
విశాల నేత్రీ! జగన్మాతా! కనక దుర్గా! 
దిశాంతరాళముల దాక ,నీదు మేల్మి 
కుశాల వన్నియలు పదునారు వేలూ
వసుంధర పై కురియు, శీతల 
తుషార అత్తరు అక్షితలుగా   ||
అ – ఇంద్ర జాలము లేమిటో!?
నీ కరుణా కృపాప్త శ్రీ వీక్షణమ్ముల ఛాయలే!
వాసంత పరిమళ మలయ వీచీ!
మా ఇంటి వేలుపు నీవె జననీ!  ||
ధారుణిని నీ అనుగ్రహములు,
కారుణ్య వర్షిత చంద్రికలు       ||
ఆ – దివికి పరచిన ఛత్రమీవే!
మేదినికి నీవే అంబరమ్ము!
శ్యామలంబా! ఆది శక్తీ!         ||
$$$$$$$$$$$$$$$$$$$$$$$
viSaala nEtrI! jaganmaataa! kanaka durgaa!
diSAMtaraaLamula daaka ,nIdu mElmi 
kuSAla vanniyalu padunaaru vEluu
vasuMdhara pai kuriyu, SItala 
tushaara attaru akshitalugaa   ||
a – iMdra jaalamu lEmiTO!?
nI karuNA kRpaapta SrI vIkshaNammula CAyalE!
vaasaMta parimaLa malaya vIchii!
maa iMTi vElupu nIve ammaa!        ||
dhaaruNini nI anugrahamulu,
kaaruNya varshita chaMdrikalu       ||
aa – diviki parachina CatramIvE!
mE - diniki nIvE aMbarammu!
SyaamalaMbaa! aadi SaktI!               ||
 
No comments:
Post a Comment