Thursday, July 29, 2010

వెన్నెలల భమిడి పాత్రలు
















నీ పిలుపు ధ్యానముగ - నీ నామమే తపసుగా
జిలుగు చూపులు ఆయె - రాధ, కన్నీటి చూపులు ||

స్నిగ్ధ తరళాక్షి రాధికా బాల
తన, అనురాగ దళములతొ -
పూల బాటలను పరిచేటి వేళ
వేణు రవళీ లోల! వేరు వివరములేల?
జాగు సేయుదువేల? - ఇది పాడి కాదురా! ||

శరదిందు వెన్నెలలు - భమిడి కొప్పెరలు
విరి చందమామ స్నానాలు సేయ
ఆ నింగి "అదనముగ సిరి కళలు ఇమ్మనుచూ”
నిను కోరుచున్నాది మరల మరల!
రోదసికి గగనము కన్న తల్లి కాన! ||
నగ ధారి కన్నులు కలువల జంట ;
నీ నగవు వైభవము - కేరింత సౌరభము
స్వామి కను దోయి ఇంపు సొంపుల పెంపు
విభుని ముచ్చటలన్ని – ఇతిహాస పెన్నిధులు ||
______________________
nii pilupu dhyaanamuga - nI naamamE tapasugaa
jilugu chUpulu aaye - raadha, kanniiTi chuupulu ||

snigdha taraLAkshi rAdhikaa baala
tana, anuraaga daLamulato -
pUla baaTalanu parichETi vELa
vENu ravaLI lOla! vEru vivaramulEla?
jaagu sEyuduvEla? - idi paaDi kaaduraa! ||

SaradiMdu vennelalu - BamiDi kopperalu
viri chaMdamaama snaanaalu sEya
aa niMgi "adanamuga siri kaLalu immanuchuu”
ninu kOruchunnaadi marala marala!
rOdasiki gaganamu kanna talli kaana! ||
naga dhaari kannulu kaluvala jaMTa ;
nI nagavu vaiBavamu - kEriMta sauraBamu
svaami kanu dOyi iMpu soMpula peMpu
viBuni muchchaTalanni – itihaasa pennidhulu ||

No comments:

Post a Comment