Sunday, March 20, 2011

తిరుమలేశుని అధర దరహాసములు























::::::::::::::::::::::::
కరుణార్ద్ర హాసములు;
నెలకొనిన మేడలు,
శ్రీ వేంకటేశు పెదవులు ||


విరిసేను తారకలు ;
వరహాల చిరు నవ్వుల;
దేవేరి - అర చేత గోరింట ;
చుక్కలే ఆయేను
తిరుచనూరు ; నిత్య దీప శోభ!
కార్తీక దీప శోభ! ||

పద్మావతీ కురుల అందాలను
నీలాంబరము హత్తుకునియేను;
ఆనంద కేతనము;రెప రెపలను చూసి,
నవ నృత్య భంగిమల
మలయ మారుత క్రీడ వయ్యారమే! ||

No comments:

Post a Comment