
అమ్మ నిదుర లేపుతూంటె
బద్ధకముగ ఆవులిస్తూ,
మరల ‘బబ్బుని ‘ “ఊ”లు కొట్టేరు
చిన్నారి పిల్లలు
కాస్సేపు కునుకును తీయ తలిచేరు ||
తండ్రి గదమాయించగానే
నిదుర మత్తు ఎగిరి పోగా
బెడ్ నుండీ దూకి, బ్రష్షును
నోటిలోన పెట్టుకుంటూ
విద్యార్ధి బాలలు
నురుగు పొంగుల పళ్ళు తోమేరు ||
టిఫిను బుగ్గన కూరుకుంటూ
బుక్సు,నోట్సులు బ్యాగులోన
ఆదర బాదరా సర్దుకుంటూ
హడావుడిగా చిందులేస్తూ
స్టూడెంటు పిల్లలు
ఉరుకు పరుగుల స్టార్టు అయ్యేరు ||
మురిపాల చదువుల
ముద్దు బాల సందడులు సింగారం
నేటి బాలలు భావి పౌరులు
భరత మాత కొంగు బంగారం ||
Jul 7 2010 6:12PM
koMgu baMgaaramulu
________________
amma nidura lEputUMTe
baddhakamuga aavulistuu,
marala ‘babbuni ‘ “U”lu koTTEru
chinnaari pillalu
kaassEpu kunukunu tIya talachEru .
“”
taMDri gadamaayiMchagaanE
nidura mattu egiri pOgaa
beD nuMDI duuki, brashshunu
nOTilOna peTTukuMTU
vidyaardhi baalalu
nurugu poMgula paLLu tOmEru ||
Tiphinu buggana kUrukuMTU
buksu,nOTsulu byaagulOna
aadara baadaraa sardukuMTU
haDAvuDigaa chiMdulEstU
vidyaardhi pillalu
uruku parugula sTArTu ayyEru
muripaala chaduvula
muddu baala saMdaDulu baMgaaraM .||
No comments:
Post a Comment