Sunday, November 13, 2016

నీ ఆగమనమ్మే ఆశ్రమమ్మై

వాసంత ఋతు రుతుములను ; 
సూర్య చంద్ర కరద్వయ మొగ్గి ; 
వినుచుండును నీలాలనింగి ;  || 

నళినాక్షీ! 
నీ మువ్వల గలగలలు సోకనట్టి ; 
నాదు శ్రవణమ్ములకు గ్రహణమ్ము ; 
సోకినదిదియె విధి రీతి!;  || 

మగువ!నీదు అలికిడైన కానరాని ; 
తరు వల్లరులు లిల రాలెను, వాడి పోయి;  || 

తరళాక్షీ! తరలిరమ్ము! 
నాదు 'వలపు దేవత 'కు ; 
నీ ఆగమనమ్మె - 
       ఆశ్రయమొసగెడు ; 
సతత హరిత ఆశ్రమమ్ము అగును! ; 
ఈ కన్నని చిరు చెమటల 
కరిగినదీ చంద్రశిల! 

శశివదన రాధికా! ;; 
నా గాధ - నీ రాకయే! ; 
నీ రాకయే నా వాసంత గాధ! 

==========================;

               nee aagamanammE ASramammai :- 

waasamta Rtu rutumulanu ; 
suurya chamdra karadwaya moggi ; 
winuchumDunu niilaala nimgi ;  || 

naLinaakshii! 
nee muwwala galagalalu sOkanaTTi ; 
naadu SrawaNammulaku grahaNammu ; 
sOkinadidiye widhi reeti!;  || 

maguwa!
nIdu alikiDaina kaanaraani ; 
taru wallarulu lila raalenu, wADi pOyi;  || 

taraLAkshI! taralirammu! 
nAdu 'walapu dEwata 'ku ; 
nee aagamanamme - 
     ASrayamosageDu ; 
satata harita ASramammu agunu! ; 
ii kannani chiru chemaTala 
kariginadii chamdraSila! 

SaSiwadana rAdhikaa! ;; 
naa gaadha - nee raakayE! ; 
nee raakayE naa waasamta gaadha!
;
 [ పాట 87 ; బుక్ పేజీ 92  , శ్రీకృష్ణగీతాలు ]
;

No comments:

Post a Comment