Tuesday, May 23, 2017

శ్రీరామ రక్ష - చాందినీ

వెన్నెల కడలి ఉప్పొంగినది ; 
మన ముద్దుల రాములు పక పక నవ్వెను ; 
బాల శ్రీరాములు పక పక నవ్వెను ; ||
;
తీపి తీపి పేరు "శ్రీరామ, శ్రీరామ " ; 
బోయ నోటిలోన తిరగ మర గాయెను ; 
అది కాస్త తిరగ మర గాయెను ; ||
;
తిరగబడినా గాని ముదము చేకూర్చేను ; 
అదియె అనువనది , 
అదియె 'శ్రీరామ!' ;
అదియె నామ మహిమ ; 
నీ నామ మహిమ కదరా స్వామి! : || 
;
వాలి, రావణాదులు సైతము, 
కొసను కనుగొన్నారు మాధురిని ;
నీ నామ మాధుర్య దీప్తిని కన్నారు, 
మైమరచి పోయారు కద స్వామి! ; || ; 
;
బాలకునివి - 'చల్లని చాందినీ'
ప్రీతి నీకగుటలో - వింతేమి లేదులే : 
ఎల్ల లోకములకు కారుణ్య రక్షకా! 
నీవె శ్రీరామ రక్ష ;  || =
=======================;
;
wennela kaDali uppomginadi ; 
mana muddula raamulu paka paka nawwenu ; 
baala Sreeraamulu paka paka nawwenu ; 

teepi teepi pEru 
"Sreeraama, Sreeraama " ; 
bOya nOTilOna adi kaasta tiraga 

mara gaayenu 

tiragabaDinaa gaani 
mudamu cEkuurcEnu ; 
అదియె anuwanadi ; 
adiye nee naama mahima 
        kadaraa swaami! :  || 
;
waali, raawaNaadulu saitamu, 
kosanu kanugonnaaru maadhurini ; 
nee naama maadhurya deeptini kannaaru 
maimaraci pOyaaru kada swaami, 

baalakuniwi - callani caamdinii preeti 
neekaguTalO - wimtEmi lEdulE :  
ella lOkamulaku kaaruNya rakshakaa! 
niiwe Sreeraama raksha ;  ||

No comments:

Post a Comment