బొండు మల్లెల తోటలందున
నిండు పౌర్ణిమ లలమెనే!
చెలి!- నిండు పౌర్ణిమ లలమెనే!
పున్నమి వెన్నెలల అలలు ప్రేమతో నిమరగా
ఆడెనమ్మా బర్హి! ఆడేను నెమలి! ||
వెన్నున ఉన్నాయి వందల ఈకలు;
దన్నుగా తన కిన్ని పింఛములు ఉన్నవని
ఇన్ని నాళ్ళుగ ఎటుల మరిచేనొ,ఏమో?
మిన్ను "ఇల" వైపునకు వంగి పోయేలాగ
ఆడెనమ్మా మన బంగారు నెమలి!?!
ఆడెనమ్మా బర్హి! ఆడేను నెమలి! ||
ఆ దరిని ఉన్నాది బృందావని!
మోద సమ్మోదముల వేణు గానమ్ములవే!
ఆద మరుపు విడిచి , అట్టె నిలిచిందీ,
వినోద నాట్యములె తన జీవనమ్మనెను!
ఆడెనమ్మా మన బంగారు నెమలి!?!
ఆడెనమ్మా బర్హి! ఆడేను నెమలి! ||
*********************************
aada marachi unnaadi !
_________________
boMDu mallela tOTalaMduna
niMDu paurNima lalamenE!
cheli! niMDu paurNima lalamenE
punnami vennela alalu
prEmatO nimaragaa
aaDenammaa barhi! ADEnu nemali! ||
vennuna unnaayi vaMdala Ikalu;
dannugaa tana kinni piMCamulu unnavani
inni nALLuga eTula marichEno,EmO?
minnu "ila" vaipunaku vaMgi pOyElaaga
aaDenammaa mana baMgaaru nemali
aaDenammaa barhi! ADEnu nemali! ||
aa darini unnaadi bRMdaavani!
mOda sammOdamula vENu gaanammulavE!
Ada marupu viDichi , aTTe nilichiMdii,
vinOda naaTyamule tana jIvanammanenu!
aaDenammaa mana baMgaaru nemali!?!
aaDenammaa barhi! ADEnu nemali! ||
No comments:
Post a Comment