Thursday, July 15, 2010

చతురతల దొర
వల్ల మాలిన కోపమేలయ్యా!
చల్లనయ్యా! తాల్మి దాల్చుమయా!
నీ బుల్లి పెదవుల నవ్వు చిందించు! ||

చల్ల కుండల పగుల కొట్టి
గొల్ల భామల నల్లరెడతావు;
ఒల్ల కుండగ లేవిదేమయ్యా!
పొల్లు పోనీ చిలిపి తనములు
నీదు సొమ్ములిదేమి వింతయ్యా! ||

హరి చందనములను చల్ల మన్నావా
“మన్నారు దేవా”!
విరుల దండల పరిమళాల
సిరి - వాలు చూపుల తేరు నెక్కేవా!
దొరవు చతురతల కెల్లెడల నీవే! ||

@@@@@@@@@@@@@@@

#Kovela


By kadambari piduri,
Jul 15 2010 10:43PM

No comments:

Post a Comment