గులాబీలు, విరుల దళ మంజరీ ఛాయలలో
పరిమళ సంఘమ్ములు సుంత విశ్రాంతి గైకొనుచున్నవి;
సువిశాల నీలాంబర మాత
“విలాస యానమ్ములు సేయుడనుచు”
వాయు నావలను సతతమ్ము అందు బాటులో ఉంచి,
సౌరభ సుతులకు ఆనతి నిచ్చెను - సురుచిర దర హాసినియై;
పచ్చి కలి కాలమ్మిది! పెట్రోలు, మురుగు,
దుర్వాసనల కాలుష్య బీభత్సమ్ముల
సాగు చున్నది నేడు -మానవాళి మనుగడ!
సౌరభ సముచ్చయమ్ములార!
సరగున విచ్చేయండీ ఇలా తలమ్ములకు!
ఎల్ల జాగాలందు విస్తరించండి!
హరిత వన సౌందర్యాభిలాషా రాగమ్ములను
మానవ హృదయాలలోన పల్లవింప జేయండి
ఆహ్లాద తెరలు గగన పర్యంతమ్ము పరి వ్యాప్తి చెంద
భూగోళమ్మును పచ్చ దనముల పూల సజ్జగా ఒనరించ
నేడు - ఈ జనావళి ప్రతిన బూనును లెండు!
పరిమళమ్ములార! భావ మోదమ్ములార!
మీకివే మాదు సుస్వాగతములు!
మీ రాక వలననె - ప్రజల మానసములు
ఉల్లాస పుష్పములుగా విరియ బూయును
కాన ,
మాదు విన్నపముల మన్నించి, రా రండు!!!!!
Baala
By kadambari piduri,
Jun 23 2010 10:55PM
No comments:
Post a Comment