Saturday, March 20, 2010

సందేహాలు






















ఆలించ వోయి వేంకటేశ!
అతివ అలివేల్మంగకు
సందియములు వేల వేలు
తీర్చు - సందర్భమిదియె!
నిలు నిలువో, నిలువుమోయి! - 2 ||

ఇందు ముఖితొ సుందరమౌ
మేటి - చతురు లాడుటలో,
స్వామి! నీకు నీవె సాటి! ||

వనజ పాణి పద్మావతి
వేలి స్వర్ణ ఉంగరాల
మెరయు రవలు, మణులు,
నవ - రత్న,మాణిక్యములు ||

అంగుళీయకము లిటుల
మర - కతములై తోచగా
అచ్చెరువుల తరళాక్షుల
విపుల చర్చలు ||

శ్యామ లాంగ మాధవుని
చిత్ర రూపు వన్నియల
ప్రతిఫలనములు భాసిల్లిన
మేల్మి- సంఘటనల
గుచ్ఛములే గుబాళింపులే ! ||



&&&&&&&&&&&&&&&&&

Kovela

సందేహాలు

By kadambari piduri, Dec 5 2009 12:04PM

రుసుములు
























ఓరగ తలుపులు తెరచు ఉంచినది
తరుణీ మణి అలి వేలు మంగమ ||

తన- ముఖ పద్మమునకు
ఓరగ ఉంచీ, పద్మ హస్తము
అర నవ్వులు పెదవుల చిందించినది ||

సిగ్గుల మొగ్గ సుదతీ రత్నము
కాటుక తీర్చిన కను రెప్పలను
ఓరగ మూసిన హొయలులొహో! ||

సతి పద్మావతి నళిన నేత్రముల
ఓర చూపులు కురిసినవి
గడసరి వేంకట నాథునికీ
దక్కినవమ్మా గొప్ప రుసుములు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

రుసుములు

[ God sri venkateswara swami gain
Wife padmavath's sweet smiles
as the TAXES ]

By kadambari piduri, Dec 28 2009 10:42AM

వెలుగుల బంగారు సోనలు




















అఖిల జగన్మోహనా! భక్త పరాధీనా !
రుక్మిణీ లోలా! శ్రీ వేణు గాన లోలా! ||

ప్రణవ నాద రూపా!
ప్రణయ రాగ దీపా!
భక్త జనుల మది గదిలో
వెలుతురుల సోనా! ||

ఆశ్రిత జన పరితోషా!
గిరిధర గోపాలా!
భువన మమరె- నీ ఇల్లుగ
అరుదెంచు మిటకు, గరుడ వాహనా! ||


&&&&&&&&&&&&&&&&&&&&&&


Kovela

వెలుగుల బంగారు సోనలు
By kadambari piduri, Dec 24 2009 6:29AM

నగవుల నగలు -
























అలర్మేలు మంగమ్మ చెవిలో ఊదిరి
చిలిపి తనమ్ముల చెలియలు,ఓహోహోహో!! ||

బారువ నవ్వులు - రమణీ మణి
తన, పెదవుల తులలో - తుల తూచి ఉంచినది ||

ఇరవై మణుగుల - బరువుల నగవులు
"తూగునొ? లేదో?" అని -
సందియ మెంతో గోవిందునకు!
అహహా! ఆహా! మన గోవిందునకు ||

"తులసీ దళమే చాలునమ్మ !
తిరుమల పతిని - ఆనందింప చేసేటందుకు!"
అనుచూ పద్మకు ఇష్ట సఖియలు
చిన్ని రహస్యము చెవిలో నుడివిరి! ||!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

నగవుల నగలు - తరాజులో తూకము

[ How much Weight of her smiles ' ???!!!
Can make - A new Wieghing Instrument ( = TULA )
to know the Bharam / weight ! ]


By kadambari piduri, Dec 5 2009 5:36AM

కొమ్మలు


















టకటం, టకటం , టక టక టం
టక్ టక్ , టిక్ టిక్ టక టిక్ టిక్ ........
కోలాటముల ఆటలతో
కోలాహలములు, ఓ సఖియా! ||

నిన్నటి దాకా వట పత్ర శాయివి ,
ఇవి - నేటికి పెరిగెను ఇన్ని నటనలుగ,
నాట్య వల్లరుల అల్లరల్ల్లలుగా ,
సిరి ! సిరి ! శేష శాయీ! క్రిష్ణా! ||

చురుక్కు చురుక్కు చింత బరికలతో
ఆల మందలను అదిలించేవు;
వెదురు గొట్టముల మలచి వేణులుగ
మధు రాగాలను బెత్తాయిస్తువు ||

మొద్దుల మద్దులు గంధర్వులుగా
మారుట లోకములందున చోద్యము !
కొయ్యలు, బెండ్లుకు చైతన్యమ్ములు
నీ చేతి - మహిమల కతముననే. కన్నా! ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

కొమ్మలు

[ Krishna and people
play and DANCE of Sticks - kolatam / bhangra ]

By kadambari piduri, Dec 18 2009 7:19AM

సాంత్వన


















శ్యామ సుందరాంగా!
శరణు జొచ్చినారము;;
నీ - ప్రేమ మందిరము కదా,
భక్త హృదయ పద్మము ||

శరణు! శరణు! శరణ నుచూ
ఎలుగెత్తుచున్నపలుకులు
అనయము అవి మావి!
అరణము నీ అనునయము
ఆ ఆస్థి అంత మాది ! ||

గోవింద! గోవిందా! - అనుచు
సాగు మా పరుగులు
అదె కొండల కోవెల
మా అడుగు జాడ మెరుపు చెండ్లు
గమ్యము అదె తిరుమల ! ||



&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

సాంత్వన

( Great relief , happy
pious people )

By kadambari piduri, Dec 24 2009 7:10AM

చూపులే కళ్యాణ తిలకాలు


















కొన చూపుల- కడు వేడుక
సుతి మెత్తగా – సతతము అల్లితివి
అతివరో! ఈ మేల్మి పఱదాలు ఎవరికే? ||

1.అటు వేపు శ్రీ దేవి – ఇటు పద్మావతి
అటు ఇటు – ఇటునటు - నటనాల దృక్కులు
మలయ, మారుతపు యవనికల - కళ్యాణ తిలకముగ
చిత్రముగ వెలసేను !?!-విచిత్రమిది ,కను గొనగ
పరాకు చిత్తగించి - చిత్రాంగి! బహు పరాక్! - ||

2. మోమోటముల గెంతు కొన్ని చూపుల్లు
తటపటాయింపుల కొన్ని వీక్షణములు
శ్రీ నాథుని చిలిపి నటనాల చూపుల్లు
నీ క్రీ గంటి చూపుల – అపరంజి పరదాలు
వేయుమా ! అతివరో! – నీదు హృదయేశునకు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&


Kovela

చూపులే కళ్యాణ తిలకాలు
( Radha's sweet looks at krishna bhagavan
are like" bride's sindhur " )

By kadambari piduri, Dec 27 2009 6:05AM

ఎటువంటి జాణవే! తోయజాక్షిరో !



















ఎటువంటి జాణవే! తోయజాక్షిరో!
ఇటు వేంకట రమణుని – తిప్పలు - అన్ని ఇన్ని కావమ్మా! ||

కటువుగాను వేమార్లు వాని - చిక్కులలో పెట్టుదువే !
చాలు ! చాలులే ! చాలు ! చాలులే! ||

ఓర కంట నీ వైపుకు – స్వామి చూచినా
కోరకంపు పువు రేకులు – కాబోలని – తలచితినని
విరుపుగాను అంటావు – చాలు! చాలులే! ||

మందస్మిత వదనుడు – నిన్ను వీక్షించినా
"పందిరి చాందిని “ – అని, తలచినావటే!? అనుకున్నావటే!?
గంధపు పుప్పొడులు అలది – పతి అలకలు తీర్చవే!
సుందర మూర్తి చిరు కినుకలను తీర్చవే! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

ఎటువంటి జాణవే! తోయజాక్షిరో!

( Padmavati Devi acts ' lovely angry '
at her husband " bhagavan sri venkatesa " .

By kadambari piduri, Jan 20 2010 12:27AM

పద్మావతి

















సకల కళా భూషిత
కల వాణీ! పద్మావతి!
గైకొనుమా హారతి ||

సప్త గిరుల స్వామికి
అనురాగపు దేవేరివి
మీ ఇరువురి దర్శనముల
తరియింతురు భక్త కోటి ||

శరణు కోరి నీ దరిని
చేరిన శిశువులము తల్లి!
వత్సలను లాలించి
పాలించుట నీ ఫణితి ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela ; ( harati song for ' Goddess PADMAVATI ' )

పద్మావతి ;

By kadambari piduri, Feb 16 2010 3:39AM

Friday, March 19, 2010

వాలు చూపుల ఉయ్యాల

















అలమేల్ మంగమ ప్రేమల
వాలు చూపుల ఉయ్యాల
ఊగుము స్వామీ! మనసారా! ||

కలువ తావుల పన్నీర్లు
చిలుకు వీక్షణము ప్రతి క్షణము
ఊగుము స్వామీ! మనసారా
కోమలి – క్రీ గంటి చూపుల ఉయ్యాల ||

పులుకు పులుకున చూచెదవు
మొలక నవ్వులను రువ్వెదవు
ఊయెల కవియే ముత్తెపు గొలుసులు
భామిని కులుకుల బహుమతులు ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela ( Temple songs ) ;

వాలు చూపుల ఉయ్యాల
( Cradle of her looks ) ;;;;;;

By kadambari piduri, Mar 12 2010 8:53PM

నందనవన నవనీతం











ముద్ద బంతి ముద్దు బాల
గున గున వచ్చెను రాధ.

వెదురు తోపులో నుంచి
“ నీ కోసమె కన్నయ్యా!
తెస్తి చిన్ని రాగ మురళి. “

గిరి ధారి అందుకొనెను
మృదు వంశిని ;
అది కురిపించు ఆనంద రవళి!

బుల్లి ముద్దు , వెన్న ముద్ద
చిలికించిన వేణు రవం
అల్లదే వెలసినది
బృందావన నవనీతం

&&&&&&&&&&&&&&&&&&&&
నందనవన నవనీతం

By kadambari piduri, Mar 12 2010 8:43PM

Wednesday, March 17, 2010

కిల కిలలు























బృందావనిలో గోపీ క్రీడలు
నగల సవ్వడులు హొయలులు జల జలా !!!

ఒప్పుల కుప్పలు ఆడించే
మన - గోవిందుని సిగలో
పింఛము మిల మిలా !!!

జగన్నాటక సూత్ర ధారుని
పక పక నవ్వుల ఓలలాటలు
ముత్యపు మణుల రాసుల మిల మిలా !!!

ఈ వన్నెలన్నిటిని " అరువు"గ గైకొన(గా)
దిగి వచ్చిన వెన్నెల
యమునా - కెరటాల మిల మిలా!!!

దరిమిలా,,,,,
రాస క్రీడల హేలల జాలము
లెల్ల జగములకు పంచు తున్నవి
"వర ప్రసాదముల కిల కిలా " !

(అందరి నవ్వులు )

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Baala

కిలకిలలు

By kadambari piduri, Dec 18 2009 7:40AM