Tuesday, November 16, 2010

పుణ్య వ్రత రహస్యము
శిఖి పింఛ ధారి! గోవిందుడు! – ఆనంద బాలుడు
మందార దామ ప్రియ – మురళీ వినోది ||

ఆటలకు రాజు ఆట ‘ దోబూచీ! దోబూచీ!'
ఆలమంద సందులలో – ఆ గున్న మావి తోపులలో
ఆడేరు బాలునితొ యావన్మందీ!
అమందానందమాయె – యశోదమ్మ హృది చిన్మయి
పంచవమ్మ అందు నుండి – పురిలోని దేవకికి
ఒక్కింత, రవ్వంతా – ఓ జననీ! యశోదమ్మ! ||

రస రమ్య క్రీడలన్ని – స్వంతమాయె వ్రేపల్లెకు!
నీ పూర్వ జన్మ పుణ్య మేదొ – ఓ పల్లియ! తెలుపవమ్మ!
ముల్లోకమ్ములకు – ఆ పుణ్య వ్రత రహస్యము ||

No comments:

Post a Comment