Tuesday, January 24, 2017

తానతందనాలు

బాలల చేతలు ముద్దుల మూటలు ;
చిన్నతనాల తానతందానాలు ;  ||
;
యశోద క్రిష్ణుడు, నందకిశోరుడు ;
వనమాలి, శిఖిపింఛధారి ;
కేకిని నిముచు వేడుచుండెను,
పిడికెడు నెమలి ఈకలు ఇమ్మని!
;
యుగములు ఎన్ని గడిచిన గానీ
కాలములెన్ని మారినప్పటికి;
చిలిపి తనముల మార్దవమ్ములే
మోహన రాగాలీనుచుండును  ;   ||
;
చిన్ని కన్నని చిలిపి చేష్ఠలు
ఎన్నిసారులు ఐనా గానీ;
తనివితీరదు వర్ణిస్తూంటే!
కనుకనే కదా, బాలకృష్ణుని
లెక్క లేనన్ని చైతన్యాలు;
వర్ణిస్తూందాం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ ........
మళ్ళీ మళ్ళీ మళ్ళీ ................
;
ఎల్లరికీ  2017 నూతన వత్సర శుభాకాంక్షలు'
తానతందనాలు ;-
బాలల చేతలు ముద్దుల మూటలు ;
చిన్నతనాల తానతందానాలు ; ||
;
యశోద క్రిష్ణుడు, నందకిశోరుడు ;
వనమాలి, శిఖిపింఛధారి ;
కేకిని నిముచు వేడుచుండెను,
పిడికెడు నెమలి ఈకలు ఇమ్మని!
;
యుగములు ఎన్ని గడిచిన గానీ
కాలములెన్ని మారినప్పటికి;
చిలిపి తనముల మార్దవమ్ములే
మోహన రాగాలీనుచుండును ; ||
;
చిన్ని కన్నని చిలిపి చేష్ఠలు
ఎన్నిసారులు ఐనా గానీ;
తనివితీరదు వర్ణిస్తూంటే!
కనుకనే కదా, బాలకృష్ణుని
లెక్క లేనన్ని చైతన్యాలు;
వర్ణిస్తూందాం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ ........
మళ్ళీ మళ్ళీ మళ్ళీ ................
;
ఎల్లరికీ 2017 నూతన వత్సర శుభాకాంక్షలు
[ NEW మురళీరవళి, కొత్త నెమలి పింఛాలు, ; ⇻ రాధా మనోహర ]

No comments:

Post a Comment