Monday, July 11, 2011

ఉమ్మడిగా కలిసుందాము

















ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము;
గోవిందుని జాడలు కనుగొందాము ||

చిత్తడి మడిలో పరుగులు పెట్టే;
           నీల మణీశుని పట్టుదము

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


పొదరిళ్ళ మల్లియల శ్వేత కాంతిలో-
            పీతాంబరుని వెదుకుదము ||

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


యమునలొ మీనుల నేస్తం చేసి-
        వాని, మొప్పల మాటున దూరేనో? ||

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


మయూరి మైత్రితొ- శత పింఛముల
      పురి వెనకాతల ముడుచుకొనేనో?||

ఒకే జట్టుగా ఉమ్మడిగా ఉందాము,
                    కలిసుందాము; 
గోవిందుని జాడలు కనుగొందాము ||


@@@@@@@@@@@@@@@@

okE jaTTugaa ummaDigaa uMdaamu, kalisuMdaamu; gOviMduni jADalu kanugoMdaamu ||
@)chittaDi maDilO parugulu peTTE; nIla maNISuni paTTudamu
|| okE jaTTugaa ummaDigaa uMdaamu, kalisuMdaamu; gOviMduni jADalu kanugoMdaamu ||
@)podariLLa malliyala SvEta kaaMtilO-pItaaMbaruni vedukudamu ||
@)yamunalo mInula nEstaM chEsi-vaani, moppala mATuna dUrEnO? ||
@)mayUri maitrito- Sata piMCamula puri venakaatala muDuchukonEnO?||

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No comments:

Post a Comment