Sunday, August 1, 2010

వేణువుతో వీణా ప్రజ్ఞ

















రాగ భావములె సంగీత లహరులై
ఇహ పర జగతుల శాంత తన్మయ నిశ్రేణులుగా
వన మారుతముల ఇంపుగ పొదిగెను ||


భువన మోహిని రాధా దేవి
వాలు చూపుల వీణా తంత్రుల
సవరించేవారెవ్వరే?

"మువ్వల మురిపెపు
ముద్దుల క్రిష్ణుడు,ఓయమ్మా!"
వైణికుడెపుడిటులాయేనో?! ||

వల్మీకములో ఆది శేషుడై
కన్నని ఉరమున దవన మాలలో
చిక్కిన వాల్జడ తోచు చున్నది;

దవ్వుల జనులు
పరుగున పరుగున వచ్చేరా?
"మన భ్రమ ఇది"అని నవ్వేరా!!!! ||

చంద్ర పూర్ణిమా నందన వనములలో
తకిట తకిట తై, తథ్థై ఆటలు
చక చక సాగగ, అవి నాట్యమ్ములు;
సకల వసుంధర ఓం కారమ్మై ||

****************************


vENuvutO vINA praj~na
_____________________
raaga bhaavamule saMgIta laharulai
iha para jagatula SAMta tanmaya niSrENulugaa
vana maarutamula iMpuga podigenu ||

Buvana mOhini raadhaa dEvi
vaalu chUpula vINA taMtrula
savariMchEvaarevvarE?

"muvvala muripepu
muddula krishNuDu,Oyammaa!"
vaiNikuDepuDiTulaayEnO?! ||

valmIkamulO aadi SEshuDai
kannani uramuna davana maalalO
chikkina vaaljaDa tOchu chunnadi;

davvula janulu
paruguna paruguna vachchErA?
"mana Brama idi"ani navvErA!!!! ||

chaMdra pUrNimaa naMdana vanamulalO
takiTa takiTa tai, taththai aaTalu
chaka chaka saagaga, avi naaTyammulu;
sakala vasuMdhara OM kaarammai ||

No comments:

Post a Comment