Sunday, March 20, 2011

తిరు నామ దీప్తి వోలె సోపాన పంక్తి
ఏడు కొండల మెట్లు;
మహిళలు, భక్తులు
పసుపు కుంకుమలను
అలదుచున్నారు
శోభిల్లు తిరు నామ దీప్తి వోలె
అవె సప్త గిరుల సోపాన పంక్తి ||

శ్రిత జన కల్ప తరువు,అభయ వర దాత!
మా చేయిని అందుకొను - వరద హస్తుడు, స్వామి!,
సప్త గిరులందున కొలువై ఉన్నాడు ||

ఆదుకునే స్వామి, కోటి వరములను
ఒసగేటి ఇలవేల్పుఅందుకొన వెళదాము,
అందుకనే - చూదాము శ్రీ వేంకటేసునీ
చూదాము చూదాము ||

తిరుమల గిరులు, శాంతి హారములు ;
ఆక - తాయి పనులు మాని;
రభసలు సేయక; కొండ కొమ్ముకు మనము
వెళదాము వెళదాము ||

No comments:

Post a Comment