
కాటుక, కాజల్ , అంజనము, నేత్రాంజనము, 
మస్కారా, ఐ లైనర్స్ (Eye liners,Powder (also known as surma),
 Paste, liquid, stick & pencil. ) వగైరాలు
 కాటుకకు అనేక పేర్లు ఉన్నవి. ప్రాచీన కాలం  నుండీ 
భారత దేశంలో కుటుంబీకులే తమ తమ ఇళ్ళలో తయారు చేసుకుని వాడేవారు. 
ఆయుర్వేద సాంప్రదాయక పద్ధతులు కొన్ని నేటికీ  అనుసరించబడుతూనే   ఉన్నాయీ అంటే 
వాటి గొప్పదనమును ఇట్టే అర్ధం చేసుకొనవచ్చును.

ఆఫ్రికా లో kohl అని పిలుస్తారు.  
ఆవనూనె, బాదం నూనె, ఆముదము, 
వెన్న, నెయ్యి , కర్పూరము వగైరా దినుసులు వి
విధ సీమలలో తయారీకై ఉపయుక్తములౌతున్నాయి.
Indiaలో దేవళములలో దేవీ, దేవతామూర్తులకు, దేవుని కనులకు 
కాటుకను, లలాట ఫలకముపై తిలకమునూ, కుంకుమనూ 
అలాగే హనుమాన్ విగ్రహాలకు సింధూరమును, అలంకరించుట 
సత్సంప్రదాయ అనుసరణగా ఉంటున్నది.   
                                                            

కాటుకను తయారు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి.
అవి అన్నీ కొంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ, మూల సూత్రం ఒకటే! 
కళ్ళకు మేలు చేసే దినుసులతో మసిని తయారు చేయడమే !
(కొందరు మేక పాలు, ఆవు పాలు , బాదం పప్పు, 
గంధము పొడి, మున్నగు పదార్థాలతో చేస్తూంటారు.) 
ఆ యా విధానాలకు మౌలికమైన పునాది అన్న మాట.
   
ఈ సారి ఒక పద్ధతిని గమనించుదాము.
కాటుక కను దోయికి కానుక.
కాజల్, సుర్మా, అంజనం ఇత్యాదిగా వివిధ రూపాంతరాలతో 
భారత దేశములో కాటుక తయారీ విరివిగా ఉత్పత్తి ఔతూ, 
గృహిణులకు వంటతో సమానంగా తెలిసిన విద్య అని 
ఘంటా పథంగా చెప్పవచ్చును.
ఆధునిక కాలంలో యువతులతో పాటు యువకులు కూడా 
నేత్రాలంకారాలను ఆసక్తితో చేసుకుంటున్నారు. 
ఇప్పుడు కాటుక లాగా pencils ను ఉపయోగిస్తూన్నారు.
సరే! 
ప్రాచీన సాంప్రదాయిక కళగా slow గా 
చరిత్ర పుటలలోనికి చేరబోతూన్న
నిన్నటి ఈ కళను గమనిద్దాము.
                                                                                                            

A method with Sandal powder ;
_______________________
@) పలచటి తెల్లటి,మజ్లిన్ వస్త్రాన్ని తీసుకోవాలి.
దీనిని 4,4 అంగుళాల కొలతతో సిద్ధం చేసుకొనాలి.
గంధ పొడిని / గంధపు చెక్కను అరగ దీసి లేపనం  తయారు చేసుకోవాలి.
@) తెల్ల, పలచని క్లాత్ ని గంధము/ చందన లేపనములో తడిపి ఉంచాలి.
@) నీడ పట్టున గంధ వస్త్రాన్ని ఆరబెట్టాలి.
  ఇలాగ నీడలో ఎండ బెట్టిన వలువ ముఖ్య పదార్థముగా రెడీ! 
@) తక్కిన పనిని సాయంకాలము తర్వాత చేసుకొనాల్సి ఉంటుంది.
ప్రమిదలో నిండా ఆముదము(castor oil) ను పోయాలి. 
వెడల్పాటి ఇత్తడి ( braass )పళ్ళాన్ని తీసుకోవాలి.
@) గంధపు cloth ముక్క ప్రమిదలో వేసి వత్తిలాగా ఉపయోగపడ్తుంది.
పళ్ళానికి అడుగున గంధాన్ని పలచగా పూయాలి.
@) వెలిగించిన జ్యోతికి తగినంత ఎత్తులో, చందన లేపన పళ్ళెరాన్ని పెట్టాలి.
( సాధారణముగా మూడు ఇటుక రాళ్ళు అమర్చి మధ్యలో వెలిగించిన ప్రమిదను పెడ్తారు.)
@) గాలి తగలని చోట స్థిరంగా జ్యోతి వెలిగేటట్లుగా అమర్చి, 
దానిపైన ఇత్తడి ప్లేటును ఉంచుతారు.
రాత్రి అంతా అలాగ ఉంచిన పళ్ళానికి అడుగున మసి పడుతుంది.
తెల్లవారి, పొద్దున్నే ఈ పళ్ళెము కాటుకకు అనువైన మసితో సిద్ధంగా ఉన్నది.
@) రెండు చుక్కల నేతి బొట్లు వేసి, బాగా నూరాలి.
వెన్నను గానీ, నెయ్యిని గానీ, ఆముదాన్ని గానీ ఇందుకై ఉపయోగించ వచ్చును.
@) ఇలాగ నెయ్యితో నూరిన మిశ్రిత లేపనాన్ని గీకి, ఒక శుభ్రమైన డిబ్బీలోనికి, జాగ్రత్త తీసి  పెట్టుకొనాలి.
తాటాకు బద్దతో, చాకు వంటి వస్తువుతో గానీ మసిని పళ్ళెంనుండి జాగ్రత్తగా గీకాలి.
కొన్ని ముఖ్య జాగ్రత్తలు::::
_______________
 
@) వాడే వస్తువులు శుభ్రంగా ఉండాలి.
@) వత్తి వెలుగు గాలికి కదలకుండా, స్థిరంగా ఉన్నప్పుడే, 
లోహ పళ్ళానికి మసి ఎక్కువ పట్టి, 
కాటుక అధికంగా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
@) కాజల్ ను అట్టిపెట్టుకునే డిబ్బీని ఎండబెట్టి, 
చెమ్మ లేకుండా ఉంచుకొనాలి. తడి ఉంటే వస్తువు బూజు పట్టే అవకాశము ఉన్నది. 
@) ఒకసారి తయారైన ఈ నయనాంజనాన్ని 
అనేక ఏళ్ళ వరకూ ఇంచక్కా వాడుకోవచ్చును.