Tuesday, November 16, 2010

ఆటలలో నిష్ణాతుడు గోవిందుడు

రామ చక్కని వాడు – మా క్రిష్ణుడు!
మారాములు సేయడమ్మ – బుద్ధిమంతుడు!
బహు బుద్ధిమంతుడు
అమ్మరో! యశోదమ్మ!
నివ్వెర పాటేలనే!??? 2 ||

"గోటి మీద నవనీతపు ముద్దలను నిలిపీ
పెరుగు బువ్వ తినకుండా ఆటలే ఆటలు
ఈ గోటి పైన నేనిట్టే గిరిని నిలుపుతాను! – అంటాడు
ఏమి, గోల,అల్లరి, చిలిపి తనాలు
ఏమి సేతును? నేనేమి సేతును?" ||

"గోళి కాయ ఆటలలో – నిష్ణాతుడు గోవిందుడు
కొన గోట వెన్న ముద్దలో?
అవి,విశ్వ గ్రహ గోళమ్ములో!?
నాకేమో,విభ్రమమో, సంభ్రమమో?
తెలియ జాలకున్నాను!" ||

"ఈ జాలములేమిటో?
మాయా జాలమ్ములు ఏమిటో ?
బోధ పడుట లేదమ్మా!!
ఏమి సేతును? నేనేమి సేతును ?" ||

No comments:

Post a Comment