Tuesday, March 29, 2011

ప్రకృతి అంటే కొండంత ప్రీతి
;;;;;;
ఆకులు, అలములు - చెట్లు పుట్టలు
మన్నులు, మిన్ను - గోవులు, ప్రకృతి
అంటే నీకు కొండంత ప్రీతి గద! ఎందుకనీ? -
వింత లీలలు ఇన్ని ఏలరా?
నీల మోహనానంద నందనా! ||

వట పత్రములో తూగాడేవు;- పెను తరువుల నూగాడేవు;
వెదురు తోపులలొ తిరుగాడి - పిల్లన గ్రోవిని ఊదేవు
గాలి చెవులతో నీలాంబరము - తనివారా విని,పులకించేను
వైజయంతి మాలా లంకృత క్రిష్ణా! తులసీ దళ ధామా!- ||

వంశి నికుంజము - మల్లె పొదలదే - పూర్వ జన్మముల పుణ్యమురా!
నిరంతరము నీ ఆట పాటలను - ఆకు, పూవులే కన్నులయీ;
కమనీయముగా దర్శించును నిను! - సర్వ ప్రకృతికి చూపించేను
వైజయంతి మాలా లంకృత క్రిష్ణా! తులసీ దళ ధామా! ||

No comments:

Post a Comment