అల్లదే!తిరుపతి!
అభినవమౌ మధురా పురి!
చతురు లాటలకు నెలవు
అబ్బురముల పుట్టిల్లు ||
పద్మావతి కవ్వించి – నాంచారు నవ్వించి
శ్రీ వేంకట నాథుని – మోము చిన్నెలను చూచి
పులకించి, దినమణి – ఇల కొసగెను పగలు పళ్ళెరము నిండ
శత కోటీ కిరణ రాశి ||
అలమేలు మంగ కెంపు పెదవి – వంపుల “శ్రీ” లను చుట్టి
చిలిపి హాసముల నెన్నొ – సప్తగిరి వాసుడు సృజియించెను;
అది కాంచిన పద్మాసన సతి లక్ష్మి – మనసున కెర్లింతలు
“నాదు “శ్రీ”ని సవతి పద్మావతి కడ
దాచు ఈ మగనికి – చెప్ప నలవి కానంత పొగరు, గీర్వాణమే! ||
అయ్యారే! అవ్వారి – తలపోతల ,ఈసులు, అసూయలు,మాత్సర్యాల
మధుర మధుర గాధలు – మూపురముల నిలుపుకునీ
త్రి భువనమ్ముల చాటగా - గోమాతలు సాగేను! –
అల్లదే! మధురా పురి – చతురు లాటలకు నెలవు ||
;;;;; నవ్య మధురా పురి!
********************************
navya madhuraa puri!
-----------------------------
alladE!tirupati!aBinavamau madhuraa puri!chaturu laaTalaku nelavuabburamula puTTillu ||padmaavati kavviMchi – naaMchaaru navviMchiSrI vEMkaTa nAthuni – mOmu chinnelanu chUchipulakiMchi, dinamaNi – ila kosagenu pagalu paLLeramu niMDaSata kOTI kiraNa raaSi ||alamElu maMga keMpu pedavi – vaMpula “SrI” lanu chuTTichilipi haasamula nenno – saptagiri vaasuDu sRjiyiMchenu;adi kaaMchina padmaasana sati lakshmi – manasuna kerliMtalu“naadu “SrI”ni savati padmaavati kaDadaachu I maganiki – cheppa nalavi kaanaMta pogaru, gIrvaaNamE! ||ayyaarE! avvaari – talapOtala ,Isulu, asUyalu,maatsaryaalamadhura madhura gaadhalu – mUpuramula nilupukuniitri bhuvanammula chaaTagaa - gOmaatalu saagEnu! –alladE! madhuraa puri – chaturu laaTalaku nelavu ||
No comments:
Post a Comment