Tuesday, March 29, 2011

కొండను నిలిపిన వేలు


అమ్మమ్మొ! ఓ రాధా రమణీ!
కడు మెండుగ ఇలాగ ఖేదములేల?
కౌస్తుభ మణిధారి రాకకై
ఇంత వంతలా? ఇన్ని చింతలా? ||

కొంటె తనముల క్రిష్ణయ్యా!
కొంచెం నువ్వు తగ్గు! తగ్గవయ!
వెనకా ముందూ చూడని ఆర
డి -
తనములు, గందరగోళములు;
చేసేవేల? తుంటరి పిల్లడ!? ||
వనితా మణి నును చెక్కిలిపైన
ఇంతే చిన్నగ మీటితి నంటివి!!!!!
గో-వర్ధన కొండను నిలిపిన *వేలది!!!
ఆ - నీ - వ్రేలి గాటు "గాతము సుమ్మీ!"
అమ్మమ్మో! చెప్పరాదు ||

ఒప్పుల కుప్పల గిర గిర ఆ
టలు!
కన్నులు తిరిగెను మా రాధమ్మకు!;
శకటాసుర వైరీ! సుదర్శన ధారీ!
సుంత నెమ్మది! వహించుమోయి
ఆటలు ఇవి, పోరాటమ్ములు కావు "కావుము!"* ||

@@@@@@@@@@@@@@@@@@@@@@@

* వేలు అది = finger/ అంగుళి
** కావుము = రక్షించు/ save

No comments:

Post a Comment