Wednesday, July 28, 2010

ఉషోదయం జనని

















చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!
వేకువ మాతా!హల్ చల్ చల్!
గూళ్ళను విడిచి
విహంగమ్ముల హంగామా!
పిట్టల కువ కువ సందడులు
ప్రకృతి రాణికీ కాలి మువ్వలు:

రైతుల భుజముల
హలములె నగలు,
అవ్వాయ్ తువ్వాయ్ లేగ దూడల
గున గున పరుగులు;

పిల్లలు కట్టే గుజ్జన గూళ్ళు;
సంతోషమ్మే సగము బలమురా!
నిద్దుర మత్తును తుంగల త్రొక్కీ
పని పాటలకూ శ్రీ కారం!

చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!
వేకువ మాతా!హల్ చల్ చల్!

ushOdayaM janani
______________

chiikaTi bUchii! Cal Cal Cal!
vEkuva maataa!hal chal chal!
gULLanu viDichi
vihaMgammula haMgaamaa!
piTTala kuva kuva saMdaDulu
prakRti raaNikii kaali muvvalu:

raitula bhujamula
halamule nagalu,
avvaay tuvvaay lEga dUDala
guna guna parugulu;

pillalu kaTTE gujjana gULLu;
saMtOshammE sagamu balamuraa!
niddura mattunu tuMgala trokkii
pani paaTalakuu SrI kaaraM!
chiikaTi bUchii! Cal Cal Cal!
vEkuva maataa!hal chal chal!

No comments:

Post a Comment