Thursday, November 15, 2012

అమ్మకచెల్లా! క్రిష్ణుని చిత్తరువులు!


ఏలాగయినా ఎల్లాగయినా-
ఎల్లరు కూడి; క్రిష్ణుని పట్టాలి-
మా ముద్దుల కన్నని పట్టాలి  ||
;
వ్రేపల్లియలో ఉద్యానముల -
మల్లెల మొల్లల పొదరిళ్ళన్నీ-
వైకుంఠములో ఆదిశేషుని -
మైత్రిని నెరపెను కడు నేర్పుగను
శేషుని పడగల వేషాలూని-
మెల్లగ గుట్టుగ దాచినవేమో?    
దోబూచాటల మన పస పట్టగ (దలచి);
(వానిని) దాచినవేమో? అమ్మకచెల్ల!  ||

నల్లని మోహన బాలుని తోడ -
ఆడే చల్లని వేళలివి! –
దివిలో ఉన్న దివ్య దేవతలు-
పాలపుంతలను మోసుకొచ్చిరి;  
వినీలగగనము  దారులనిండా
పాలపుంతలను గ్రుమ్మరించిరి||

గొల్లభామల వృత్తుల నేర్చిరి-
ఎపుడో గానీ; అమ్మకచెల్లా!
పిల్లగాలులకు పరిమళమ్ములను;
దానము చేసిన మా రాధమ్మకు-
తన ఉల్లము నిండా హత్తుకున్నవి -
అల్లరి క్రిష్ణుని చిత్తరువుల్  
ఎంతటి వరముల భాగ్యములోహో!
లభియించినవి, (మా అమ్ములుకు) అమ్మకచెల్లా||
;



***********************************;

కోణమానిని తెలుగు ప్రపంచం
 34043 పేజీవీక్షణలు - 963 పోస్ట్‌లు, చివరగా Nov 14, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
అఖిలవనిత
 17939 పేజీవీక్షణలు - 673 పోస్ట్‌లు, చివరగా Nov 9, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 1942 పేజీవీక్షణలు - 109 పోస్ట్‌లు, చివరగా Sep 18, 2012న ప్రచురించబడింది

No comments:

Post a Comment