Friday, November 19, 2010

దేవుని పెళ్ళి సందడి

రేగింది సందడి! _ ఊరేగింపుల సందడి;;
చెలరేగిందీ సందడి _ హోరెత్తే హడావుడీ -
ముందుకు,
మును ముందుకు -
సాగండి సాగండి
భక్త జనులు అందరూ ||

ఊరకూరకే తొట్రు పడకే - ఓ గండ భేరుండమా!
ఉట్రుడియపు కినుక లేల? - ఓ ఆంజనేయ స్వామీ!
స్వామి వారి సేవలోన తరియించేటందుకు -
మీ అందరికీ భాగములు ఉన్నాయి లెండి! ||

కింకిణుల సవ్వడితో క్షీరాబ్ధి పుత్రిక ;;
కంకణాల రవళులతో - శ్రీ అలమేలు మంగమ్మ
బీబీ నాంచారమ్మ - హెచ్చరికలు చేసేరు
అమ్మలార! వైలమే దయ సేయండీ!

అయ్య వారి పరి చర్యల వింత పోటీలూ,
వింత సంజ్ఞలేలనమ్మ?
అందులకేనమ్మా!
స్వామి వారి - ఎదురు చూపు సన్నాహాల్
దేవుని పెళ్ళికి ఎల్లరునూ పెద్దలే!
నిత్య కళ్యాణములు, పచ్చ తోరణమ్ములు ||

No comments:

Post a Comment