Monday, July 30, 2018

నేలపైకి దిగగానే, కన్నయ్య అమ్మ కూచి

చిలిపి చిలిపి చిలిపి క్రిష్ణుడు ;
అల్లిబిల్లి ఆటలు ;
అందరికీ నేర్పుటలో ;
తన కన్న మిన్న ఎవరు? ;  ||
;
కడవలలోమీగడలు ; 
ఉట్ల పైన వెన్నలు ; 
చిక్కనైన పాలు, జున్ను  ;
అందుకునే తుంటరి - 
పట్టబోతె చిక్కడు ;
ఇట్టి ప్రజ్ఞ ఎటుల కలిగె -
ఈ చిలిపి క్రిష్ణమ్మకు ;  ||
;
చెట్లు, పొదల మాటున ; 
నక్కి నక్కి దాగేటి ;
ప్రజ్ఞ వీని సొమ్ము సుమీ ;
కొమ్మలలో రెమ్మలలో ; 
ఒదిగి ఆట దోబూచి ; 
నేలపైకి దిగగానే ; 
కన్నయ్య అమ్మ కూచి ;  || 
==================;  ;
;
cilipi  cilipi  cilipi  cilipi krishNuDu ;
allibilli ATalu ; andarikee nErpuTalO ;
tana kanna minna ewaru? ;  ||
;
kaDawalalO meegaDalu ; 
uTla paina wennalu ; 
cikkanaina paalu, junnu ;
amdukunE tumTari - 
paTTabOte cikkaDu ;
iTTi prajna eTula kalige -
ee cilipi krishNammaku ;  ||
;
ceTlu, podala maaTuna ; 
nakki nakki daagETi ;
prajna weeni sommu sumee ;
kommalalO remmalalO ; 
odigi ATa dObuuci ; 
nElapaiki digagAnE ; 
kannayya amma kuuci ;  || 

No comments:

Post a Comment