Friday, March 25, 2011

కాంతుల కలివిడి తనములు ;
























;;;;;;;;
జాతర! జాతర! జాతర! ;
గల గలల జాతర! ||

గోదావరి, క్రిష్ణ వేణి,
అలల కలిమి
కలబోతగ విరియండీ
ఇంద్ర ధనుసులార! ||

గౌతమీ కిన్నెరల
కెరటాల తీవెల పై;
వీణా గానములను
వినిపించుమా! వెన్నెలా! ||

తుంగ భద్ర వాహినిలో
జలకాలూ ఆడుతూ;
ఉర్వికి వేంచేయండి,
ఉదయ కిరణమ్ములార!
ప్రాక్ మయూఖములారా! ||

పినాకినీ పద ముద్రల;
వినీల గగన శోభలు ;
నర్తనములు సేయగా
మేఘ మల్హారములార! ||
[కాంతుల కలివిడి తనాలు ]

No comments:

Post a Comment