"ఒకే సారి ఒకే చోట
నెల వంక, జోడీగా
పున్నమీ జాబిల్లి
వెలిసె నెటుల? చెప్పవమ్మ!
ఈ చిక్కు ముడిని విప్పవమ్మ!
ముద్దుగాను అమ్మాయీ!" ||
"జనని గోరు నెల వంక!
ఆ కొన గోటిపైన గోరు ముద్ద –
అరయగాను
అదే నిండు చంద మామ!
ఇదే కదా జవాబు!" ||
“అరెరె! చిటికెలొ చెప్పేసినావు;
ఏమి కిటుకు దాచినావు?
వివరించవోయి, అబ్బాయీ!”
"ఇంతప్పటి నుండీ
కన్న తల్లి ఒడిలోన
వెండి గిన్నె – పాల బువ్వ
మారాము చేస్తు తిన్నాము!
ఆ మాత్రం తెలుసుకోమ?
చిట్కా వేరెందులకు?”
*****************************
_____________
"okE saari okE chOTa
nela vaMka, jODIgaa
punnamii jaabilli
velise neTula? cheppavamma!
iichikku muDini vippavamma!
muddugaanu ammaayI!" ||
"janani gOru nela vaMka!
aa kona gOTipaina
gOru mudda –
arayagaanu
adE niMDu chaMda maama!
idE kadaa javaabu!" ||
“arere! chiTikelo cheppEsinaavu;
Emi kiTuku daachinaavu?
vivariMchavOyi, abbaayI!”
"iMtappaTi nuMDI
kanna talli oDilOna
veMDi ginne – paala buvva
maaraamu chEstu tinnaamu!
aa maatraM telusukOma?
chiTkaa vEreMdulaku?”
******************************
No comments:
Post a Comment