Monday, April 11, 2011

లోకాభిరామా!









వినీల గగనాలకు నీ మేని సౌరులు

వరమీయుచుండును క్రొమ్మెరుగు దనములు

మా కనుపాపలే నీ కొలువు కూటములు;

కొలువు దీరుము స్వామి!లోకాభిరామా!    ||మా కనుపాపలే|| 

ఆప్త పద్మమ్ములు శ్రీ వారి పదములు;

లిప్త లిప్తకు చరణ పద్మమ్ము జాడలను; 

హత్తుకొనిన సప్త శైలమ్ములు;

తృప్తి విప్పారిన మకరంద రాశులు    ||మా కనుపాపలే|| 

కుందనపుబొమ్మ సతి పద్మావతిని జతగ; 

భక్తుల హృదయాల పుణ్య పుష్కరిణుల(లోన)
         ఉందువు శ్రీ ధామ! రాజ హంసవు నీవె!

విహరించుమోయీ!శ్రీ శ్రీనివాస!    ||మా కనుపాపలే||

మా కనుపాపలే నీ కొలువు కూటములు


వినీల గగనాలకు నీ మేని సౌరులు వరమీయుచుండును క్రొమ్మెరుగు దనములుమా కనుపాపలే నీ కొలువు కూటమ్ములు;                                                                           కొలువు దీరుము స్వామి! లోకాభిరామా!   ||మా కనుపాపలే ||         
ఆప్త పద్మమ్ములు శ్రీ వారి పదములు;లిప్త లిప్తకు చరణ పద్మమ్ము జాడలను; హత్తుకొనిన సప్త శైలమ్ములు;తృప్తి విప్పారిన మకరంద రాశులు  || మా కనుపాపలే ||      
 కుందనపుబొమ్మ సతి పద్మావతిని జతగ;  భక్తుల హృదయాల పుణ్య పుష్కరిణుల లోనఉందువు శ్రీ ధామ! రాజ హంసవు నీవె!                                                                   విహరించుమోయీ!శ్రీ శ్రీనివాస!    || మా కనుపాపలే ||   


నెల్లూరులో "తిక్కన మండపము"


విక్రమ సింహపురి అనేది నెల్లూరు కు గల ప్రాచీన నామము.
తిక్కన ఘంటము చేత పూని (stylus)ఒక మండపములో కూర్చుని,
మహా భారత రచన చేసెను.
వ్యాస మహా ముని "జయమ్"ను సంస్కృతములో వ్రాసాడు.  
కవిత్రయము ఆంధ్రీకరణతో 
మహా భారతము తెలుగు ప్రజలకు  సుపరిచితమైనది.
పెన్నా నదీ తీరాన ఈ మహా చారిత్రక సంఘటన జరిగినది.
అచ్చట "తిక్కన మండపము"
ఈ మహత్తర ఘటనకు తార్కాణంగా ఉన్నది.


       తిక్కన మండపము (Link)

రష్యన్ చిత్రకారుడు art gallery



నిచొలస్ రోరిచ్ రష్యన్
(Nicholas Roerich, 
(October 9, 1874 - 
December 13, 1947) 
చిత్రకారుడు. ఇండియా, హిమాలయాలు, టిబెట్ మున్నగు దేశాలలోని ప్రకృతి సౌందర్యాలూ, వాస్తు, ధార్మిక నిర్మాణాలూ అతనిని ఆకర్షించినవి.మలన వ్యాలీ(Malana valley) వద్ద చందర్ ఖని (Chanderkhani)దరిని నగ్గర్(Naggar) వద్ద Roerich art gallery  ఉన్నది.కులూ లోయలు, బిజిలీ మహా దేవ దేవాలయ సౌందర్యాలు ఆతని కుంచెలో జీవం తొణికిసలాడేలా చేసాయి.

A view of extended balcony of Naggar Castle and cloudy hills in he background...
Here a gallery houses the paintings of the Russian artist Nicholas Roerich
his paintigs (Link)

Sunday, April 10, 2011

ఆ 10 స్త్రీల నామములు (Ten women names)











తిరుపతిలో శ్రీ క్రిష్ణ మందిరము 
"కలియుగ వ్రేపల్లె" లా భాసిస్తూన్నది. 
ఇస్కాన్ (International Society Krishna Conciousness) వారు నిర్మించిన 
అద్భుత శ్రీ క్రిష్ణ మందిరము. 
ఈ విశాలమందిరంలో శ్రీ క్రిష్ణుడు మురళిని చేబూని విలాసంగా నిలబడి ఉన్నాడు. ఇక్కడ స్వామికి ఇరు పక్కల అష్ట వనితలు పూ దండలు, పద్మాలనూ చేతిలో పట్టుకుని ఉన్నారు.ఈ కోవెలలో ఒక విశేషం అగుపడుతుంది. క్రిష్ణ మూర్తి వద్ద ఉన్న ఎనిమిది మంది మహిళలకు వేరే పేర్లు కలిగి ఉన్నారు. అదీ విశేషం.
మామూలుగా "అష్ట మహిషుల"నామాలు 
అందరికీ తెలిసినవి-ఇలాగ ఉన్నాయి.
రుక్మిణి, 
సత్యభామ, 
మిత్రవింద,  
జాంబవతి,
కాళింది,
నాగ్నజితి
  (నీల/ సత్య అని కూడా ఈమె పేర్లు),
భద్ర,
లక్షణ   
అంతర్జాతీయ శ్రీ క్రిష్ణ సమాజము వారి కోవెలలో ,                                                                                                         వ్రేపల్లెలో బృందావనములో నాట్య క్రీడలు ఆడిన                                                                                                            దశ భామినులు ఉన్నారు.
          ది మంది నామావళి :
తుంగ విద్య, 
సుచిత్ర, 
చంపక లత 
లలిత 
గోవిందజీ 
రాధా రాణి 
విశాఖ, 
ఇందులేఖ 
రంగ దేవి 
సుదేవి 
 పాలరాతితో నిర్మితమైన సువిశాల శ్రీ క్రిష్ణ మందిరములో అడుగడునా చిత్ర పటాలు, మురల్స్ కళలు, శిల్పాలు ఆధునిక రీతిలో అందాలను మేళవించుకున్నవి."ఇస్కాన్ గుడిని చూడ; వేయి కనులు చాలునా!"ఎంత వర్ణించినా తనివితీరని సొగసుల కలబోత ఈ దేవళము. 
Iskcon mandir అందరికీ నయనానందకరము.



               
తిరుపతిలో శ్రీ క్రిష్ణ మందిరము 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Saturday, April 9, 2011

ఆది వాసీల భాషలకు మైలు రాళ్ళు




















గోండు భాష కూడా విదేశీయుల జిజ్ఞాసను చూరగొన్నది. 30 లక్షలమందికి గోండు భాష వ్యవహారంలో ఉన్నది. మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ లోనే 10 లక్షల మంది గోండు భాషీయులు ఉన్నారంటే, ఆ భాష ప్రధానమైనదనే భావించవచ్చును. 1942-43 లలో Heman Darf "గోడు గిరిజన వాక్కులకు"ఉద్యమ స్థాయిలో సేవలను అందించారు.ఆధునిక కాలంలో మార్క్ పెన్ని, తన భార్య johanna penni,(వీరి సంతానము అభి, ప్రియ, కరీనా) సహకారంతో, గోండు భాషకు   పునరుద్ధరిస్తూ, కృషి చేస్తున్నారు. ఛార్లెస్ బ్రౌన్ వంటి Western reaserch పరిశోధనాసక్తిపరుల,గిడుగు రామమూర్తి పంతులు మున్నగు ఆంధ్రుల- సవర భాషా సేవలు ( ఆది వాసీల పలుకులకు ఆ మాటకొస్తే తెలుగు కూడా పరాయి భాషే కదా!)చిర కాలం జ్ఞాపకం ఉంచుకోవలసినవి.మన భారత దేశములోని స్థానిక, అరణ్య వాసుల,  గిరిజనుల భాషలకు విదేశీయుల అపరిమిత  పరిశ్రమ, నేటి లింగ్విస్టిక్/ భాషా శాస్త్రవేత్తల పరిశోధలకు స్ఫూర్తి నిస్తూ, అప్పట్టుల Reaserch ఆవశ్యకతను  గుర్తు చేస్తూన్నాయి కదూ!
 1. మైలు రాళ్ళు  (Link read)
 2.లింగ్విస్టిక్  స్ఫూర్తి (Link read)
 3. More matter (Link)    

పురుషోత్తమ! శ్రీ రామా!













భక్త మనో మందిర వాసా! ;
దాశరధీ! దయా సింధు!
కోదండ రామ! మా అండ ఎపుడు నీవే! ||

జలజాక్షి జానకీ నాధ,
నారాయణ! పురుషోత్తమ!
నమస్సుమాంజలి!
గైకొనుమా మా స్వామి!
శత కోటీ నమస్సుమాంజలి ||

జలద వర్ణ మోహనా!
వాల్మీకీ సన్నుత!
నమస్సుమాంజలి!
గైకొనుమా మా స్వామి!
శత కోటీ నమస్సుమాంజలి   ||

 (పురుషోత్తమ! శ్రీ రామా!)

&&&&&&&&&&&&&&&&&&&&


            purushOttama! SrI raamaa!




















Bakta manO maMdira vaasaa! ; 
daaSaradhI! dayaa siMdhu! 
kOdaMDa raama! maa aMDa epuDu nIvE! ||


jalajaakshi jaanakI naadha,  
naaraayaNa! purushOttama! ;; 
namassumAMjali! 
gaikonumaa maa svaami!
Sata kOTii namassumAMjali   ||


jalada varNa mOhanaa! 
vaalmIkii sannuta! 
gaikonumaa maa svaami!
Sata kOTii namassumAMjali   ||

&&&&&&&&&&&&&&&&&&


84 – 252 లీలా గాథలు (84-252 vaishnav vartas ) 
వైష్ణవ భక్తి సామ్రాజ్యములో వినుతి గాంచినవి.
తులసీ దాసు యొక్క సోదరుడు నందనార్  అనే భక్తుని చరిత్ర, 
ఆ యా కథల వలన లోక విదితమైనది.

 तुलसी मस्तक तब नमे, धनुष बान लेहु हाथ
Tulsidas will only bow 
when you will grasp the bow & arrows in your hands.

बरनौ अवध श्रीगोकुल गाम, उत बिराजत जानकी-वर, इतही श्यामा-श्याम
Glory to Gokul because the Lord of Sita, 
my Rama resides here as Krishna & Radha…




    See ; LINK ::::::
    
      తులసీ దాసు యొక్క సోదరుడు నందనార్


    bhakta naMdanar , brother tulasi das  

Friday, April 8, 2011

శత కోటి నామాలు కల స్వామి





















ముక్కోటి సామగ్రి సరి పోవునా?
నీకున్న పేర్లేమొ శత కోటీ!
స్వామి! నీకు పూజలు చేయ ||

పువులు, పత్రి,
జలము, అక్షింతలు;
ఎన్ననీ తేగలను? ఎన్నికగ మా స్వామి! ||

చందన,పన్నీర్లు,
అత్తరుల బిందువులు  
ముక్కోటి సామగ్రి సరి పోవునా?
ఎన్ననీ తేగలను? మన్నికగ మా స్వామి! ||

&&&&&&&&&&&&&&

   Sata kOTi naamaalu kala svaami
  __________________________




















mukkOTi saamagri sari pOvunA? ;  
nIkunna pErlEmo Sata kOTI! : 
svaami! nIku pUjalu chEya ||


puvulu, patri, jalamu; akshiMtalu; 
ennanii tEgalanu?  
ennikaga maa svaami! ||


chaMdana, pannIrlu,
attarula biMduvulu ; 
mukkOTi saamagri sari pOvunA? ;
ennanii tEgalanu? 
mannikaga maa svaami! ||  

&&&&&&&&&&&&&&&&&&&&

నీ గాథలు లోక కళ్యాణ కరములు క్రిష్ణా!





















మాకందించిన నీ లీలల గాథలు; 
లోక కళ్యాణ కరములు క్రిష్ణా! ||

మన్నుల పొర్లి, కొమ్మల ఊగి; 
కందెను కన్నని కర కమలములు – అని, 
కలత చెందినది యశోదమ్మ
కన్న తల్లి కింత శోధనయా?
దయ ఏదయ్యా? నీ హృదయములో? ||

కాళియ నాగము పడగలు పట్టిన ;
పల్లవాంగుళులు కందినవనుచూ ;
గోపెమ్మలు ఎంతో విల విలలాడిరి 
భక్తుల కేలనొ వేదనలు? ||

మురళిని ఊదెడు కెంపుపెదవులు
కందినవనుచూ రాధా దేవి; 
ఖేదము నొందెను నిలువెల్లా 
చివురుటాకుగా రెప రెపలాడెను ||

మాకందించిన నీ లీలల గాథలు; 
లోక కళ్యాణ కరములు క్రిష్ణా!


&&&&&&&&&&&&&&&&&&&&&&&&




















pallavaamguLulu kaMdinavanuchuu ; 

gOpemmalu eMtO vila vilalADiriBaktula kElano vEdanalu? || 

muraLini UdeDu keMpupedavulu ; kaMdinavanuchU ; raadhaa dEvi KEdamu noMdenu niluvellaa chivuruTAkugaa repa repalaaDenu ||

maakaMdiMchina nI lIlala gaathalu; lOka kaLyaaNa karamulu krishNA!


Thursday, April 7, 2011

ఉర్వి శ్రీ కల్ప వల్లి ||
















వ్రేపల్లె, ద్వారక, మధురా పురి
పుడమి అంతటికీ శ్రీ కల్ప వల్లి ||

గోప భామినులు చల్ల చల్లని వేళ ;బయలుదేరేసి;
         చల్ల చల్లోయమ్మ చల్లలని అమ్మగా బయలుదేరేసి;
         పలుకుల పన్నీరు చిలకింప జేసేసి ||

చిన్న రాయి వచ్చి కడవను తాకేసి , 
భళ్ళుమని/ను సడి సేసి చల్లలొలకంగా;  
అవి తలంబ్రాలంటు; నవ్వు వినిపించీ..... ||
"ఆ నగవులెవరివీ? ఓసోసి!"
పాలు, వెన్నలు ఒలికి; మీగడల తరకలతొ;   
మేఘాల నింగీ ఆయెనమ్మా! దారి ఓసోసి! ||

Wednesday, April 6, 2011

శ్రీ నామ రచనల నోములు


















శ్రీ క్రిష్ణ "శ్రీ నామ రచనల నోము"ను
పట్టినది ప్రకృతి భక్తి భావనలకు ఆకృతి ||


గోప భామినులు
నడుముల కడవల
చల్లలు చిందగా;;;
బాటలన్నీ పాల కడలులూ ఆయేను
మార్గములు పట్టినవి
శ్రీ నామ రచనల నోములు  ||


గగనము పట్టెను ;
 మేఘాల పొత్తములు;
మబ్బు పుటలందున;
మెరుపుల లిపులతో;
శ్రీ నామ రచనల నోములను తీర్చేను అంబరము   || 

వ్రాసేను శ్రీ క్రిష్ణ నామావళి

















మోహనమౌ మురళీ రవళి ;
చిరు గాలి పంక్తుల ;
వ్రాసేను శ్రీ క్రిష్ణ నామావళి ||

అలుపు సొలుపెరుగక ;
విప్పార్చి నెమలి పురి
ఆడె వన మయూరి (లు) ||

బర్హి పింఛమ్మున
రవి కిరణ శోభలు
విరజిమ్ము శ్రీ క్రిష్ణ నామావళి ||

గగన పౌర్ణమి రాశి ; తేజస్సులు
యమునా తటిని, జల పంక్తుల
వ్రాసేను విప్పార్చి నెమలి పురి ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

mOhanamau muraLI ravaLi ;
chiru gaali paMktula ;
vraasEnu SrI krishNa naamaavaLi ||

@)alupu soluperugaka ;
vippaarchi nemali puri
ADe vana mayUrilu ||

@)barhi piMCammuna ;
kiraNa SOBalu ;
virajimmu SrI krishNa naamaavaLi ||

@)gagana paurNami raaSi tEjassulu ;
yamunaa taTini, jala paMktula ;
vraasEnu vippaarchi nemali puri ||