Wednesday, November 7, 2018

అటుకులు తూనికలు కొలతలు

అమ్మ మనసు ఊరకుండునా!? 
అరకొరగా మెతుకు మెతుకు గతికితేను ;
బిడ్డ తిండి చప్పరింపు మేరకే అయితేను ;  ||
;
చిటికెడంత వెన్న, జున్ను, అటుకులు - చాలునమ్మ వీడికి ;
గోరుముద్ద చాలులేమ్మ!" అంటాడు బాలుడు ;
నందగోపాలుడు - అమ్మ మనసు ఊరకుండునా!? ;  ||
;
బిడ్డ తిండి అరకొరగా మెసవితేను ;
త్రేన్పు వచ్చెనిదిగో - అని ;
ఉత్తుతిగ తేన్పు తేన్చి ;
బ్రేవ్ - అని అంటాడు కన్నడు ;
;
"గుప్పెడు అటుకుల కొలతలు ;
అపరిమితము సంపదలు చేసేటి నేర్పరి ;
సుదాముని నేస్తుడు మన అందరి క్రిష్ణయ్య ;  || 
;
=================;   ;
;
amma manasu uurakumDunaa!? 
arakoragaa metuku metuku gatikitEnu ;
biDDa timDi capparimpu mErakE ayitEnu ;  ||
;
ciTikeDamta wenna, junnu, aTukulu -
 - caalunamma weeDiki ;
gOrumudda caalulEmma!" amTADu baaluDu ;
namdagOpaaluDu - amma manasu uurakumDunaa!? ;  ||
;
biDDa timDi arakoragaa mesawitEnu ;
trEn pu waccenidigO - ani ;
uttutiga tE npu tEnci ;
brEw ani amTADu kannaDu ;
;
"guppeDu aTukula kolatalu ;
aparimitamu sampadalu cEsETi nErapri ;
sudaaamuni nEstuDu mana amdari krishNayya ;  ||

;

No comments:

Post a Comment