Sunday, September 18, 2016

చంద్రజ్యోత్స్నరాధికా!

దివి నుండి దిగి వచ్చిన ;
చంద్రజ్యోత్స్నరాధికా! ;    ||దివి||
;
నీ నీలి కురులు మబ్బులైతే
నీవు నీలి నింగివిలే;
నీ కనులు జంట మీనులైతే ;
నీవు గగన గంగవులే!;    ||దివి||
;
నీ కంఠము శంఖమైన ;
గరళకంఠునికి శాంతము ;
నాసిక సంపంగి ఐన ;
నీవు పూర్ణ నందనమ్మువులే ;    ||దివి||
;
నీ  నాసిక సంపంగి ఐన ;
నీవు సౌగంధిికా 
      సురభిళ ఉద్యానమ్మువు! ;
నీ కరములు మృణాళ తంతులే అయితే ;
రాధా! నీవే మానస సరోవరమ్మువు ;    ||దివి||
;
నీ నఖములు నక్షత్ర కోటి ;
రజనియె చీకటి మరుగున దాగును ;
ప్రేమగీతికి స్వరము కూర్పు
                            నీవు అయితే ;
మధురభక్తికి 
         అర్చనా ప్రతిమవు నీవేనులే!;    ||దివి||

========================== ;
;
 madhura bhakti ;-
diwi numDi digi wachchina ;
chamdrajyOtsnarAdhikA! ;    ||diwi||
;
nii neeli kurulu mabbulaitE 
              nIwu nIli nimgiwilE;
nee kanulu jamTa meenulaitE ;
neewu gagana gamgawulE!;    ||diwi||
;
nee kamThamu Samkhamaina ;
garaLakamThuniki SAmtamu ;
naasika sampamgi aina ;
neewu puurNa namdanammuwulE ;    ||diwi||
;
nee  naasika sampamgi aina ;
neewu saugamdikaa 
      surabhiLa udyaanammuwu! ;
nee karamulu mENALa tamtulE ayitE ;
raadhA! nIwE mAnasa sarOwarammuwu ;    ||diwi|| ]
;
nee nakhamulu nakshatra kOTi ;
rajaniye cheekaTi maruguna daagunu ;
prEmageetiki swaramu kuurpu neewu ayitE ;
madhurabhaktiki 
    rchanaa pratimawu neewEnulE!;    ||diwi||  

***********************************,|  
 [ పాట  66 ; బుక్ పేజీ  71 ]    శ్రీకృష్ణగీతాలు ]  ;- [ fb Thursday, September 8, 2016  ] 


No comments:

Post a Comment