Monday, March 7, 2011

సాదు బొట్లు, దిష్టి చుక్కలు


అబ్బలాల! పిల్ల వాడు;
ఇంతులార! చూడండీ!;
కన్న తల్లి యశోదమ్మ;
"కను దిష్టి తగులు"నంటు;
దిష్ఠి చుక్కలను పెట్టెను; ||

పారాడుతు క్రిష్ణుడు;
నేలంతా పగడాలు;
దోగాడుతు క్రిష్ణుడు;
దొర్లించును మణులెన్నో!

తప్పటడుగులు వేస్తేను;
అరి కాలి పద్మ రేఖ;
కొలనాయెను ఇల్లంతా||

త్త త్త త్తా ; న న్నన్నా నాన్నా;
అత్తత్త అమ్మా; తొక్కు పలుకులిన్నిన్ని;
గుమ్మరించు ముత్యాలు;
తీపి గడ్డ పెరుగు రుచులు;
మాకు నేడె తెలిసేను అమ్మలాల!||
చాదు బొట్ట్లు, దృష్టి చుక్క వందలతో ;
మోమంతా నింపినారు ప్రేమ మీర మాతలు;
"నిండు చందమామకు ;
కావలసినంత సంబరము;
"తన్ మించిన అందగాడు
ఇంక తానే"ననుచూ ||
&&&&&&&&&&&&&&&&&&&

saadu boTlu, dishTi chukkalu
______________________



































abbalaala! pilla vaaDu;
iMtulaara! chUDaMDI!;
kanna talli yaSOdamma;
"kanu dishTi tagulu"naMTu;
dishThi chukkalanu peTTaga/ TTenu; ||

paaraaDutu krishNuDu;
nElaMtaa pagaDAlu;
dOgaaDutu krishNuDu;
dorliMchunu maNulennO!||

tappaTaDugulu vEstEnu;
ari kaali padma rEKa;
kolanaayenu illaMtaa||

tta tta ttaa ;
na nnannaa naannaa;
attatta ammaa;
tokku palukulinninni;
gummariMchu mutyaalu;

tIpi gaDDa perugu ruchulu;
maaku nEDE telisEnu, ammalaala!||

chaadu boTTlu,
dRshTi chukka vaMdalatO ;
mOmaMtaa niMpinaaru maatalu;
"niMDu chaMdamaamaku ;
kaavalasinaMta saMbaramu;
tan miMchina aMdagaaDu
iMka taanE"nanuchU ||

&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment