Sunday, March 20, 2011

దండాలు అందుకో! శ్రీ తిరుమలేశా!


పారిజాత దళము శత కోట్లను ;
పరచి ఉంచిన కొండ దారులందు
భక్త కోటి సేయు అధిరోహణం
వే వేల దండాలు అందుకో స్వామి!
శ్రీ తిరుమలేశా!అభయ వర దాతా! ||

మేఘ రాసులలోన - వాన శిల్పాలను
వెలయింప జేయుట- నీదు వంతు!
అందుకే కద! నీవె మాకు తండ్రి
వే వేల దండాలు అందుకో స్వామి!
శ్రీ తిరుమలేశా!అభయ వర దాతా! ||

అందియల రవళులు - వర్ష ఋతు ధారలు
అంద చందాల చిరు నవులు - మా వంతు
వే వేల దండాలు అందుకో స్వామి!
శ్రీ తిరుమలేశా! అభయ వర దాతా! ||

నీ నుదుట తీర్చిన - నిలువు నామమ్ములు
వరుస కొండల మెట్లు - వేంకట నాయకా!
వే వేల దండాలు అందుకొను'మా' స్వామి!
శ్రీ తిరుమలేశా! అభయ వర దాతా! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No comments:

Post a Comment