Thursday, July 15, 2010

సుదూర సీమల పరిచయ కర్తలు


















నురుగులు, నురుగులు
నురుగుల బుడగలు
కొలనుల కలువల
దగ్గరి బంధు(వు)లు ||

నురుగుల తేలెడి
వెన్నెల ఆటలు
ఎల్లరి -
ఉల్లాసములకు హేతువులు
మదిని నిండుగా నింపు మోదమ్ములు ||

సెల యేరుల అలలు
మలయానిలముల
వలయపు బొమ్మలు ||

నదిలో తరగలు
తరంగమ్ముల వంపులలోన
నెల వంకల తారంగ క్రీడలు ||
కడలిని కెరటాల్
శంఖ నినాదాల్
ఘుం ఘుం ఘోషల హోరులు, ఓహో! ||
నీటిలొ పడవలు, నెల - వంకల మిత్రులు
లాంచీ, ఓడల పయనాలు,భూమిని కొలిచే దూరాలు

సుదూర సీమల పరిచయ కర్తలు
అవధులు లేని విజ్ఞానాలకు ;
యానాం జర్నీ నామ ఫలకమ్ములు(name boards)||

(rachana -> kadambari )

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

nurugulu, nurugulu
nurugula buDagalu
kolanula kaluvala
daggari baMdhu(vu)lu ||

nurugula tEleDi
vennela aaTalu
ellari -
ullaasamulaku hEtuvulu
madini niMDugaa niMpu mOdammulu ||

sela yErula alalu
malayaanilamula
valayapu bommalu ||

nadilO taragalu
taraMgammula vaMpulalOna
nela vaMkala taaraMga krIDalu ||
kaDalini keraTaal
SaMKa ninaadaal
ghuM ghuM GOshala hOrulu, OhO! ||
nITilo paDavalu, nela - vaMkala mitrulu
laaMchI, ODala payanaalu,bhUmini kolichE dUraalu

sudUra sImala parichaya kartalu
avadhulu lEni vij~naanaalaku ;
yaanaaM jarnI naama phalakammulu(name boards) ||

No comments:

Post a Comment