల దండాలు అందుకో స్వామి!
శ్రీ తిరుమలేశా!అభయ వర దాతా! ||

మేఘ రాసులలోన - వాన శిల్పాలను
వెలయింప జేయుట- నీదు వంతు!
అందుకే కద! నీవె మాకు తండ్రి
వే వేల దండాలు అందుకో స్వామి!
శ్రీ తిరుమలేశా!అభయ వర దాతా! ||

అందియల రవళులు - వర్ష ఋతు ధారలు
అంద చందాల చిరు నవులు - మా వంతు
వే వేల దండాలు అందుకో స్వామి!
శ్రీ తిరుమలేశా! అభయ వర దాతా! ||

నీ నుదుట తీర్చిన - నిలువు నామమ్ములు
వరుస కొండల మెట్లు - వేంకట నాయకా!
వే వేల దండాలు అందుకొను'మా' స్వామి!
శ్రీ తిరుమలేశా! అభయ వర దాతా! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

తిరుమలేశుని అధర దరహాసములు























::::::::::::::::::::::::
కరుణార్ద్ర హాసములు;
నెలకొనిన మేడలు,
శ్రీ వేంకటేశు పెదవులు ||


విరిసేను తారకలు ;
వరహాల చిరు నవ్వుల;
దేవేరి - అర చేత గోరింట ;
చుక్కలే ఆయేను
తిరుచనూరు ; నిత్య దీప శోభ!
కార్తీక దీప శోభ! ||

పద్మావతీ కురుల అందాలను
నీలాంబరము హత్తుకునియేను;
ఆనంద కేతనము;రెప రెపలను చూసి,
నవ నృత్య భంగిమల
మలయ మారుత క్రీడ వయ్యారమే! ||

తిరు నామ దీప్తి వోలె సోపాన పంక్తి
















ఏడు కొండల మెట్లు;
మహిళలు, భక్తులు
పసుపు కుంకుమలను
అలదుచున్నారు
శోభిల్లు తిరు నామ దీప్తి వోలె
అవె సప్త గిరుల సోపాన పంక్తి ||

శ్రిత జన కల్ప తరువు,అభయ వర దాత!
మా చేయిని అందుకొను - వరద హస్తుడు, స్వామి!,
సప్త గిరులందున కొలువై ఉన్నాడు ||

ఆదుకునే స్వామి, కోటి వరములను
ఒసగేటి ఇలవేల్పుఅందుకొన వెళదాము,
అందుకనే - చూదాము శ్రీ వేంకటేసునీ
చూదాము చూదాము ||

తిరుమల గిరులు, శాంతి హారములు ;
ఆక - తాయి పనులు మాని;
రభసలు సేయక; కొండ కొమ్ముకు మనము
వెళదాము వెళదాము ||

Friday, March 18, 2011

తమస్సు నేత్ర కాటుక























నా కడ, నీ కడ ; వారిజాక్షిరో!
వేకువ కెందుకొ ఇంత తొందరా!?
;;;;;
వేకువ రెప్పల కంటి కాటుకగ;
రేయిని ఒసగి, రాకా చంద్రుడ!
వై దొలగుమా!నువు
రవంత జరుగుమా! ||
;;;;;;;;;;;
ఓహోహో!
ప్రత్యూష మారుతమా!
ప్రాగ్దిశలో ఓ అరుణోదయమా!
రవ్వంత అగుమా!
ఉలికిపడును మా బేల రాధిక! ||
;;;;;;;;
ధారా పాతంగా ఇదిగో!
చల్లని కాటుక! నయన వేడుక ;
మబ్బు భరిణలో రాత్రి కానుక!
;;;;;;;;;
కన్ను దోయికి పెట్టుకొనీ,
శేషాంజనమును,తన
నీల కుంతలములకు;
వ్రేలిని రాపిడి*చూచెను రాధిక ;
;;;;;;;;
“రమణి బుగ్గకు దిష్టి చుక్కను
పెట్ట వలసిన అక్కర ఉన్నది
నీలాంజనమును - మరి కొంచెము ఈమని,
రేయిని వేడుచు కొసరెను క్రిష్ణుడు ||
;;;;;;;
[తమస్సు నేత్ర కాటుక ( కవిత) ]
[* రాపిడి= రాయుట/ ఒరిపిడి]

శ్రీ బాల క్రిష్ణుని క్రీడా సరసులు



రాధికా!శరన్నివేదికా!
నిర్మల హృదయామోద
స్నిగ్ధమౌ సిరి మల్లికా! ||

చకోర చంద్రిక వలయానిలముల
రాక పోకలకు - నీదు చూపులే;
సేకరించిన ఋతు గ్రంధములు!
ఏరువాక నీ ఆనందాశ్రులు
అవి,
నంద బాలుని క్రీడా సరసులు ||

వర్ష మేఘముల సుధా ధారలకు
అందించిన సుగమ ప్రణాళిక;
"నీ దరహాస శతములు" బేల బాలికా!
అవి,
నంద బాలుని క్రీడా సరసులు ||

ప్రకృతి ఇతిహాసము





















రాధా క్రిష్ణం మనోహరం
అద్దరి ఇద్దరి యమునా ఝరికి ;
కదిలే అలలకు గురువులైనవి;
జలముల ఇరువురి ప్రతి బింబాలు;
రాధా క్రిష్ణం మనోహరం ||

క్రిష్ణ రాధికా బోధనలో;
యమునా నదిలో కదిలే అలలు,
నేర్చెను మోహన గీతములు
కదన కుతూహల రాగములు; ||

శశి బింబముల వెన్నెలల
కథా కథనముల చాతుర్యం;
ప్రకృతి సుందర ఇతిహాసం
రాధా క్రిష్ణం మనోహరం ||

Thursday, March 10, 2011

సుగుణ ధామ! కోదండ రామా!













వినుత గుణ శీల రామ! కోదండ రామా!
ఇన కులోత్తమ రామ! భక్త మానస హృత్ పద్మా!
మేలుకోవోయీ!హారతి గొనుమోయీ! ||

కలికి జానకి కొలిచే - వేళ ఆయెను,
లలిత హాస!సుగుణ ధామ!
వైళమె, మేలుకో!
నీల మేఘ శ్యామా! మేలుకోవోయీ! ||

పురుషోత్తమా! పుండరికాక్ష!
కరుణా సింధూ! శుభకర నామా!
వైళమె, మేలుకో!
నీల మేఘ శ్యామా! మేలుకోవోయీ! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$









vinuta
guNa SIla raama! ;
kOdaMDa raa
maa!;
ina kulOttamaa!
bhakta maanasa hRt padmaa!
mElukOvOyI! haarati gonumOyI!||

kaliki jaanaki, kolichE vElalu aayenu,
lalita haasa!suguNa dhaama!
vaiLame, mElukO!
swaamI! mElukO! ||

purushOttama! puMDarikaaksha!;
karuNA siMdhU! SuBakara naamaa!
vaiLame, mElukO!
nIla mEGa Syaamaa! mElukOvOyI! ||

( By; konamanini )
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ఔరా! కిర్లియన్ ఫొటోగ్రఫీ




















1936 లో semyon Kirlian అనుకోకుండా కనిపెట్టిన
ఫొటోగ్రఫీ విధానం -అతని పేరుతోనే
kirlian Photography
ప్రసిద్ధికెక్కినది.
ప్రతి వస్తువులలో , వాటి చుట్టూ ఒక aura కాంతి ఉంటుందని,
ఋజువుగా ఈ ఫొటోలు ఉన్నాయి.
సాధారణంగా దేవతా స్వరూపుల శిరస్సు చుట్టూ
ఇలాంటి " కాంతి చక్రము" లను చిత్రకారులు,
సినిమాలలోనూ చిత్రిస్తూన్నారు.
















అన్ని వస్తువుల పరిసరాలలో
(a halo or a light aura surrounding them)
అలాంటి కాంతి వలయము ఆవహించి ఉంటుందనడానికి






నిదర్శనాలు లభించిన
ఈ ఛాయా చిత్ర మార్గములో,
అనేక పరిశోధనలు పయనిస్తూన్నాయి.

See , read essay here.

Tuesday, March 8, 2011

అంబరాన స్వప్నాలకు విహారములు


















చిన్నారి తీపి కలలారా!
మిన్నులలో ఎగుర రండి! ||

రామ చిలుకమ్మల ఱెక్కలలో;
హాయిగా కునుకు తీయు;
తీపి తీపి కలలారా!
సీతా కోకలివిగివిగో!
జతలు కూడి, మైత్రి సేసి;
ఎగరండీ గగనాలలోన! ||

చిన్ని ఆకు, లతలలోన
గులాబీల పూలపైన;
మంచు ముత్తెముల సౌరు;
సొగసు గానమ్ములాయె;
జతలు కూడి, మైత్రి సేసి;
ఎగరండీ గగనాలలోన! ||

జారే జలపాతాలు;
కొండల పాపిటి బిళ్ళలు;
బాలల చిరు నవ్వులతో;
మెరిసీ, మురిపించేను
జతలు కూడి, మైత్రి సేసి;
ఎగరండీ గగనాలలోన! ||











aMbaraana svapnaalaku vihaaramulu
_____________________________





chinnaari tIpi kalalaaraa!
minnulalO egura raMDi! ||

raama chilukammala ~rekkalalO;
haayigaa kunuku tIyu;
tIpi tIpi kalalaaraa!
siitaa kOkalivigivigO!
jatalu kUDi, maitri sEsi;
egaraMDI gaganaalalOna! ||



chinni aaku, latalalOna
gulaabIla pUlapaina;
maMchu muttemula sauru;
sogasu gaanammulaayenu;
jatalu kUDi, maitri sEsi;
egaraMDI gaganaalalOna! ||

jaarE jalapaataalu;
koMDala paapiTi biLLalu;
baalala chiru navvulatO;
merisii, muripiMchEnu
jatalu kUDi, maitri sEsi;
egaraMDI gaganaalalOna! ||

నవ రత్నముల ప్రాధాన్యత






















మాణిక్యం దిన నాయకస్య విమలం - ముక్తా ఫలం శితగోః ;
మహీయస్య చ విద్రుమం - మరకతం సౌమ్యస్య-గారుత్మకం
దేవేజ్యస్య చ పుష్ప రాగం; సుర-అచార్యస్య వజ్రం|||శనేః.
నీలం నిర్మలమాన్యయోశ్చ , గదితే గోమేధ - వైఢూర్యకే||

&&&&&&&&&&&&&&&&&&&&&

నవ రత్నములు ;;
























1. మాణిక్యము (కెంపు)
2. ముత్యము (ముక్తా ఫలము)
3. పగడము (విద్రుమము)
4. పచ్చ (ఆకుపచ్చ/ గారుత్మకము)
5. పుష్య రాగము
6. వజ్రము
7. నీలము
8. గోమేధికము
9. వైఢూర్యము

maaNikyam dina naayakasya vimalam - muktaa phalam SitagO@h ;
mahIyasya cha vidrumam - marakatam saumyasya-gaarutmakam
dEvEjyasya cha pushpa raagam; sura-achaaryasya vajram|||SanE@h.
niilam nirmala maanyayOScha , gaditE gOmEdha - vaiDhUryakE|| #

1) Sun -Pure Ruby
2) Moon (natural)- Pearl
3) Mars - red Coral
4) Mercury - Emerald
5) Jupiter - Yellow sapphire
6) Venus- Diamond - Saturn,
7) Saturn, - Blue sapphire
8) Hessonite - Rahu (the ascending node of the Moon)
9) Cat's eye - Ketu (the descending node of the Moon) ;

&&&&&&&&&&&&&&&&&&&&&&

పాటల గృహము, కోకిల గళము
___________________
( writer; kusuma )

పాటల నవ రత్నాలను
ఈయవమ్మ కోయిలమ్మ!
ఈ ఇలాతలము
నీ పాటల ఊయెలలో ఊగునమ్మ! ||

ఋతువుల కోటకు ;
శిశిర - ఋతువు తాళం తీసి;
చైత్ర మాస లోగిలిలో;
అడుగిడిన కోకిలమ్మ!;
పచ్చల పాటలను తీసుకుని రావమ్మ! ||

ఎగసే కెరటాల పైన;
వెన్నెలల అక్షరాలను;
రాయవోయి చందురుడా!
మా పికమున కందీయవోయి! ||
సొగసు గీతావళి -
చేసి, నీ గళమందున
మోసుకొని తేవమ్మా!
లోకాలకు సౌరుగా;
మధు గానాలను అందించు ! ||

&&&&&&&&&&&&&&&&&&&&