Sunday, July 4, 2010

తేనె కానుకలు


















మబ్బు జలదరించింది
పుడమి పులకరించింది
ఆమని తలవంచింది;
ఏమని తలచిందంటే –
“పైరు పాపలెంతొంతో
ముద్దు లొలుకుతున్నారని ||

ఏటిలోన నీటి జాలు
గల గల ప్రవహించినది
తొలకరి మాటలను "హొయలు"+
పాటలుగా మార్చేసి,
ఏరు వీణ అయ్యింది
తారంగం నేర్చింది ||

ఒడలు విరుచుకుని “ ప్రొద్దు”
మొద్దు నిదుర వదిలింది
వెలుగు రేక భాషలోన
సుప్రభాత గీతికను
తియ తీయగ పాడింది
తేనె కాను‌క లిచ్చినది ||


#Baala


By kadambari piduri,
Jul 3 2010 1:39AM

No comments:

Post a Comment