Wednesday, August 8, 2012

జడిపించబోకే!


;
;
జడివాన ధారలై; కురియుచున్నాది;
ధార ధారల జడల; అల్లికల అందం;
పెనవేసుకున ఆ సౌరు చూడండమ్మ! ||
;
అది యమున తీరము;
రాధమ్మ నడుము నడిసంద్రపు టలల;
తేలాడుచున్నవి జడ కుచ్చు నౌకల్లు!
;
@1] ప్రశ్న:-
ఆ బంగారు కుచ్చుల్లు ఎవ్వరివి, చెలియా!
ఆటాడు జడకుచ్చు పడవ వైనాలను మాకు తెలుపవమ్మా!
||ధార ధారల జడల; అల్లికల అందం;
పెనవేసుకున ఆ సౌరు చూడండమ్మ! ||
;
@2] ప్రశ్న:- నీలవేణీ జడల నొడిసిపట్టినదెవరు?
సమాధానము:- "నీలల మై ఛాయ క్రిష్ణయ్యవే! సఖియ! క్రిష్ణయ్యవే!
జడవబోకమ్మ! వయ్యారి పడతిరో! కన్నయ్య కర కమల దొన్నెలందున;
పసిడి జడగంటల సౌదామినీ రాశి; ఆదిశేషుడై వెలసె; ఆ అరచేతులందున! ;
క్రిష్ణమూరితికేమొ; అవధులు లేనంత అచ్చెరువులు!!
మరి, ||జడవబోకమ్మ! వయ్యారి పడతిరో! ||
;
రాధ:- ఊరుకోండీ చెలులు! చాలు మీ అల్లరులు!
జడిసితే ఏమాయె! జడుపు జ్వరమొచ్చేను!
మా మాయదారి కన్న, నా కడనె కూర్చుండి, నను బుజ్జగించేను!
అందుకే పణతులూ! కాస్త ఆలకించండీ!
;
" ఉష్ణము కలిగెను, నీ రాధకు..." అనుచు,
వేణుగానలోలు చెవిలోన ఊదండి మీరు!
ఇది చాలు, మీ యొక్క గొప్ప ఉపకారము!||

;

  జడిపించబోకే!  (Link for nice photos)


\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

Happy Janmashtami 2012

శ్రీ క్రిష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

Thursday, July 26, 2012

పుష్పక విమానము


Pushpaka vimanam



విశ్రావసు కుమారుడు, దేవతలకు గురువు కుబేరుడు. 
ఆతడు గొప్ప శివ భక్తుడు. మహేశ్వరుడు
"కుబేరా!" నీ భక్తికి మెచ్చి, ఈ గగన గామిని ని ఇస్తున్నాను,! " అని
ఘన వస్తువును తన భక్తునికి ఒసగాడు.
అదే విశ్వఖ్యాతి గాంచి, ఇతిహాస చరిత్ర సృష్టించిన "పుష్పక విమానము".
తన విమానము (aircraft)లో-
సకల మహేశ దేవళములను- దర్శిస్తూ,
కుబేరుడు పుష్పక విమాన యానము చేయసాగాడు.
అలా వివిధ ఆలయాలను సందర్శిస్తూ, 
ఒక చోట ఒక విచిత్ర దృశ్యాన్ని తిలకించాడు.
కావేరీ తీరాన (Cauvery) జింక, పులి, ఆవు, ఏనుగు, పాము, ఎలుక - లు
ఒకే చోట నిలబడి, నదిలోని నీళ్ళను తాగుతున్నాయి.
జంతు సహజ వైరము లేకుండా ఆ ఐదు
మైత్రీభావముతో అలాగ మెలగడము చూసిన కుబేరుడు, అక్కడ దిగాడు.
సుర గురువు- "సజ్జనులు, పుణ్య చరితులు, గంధర్వులు, మహర్షులు- 
ఇక్కడకు వచ్చి, నివసిస్తున్నారు. 
ఆ సౌజన్య ప్రవర్తనా పరిమళాలు విస్తరించిన పరిసరములు అవి! 
కనుకనే అచ్చట స్నేహభావ, సౌమ్య భావములు విరబూస్తూన్నవి.
అందువలననే ఈ సీమలో జంతువులు సైతమూ 
తమ తమ సహజ వైరాలను మరిచి, 
స్నేహ భావముతో కలిసి మెలసి జీవిస్తూన్నవి" అని గ్రహించాడు.  
కుబేరునికి ఆకాశములో నుండి- ఒక  స్వరము వినిపించింది.
"ఇచ్చటి ఇల్లిందై చెట్టు (= రేగు చెట్టు/ బదరీ వృక్షము)  ఉన్నది.
ఆ తరువు మూలమున తాళపత్రములు ఉన్నవి.
ఈ ప్రాంతమునకు వేదములు వచ్చినవి.
కనుక ఇది పవిత్ర మహిమాన్విత ప్రదేశము" అంటూ ఆ అశరీర వాణి పలికినది.
ఈ రేగి చెట్టు  (Ilandhai Tree) దరిని- నీవు పూజించ వలసిన పరమేశ లింగము ఉన్నది. 
భక్తుల సకల ఈప్సితములు నెరవేరు ప్రదేశము ఇది.
"ఈ మాటలకు విస్మయ చకితుడైన కుబేరుడు అన్వేషణలో- పవిత్ర లింగమును కనుగొన్నాడు.
కుబేరుని ఆరాధనలు పొందిన ఈశుడు-
కుబేరుని కోరికపై "అలఘేశుడు" (Alagesan) - అనే నామధేయ విలాసునిగా
భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
"భవాని" అనే ప్రదేశములో వెలసిన ప్రసిద్ధ కోవెల పేరు "శ్రీ సంగమేశ్వర కోవెల", 
కావేరీ, భవానీ, అంతర్వాహిని ఐనట్టి "అమృత" అనే మూడు నదులు కలుస్తూన్నవి.
అందుచేత- దక్షిణ భారతమున "త్రివేణీ సంగమముగా" వినుతి కెక్కినది.
సంగమేశ్వరుడు - స్వయంభువుగా వెలిసినాడు.అమ్మవారి పేరు "వేదనాయకి". తల్లి సౌందర్యవల్లి.
ఇక్కడ విష్ణుమూర్తి- "అధికేశ్వరర్" అని   పేరు.
కావేరీ నది ఒడ్డున- పవిత్ర తీర్ధము ఇది. తేవారం అర్చకుల గానములు
ఈ చల్లని గాలులలో- మనోహరముగా వినిపిస్తూ ఉంటాయి.
ఈరోడ్ జిల్లాలో( Erode) భవానీ గుడి- "శ్రీ సంగమేశ్వర కోవెల" ఉన్నది.  
; 

Monday, July 9, 2012

శరత్ చంద్రఛటర్జీ , Devanandapur, Hugly


Hooghly

శరత్ చంద్రఛటర్జీ పేరు తెలీని వారెవరు?
బెంగాలీ రచయిత రాసిన అన్ని రచనలూ,
తెలుగులో అనువదించ్బడి, ఆంధ్ర పాఠకులను/కు
శరత్ బాబు తెలుగు రచయితయే!" అన్నంతగా అభిమానాన్ని పొందాడు.
దేవదాసు, మా వదిన, బాటసారి, తోడికోడళ్ళు ఆదిగా
అనేక సినిమాలు ఆయన రచనల ఆధారంగా నిర్మించబడినవి.

15 సెప్టెంబర్ 1876 లో దేవానందపూర్, హుగ్లీ జిల్లాలోని- లో జన్మించాడు.
శరత్ చంద్రఛటర్జీ యొక్క నివాసము, మున్నగునవి,
స్మారక చిహ్నములుగా ఉన్నవి.
ఆ దారిలో ఉన్న ఒక పెద్ద వృక్షము కనులకింపు.

Tags:-

DewaanaMd pur, Hoogly
;

Friday, July 6, 2012

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు


"హిందూ మతము"- అనే పదముకంటే
"హిందూ సంప్రదాయము" అని
చెబుతేనే బాగా నప్పుతుంది.
ఆచార, సంప్రదాయాలు, ప్రకృతితో అనుసంధానిస్తూ-
ఒక మతముగా రూపొందిన అద్భుత  వైనము-
ఈ పుణ్యభూమి- లోనే సాధ్యమైనది.
ఆర్యభూమిలో అతి ప్రాచీన కాలమునుండీ అనేకమంది
సమాజశ్రేయస్సు గూర్చి పరితపిస్తూ అనేక ఆలోచనలు చేసారు.
కాలానుగుణముగా- అవి పరిణామము చెందుతూ,
పరిణతి చెందిన "హిందూమతము" గా ప్రజలు రూపు దిద్దుకున్నారు.
ఆ ఘన చారిత్రక ఆవిష్కరణయే - హిందూ మతము-
కేవలము మతముగానే కాక,
చతుష్షష్ఠి కళల సమామ్నాయమై తనను తాను ప్రౌఢీకరించుకున్నది.
ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధమే "కలిమి" గా కల హైందవమును-
నా శక్తి పరిధిలో-  వ్యాసీకరించే ప్రయత్నమిది.

                      ************************;

తిరుపత్తిరిపులియూర్:- ఈ ఊరికి, అలాగే ఊరిలోని కోవెలకు -
ఆ పేరు రావడానికి వ్యుత్పత్తి ఒకటి ఉన్నది.
"తిరు+పాదిరి+పులియూర్" అనే పదములు ఆధారము.
శ్రీ + పాటల + పులి- ఊరు -  కొన్ని సంఘటనల ద్వారా
ఈ మాటలకు స్థల నామార్హత ఏర్పడినది.
పాటలీశ్వరుని దేవాలయము  "తిరుపత్తిరిపులియూర్"
(Sri Padaleeswarar Temple,Thirupathiripuliyur) లో  ఉన్నది .
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ఈ కోవెల విశిష్టమైనది.
7 వ శతాబ్దికి పూర్వమే కట్టిన అతి ప్రాచీనమైనది పాటలీశ్వరుని దేవాలయము.
ఉమాదేవి  1008 పుణ్యతీర్ధాలను దర్శించుకున్నది. ఈ పావనదేశమును చేరినది ఉమాదేవి.
పెద్ద పదిరి చెట్టు (పాటలీ తరువు) ఛాయలో వెలసి ఉన్న మహా శివ మూర్తిని ఆమె వీక్షించినది.
అచట భవుని మూర్తి ప్రతిష్ఠించబడినది.
పాటలీ పాదపము నీడలో ప్రభవించినందున "పాటలీశ్వర స్వామి" అని పేరు పొందాడు.
దేవాలయమునందు 5 సువిశాల నడవాలు ఉన్నవి. మే- జూన్ లలో వైకాశి నెలలో-
బ్రహ్మోత్సములు జరుగుతూంటాయి. ఐదవ కారిడార్ ని  "రాజ వీధి"
అనగా రాయల్ స్ట్రీట్ (royal street) అని పిలుస్తారు.

                   ************************;

పాటలీశ్వరుని దేవాలయము:-   ఈ క్షేత్రమున స్థల వృక్షము పాదిరి చెట్టు ( Pathiri Tree).
మధ్య నందన ఋషి గొప్ప పరమేశ భక్తుడు.
శివపూజకు పూసిన పుష్పాలను కోసుకోవడానికని-
పాదిరి చెట్టును ఎక్కడానికి - అ ఋషికి చాలా కష్ట సాధ్యమయేది.
పాటలీశుని అర్చనకై- ప్రతి రోజూ-
ఈ వ్యాయామము వంటి పని
క్లిష్టతరమవగా
"పాడలీసా! నాకు పులి కాళ్ళును ఇవ్వు" అని వేడాడు.
సత్వర వరానుగ్రహాన్ని పొందాడు. పులి పంజాలను పోలిన పాదములను పొంది,
పూజావిధులను నిరాటంకముగా సులువుగా చేసుకోగలిగాడు.
ఆ మహా ఋషి చరణ యుగములచేత -
"పులి"-  కూడా జత కలిసినది.
(Pathiri Tree); అటు తర్వాత వ్యాఘ్ర పాదములను వరముగా పొందినట్టి
Madyanandana Rishi పేరు కూడా జత ఐ,
ఈ ఊరికి - "తిరు పదిరి పులియూర్" అనే నామమును పొందినది.
నయనానందమును కలిగించే గుడి, పరిసరాలు ఉన్న ప్రదేశము  "Thirrupathiripuliyur".

ముఖ్య ట్యాగ్ పదములు:-
Thirupathiripuliyur in Cuddalore, Sri Padaleeswarar Temple

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు ;

అనురాగ సదనము



రాధ హృదయం- రాగసదనం;
శ్రీ క్రిష్ణానురాగ  - నందనమ్మున
రాగసదనం రాధ హృదయం             ||

వేణురావ(ము) విశాల గగనము;
భావగీతులు ఇంద్రధనుసులు;
కన్నె కన్నుల భరిణలందున
విరియు వన్నెలు వీక్షణమ్ముల
                        అను రాగసదనము
                             రాధ హృదయము;       ||

నిరతమూ శ్రీ క్రిష్ణ యోచన, చింతన;
మరుని శరమున పూవుటమ్ములు
రతికి కురుల తావి ఎగయగ
తురుము మదనుడు తన్మయముతో
                   శ్రీ క్రిష్ణానురాగ  - నందనమ్మున
                        రాగసదనము  రాధ హృదయము"> || 

Wednesday, July 4, 2012

వకుళము- "పొగడ చెట్టు", 200 years old


వకుళము- అంటే "పొగడ చెట్టు".
ఈ పాదపమునకు పూచే పూలు పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి.
శ్రీ వేంకటేశుని పెంచిన జనని "వకుళ మాల",
సువాసనభరితములైన వకుళ మాలలను ధరిస్తుందని జన వాణి.
హిందీ, సంస్కృతాది భాషలలో "bakul" అని పేరు.
200 ఏళ్ళ నాటి చెట్టు ఈ ఫొటోలోనిది.

హుగ్లీ మండలములోని ( మిత్రబటి)అంత్ పూర్ మార్గములో ఒక చెట్టు ఉన్నది.
;
వకుళము / పొగడ చెట్టు
;
ఆ "బకుల్ వృక్షం" 
200 సంవత్సరాల వయస్సు ఉన్నదని అంచనా.

Antpur, Hooghly (Mitra Bati)  : link here!


*********************************,
ఆలయాలలో ఎక్కువగా-  "పొగడ చెట్లు" పెంచుతారు.

మంగళ గిరి మున్నగు పుణ్యక్షేత్రములలో శివరాత్రి ఉత్సాహ సందర్భములలో
(గంగా భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి)
పరమేశుని పొగడ చెట్టు వాహన ఊరేగింపును భక్తులు నిర్వహిస్తూంటారు.

Monday, May 28, 2012

కొబ్బరాకులతో గులాబీ పువ్వులు


















కొబ్బరాకులతో రోజాపూవులను తయారుచేయడం-   చమత్కార కళ.
ఇక్కడ- ఛాయాచిత్రాల పచ్చని గులాబీ పువ్వులు-  ఉన్నవి,
              చూస్తున్నారా?
అరరె!!
ఇవి నిజం పుష్పాలు కావు కదూ???
http://farm4.staticflickr.com/3020/2380488335_d12306d8ac_z.jpg
ఔను మరి!
ఇవి కొబ్బరి ఆకులతో అల్లుతూ- చేసిన
                 హస్తకళాసామ్రజ్య సొగసులు.

coco Roses










for more photos :-

Links 1- Coconut Rose
ë

Friday, May 25, 2012

"రామ హల్లి"Dodda Alada Mara Tree'












కర్ణాటక రాష్ట్రానికి రాజధాని ఐన బెంగుళూరునకు




25 మైళ్ళు దవ్వున ఉన్న పల్లె
"రామ హల్లి"(tumkUru siima).
ఈ పల్లెకు ఒక  విశేషం ఉన్నది.
మన ఆంధ్రప్రదేశ్ లో కదిరి వద్ద,
సుప్రసిద్ధమైన తిమ్మమ్మ మర్రి మ్రాను ఉన్నది.
అట్లాగే రామోహల్లి- లో 400 ఏళ్ళ వయస్సు కలిగిన
మఱ్ఱి వృక్షం ఉన్నది.
స్థానికులు "దొడ్డ అలద మర"
(Ramohalli's 'Dodda Alada Mara') అని పిలుస్తారు.
టూరిస్టులు చూడ దగిన గొప్ప తరువు ఇది.


!!!!!!!!

రామ పల్లె సమీపములో ఉన్న
"ముక్తినాగ దేవళము"ప్రసిద్ధి కెక్కినది.
కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళలేని వారికి
 అందుబాటులో ఉన్న నాగదేవతా క్షేత్రము ఇది.
"సర్పదోష నివారణకై భక్తులు పూజించే దైవము"  నెలకొని ఉన్న గుడి
ఈ 'ప్రాచీన ముక్తి నాగ ఆలయము'.

Sunday, May 6, 2012

గణగణ గంటలు


School children at the enchanting Shore Temple at Mahabalipuram. — DC















అటు ఒక కొండ,
       కొండ కొమ్మున కోవెల ఉన్నది;
ఇటుగా ఉన్నది
        ఏటి ఒడ్డున మా స్కూలు


గంటలు గంటలు ; మ్రోగే గంటలు,
గణగణ గణగణ గణగణ  గణగణ


గంటలు గంటలు ; మ్రోగే గంటలు,
విజ్ఞానానికి  జాగృతి ఇచ్చట పాఠశాలలో!                          
మానవత్వపు మేలుకొలుపులు అచ్చట
దైవం వెలిసిన దేవళములలో!!


******************************************

గణగణ గంటలు: రచన: పిడూరి కాశ్యప:

Monday, April 2, 2012

పూల దొన్నె గుహుని పడవ


 "The Ramayana" Constellation Theatre Cmpany

పూల దొన్నె నా పడవ!
సరయూ ఝరి తరంగాలు;
జోల పాట ఉయ్యాల!     ||

చుక్కానీ! అలలనాట్టె కెరలించకు!!! ;
సుతి మెత్తగ జారాలి;
ఈ గుహుని పడవ కెరటాల   ||

ఆది- శేష శయనునికి
మన పడవ- హంస తల్పమాయేను!మాయగా!
శేషశాయి యానము సాగినదీ దొన్నెలోన;
ముచ్చటగా పూల దొన్నె పడవలోన  ||

అలలు ఆట్టె చిందకుండ;
చేర్చవే నా పడవను; ఆ ఒడ్డుకు -చుక్కానీ!
ఓహోహో చుక్కానీ!! నా బంగరు చుక్కానీ!
ఇక నీకు పండగే పండుగ!  ||


photo link :-

Theater Review: "The Ramayana" at
Constellation Theatre Company
Constellation’s production of India’s beloved epic story
is grounded in the history and themes of
the ancient work By Missy Frederick                       Published August 11, 2011

గోరింట పంటకు ఉక్రోషము















గోరింట ఎందుకో అలిగినది!
ఆ కినుకకు కారణమరసేరా!?      ||

రాధా దేవీ అరచేతులలో/
కుదురుగ ఉండిన గోరింట ;
వెలతెలబోయేనెందుకనీ!
ఆ హేతువు నరసీ తెలుపండీ!     ||

కందుక క్రీడకు పిలిచెను క్రిష్ణుడు;
బంతి ఆటలో భామలు అలిసిరి ;
ఆడీ ఆడీ మా రాధమ్మ
కర కమలములు కందినవి!         ||

లేత చర్మము కందిన ఎరుపు!
ఎర్రని చేతుల కందినది-
అరుణవర్ణము క్రమ్మరగానే
ఇతర వన్నెలు మాసినవి            ||

కమిలి పోయిన హస్తములందలి;
ఆ అరుణ వర్ణమున తన పంట
అంతయు; వెలతెల బోయెననీ;
గోరింటకు ఆయెను- తెగ గుబులు!
~~~~~ గోరింటకు ఆయెను- తెగ గుబులు!
                   అందుకనే ఈ ఆగ్రహము!
                              ఆపలేని ఈ ఉక్రోషం ||

************************************;


గోరింటాకు చెప్పే రహస్యములు (link- అఖిలవనిత.blog)
Thursday, December 2, 2010

గోరింటాకు చెప్పే రహస్యములు:-

గోరింట ! చెప్పవమ్మ!
ఆ ఊసులను! ||