Tuesday, July 13, 2010

ఓహో మేఘ మాలా!

















గగనాల తారాడు
వయ్యారి జల ధరమా!
సయ్యాటలను నీకు
నేర్పెదము రావమ్మ! ||

హిమ బిందు శత కోటి
మణి పూస లీయుమా!
సొగసైన హారాలు అల్లి
నీకిస్తాము ,బహుమతిగ ! ||

నీలాల నింగిలో సింహాసనమ్మీవు;
లాల పోయించుకుని,నవ్వు పసి పాపవీవు!
గల గలల వర్షాలు వసుధకు ఒసుగుమా!
మా బాలల బులిపాలు నీకు కానుకలమ్మ! ||

***************************************

No comments:

Post a Comment