
నా కడ, నీ కడ ; వారిజాక్షిరో!
వేకువ కెందుకొ ఇంత తొందరా!?
;;;;;
వేకువ రెప్పల కంటి కాటుకగ;
రేయిని ఒసగి, రాకా చంద్రుడ!
వై దొలగుమా!నువు
రవంత జరుగుమా! ||
;;;;;;;;;;;
ఓహోహో!
ప్రత్యూష మారుతమా!
ప్రాగ్దిశలో ఓ అరుణోదయమా!
రవ్వంత అగుమా!
ఉలికిపడును మా బేల రాధిక! ||
;;;;;;;;
ధారా పాతంగా ఇదిగో!
చల్లని కాటుక! నయన వేడుక ;
మబ్బు భరిణలో రాత్రి కానుక!
;;;;;;;;;
కన్ను దోయికి పెట్టుకొనీ,
శేషాంజనమును,తన
నీల కుంతలములకు;
వ్రేలిని రాపిడి*చూచెను రాధిక ;
;;;;;;;;
“రమణి బుగ్గకు దిష్టి చుక్కను
పెట్ట వలసిన అక్కర ఉన్నది
నీలాంజనమును - మరి కొంచెము ఈమని,
రేయిని వేడుచు కొసరెను క్రిష్ణుడు ||
;;;;;;;
[తమస్సు నేత్ర కాటుక ( కవిత) ]
[* రాపిడి= రాయుట/ ఒరిపిడి]
No comments:
Post a Comment