Monday, November 29, 2010

రాజ హంసలకు ఆణి ముత్యాలు














వెన్నియల పుటల
పైడి - చేవ్రాళ్ళు వెలసె-నవి –
కన్నయ్య కొంటె నవ్వులు!
ఓ యశోదమ్మ!
కన్నయ్య చిలిపి నవ్వులు ||

అంబరాల విహరించే
విపణి వీధి సంచరించు
రాజ హంస లించుక
తమ రెక్కలను వంచినవి!
అవి -
వసుంధరా తలములకు
విచ్చేసినవీ ||

బాల క్రిష్ణ మూరితి
లీలల దరహాసములు
ధరణి విస్తరించెనమ్మ!!!
ఆ ఆణి ముత్యాలను
ఏరుకుని వెడలినవి ||

గీతా సారము














విరళ పౌర్ణమీ జాలము
క్రిష్ణ ప్రేమ నిర్వచనము||
కరుగు చంద్ర వేదిక,రాధిక -
తరళ సుధా -
శిల్పమాయెనోయమ్మా! ||
సురభిళ దరహాసినీ!
రాధికా! రాధికా!
మరకత మణి మెరుపు మేను
కద్దుకున్న మేఘమా! ||

అనురాగ రత్న మంజూషా!
కనకాంగి! వలపు సారంశమా!
క్రిష్ణ ప్రేమ పల్లవిగా
వెలసిన “గీతా* సారమా!” |
|

[ *గీతా సారము = substance of song ]

Friday, November 26, 2010

వసుధాపతి! వందనం!




















గోవర్ధన గిరి ధారీ!
శ్రీ వాసు దేవ!క్రిష్ణా!
వసుధాపతి! వందనం! ||

నిఖిల లోక వీక్షణం
భక్త నయన ఆభరణం
పింఛధారి దర్శనం
సదా సమ్మోహనం ||

ధేను ధరణి పాలకుడు
భాను కోటి దీప్తుని కన
మానసములు ఆయెను
నవీన బృందావనం ||
;;;;;; వసుధాపతి! వందనం!

Thursday, November 25, 2010

పుడమి తరువు ( హైకూలు)















మేఘాల రెక్కలతో
వర్ష సీతకోక చిలకలు
భూమి పుష్పం పైన వాలాయి;

వసుధ మహా వృక్షానికి–
పచ్చని పైరుల తేనె పట్లు

**************************

ఉదయ కిరణాల జడలకు
నీలాకాశం తయారు చేసి ఇచ్చింది;
మేఘాల జడ కుచ్చులు ;
అందుకే – వాటిని
అందుకున్న ఇన బింబం
సంతోషం ఇను మిక్కిలి అయి
మిట్ట మధ్యాహ్నానికి
ఆలాగున
చండ ప్రచండ సాక్షాత్కారం !

Nov 21 2010 7:28PM

Wednesday, November 24, 2010

వేణు రాగములకు సవరణలు














ముదిత మది కళ్యాణ వీణియ
బేల రాధ మ్రోయించు సతతము
మోదార్తి మోహన రాగములను, క్రిష్ణా! ||

తరుణి కన్నుల ఉప్పతిల్లే
ఆనంద బాష్పమ్ములు ,కన్నయ!
అమల సంగీతమ్మునందున
విమల శృతి లయ తాళ గతులు ||

రాధ వీణా మధుర రవళులు
రాగములకు అధికరణములు
అనుకరించు అవకాశమ్ములు దక్కినవిరా,
నీదు మురళిని సవరించుకోరా ! క్రిష్ణా! ||

Friday, November 19, 2010

జగన్మాతా! కనక దుర్గా!















విశాల నేత్రీ! జగన్మాతా! కనక దుర్గా!
దిశాంతరాళముల దాక ,నీదు మేల్మి
కుశాల వన్నియలు పదునారు వేలూ
వసుంధర పై కురియు, శీతల
తుషార అత్తరు అక్షితలుగా ||

అ – ఇంద్ర జాలము లేమిటో!?
నీ కరుణా కృపాప్త శ్రీ వీక్షణమ్ముల ఛాయలే!

వాసంత పరిమళ మలయ వీచీ!
మా ఇంటి వేలుపు నీవె జననీ! ||

ధారుణిని నీ అనుగ్రహములు,
కారుణ్య వర్షిత చంద్రికలు ||

ఆ – దివికి పరచిన ఛత్రమీవే!
మేదినికి నీవే అంబరమ్ము!
శ్యామలంబా! ఆది శక్తీ! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$

viSaala nEtrI! jaganmaataa! kanaka durgaa!
diSAMtaraaLamula daaka ,nIdu mElmi
kuSAla vanniyalu padunaaru vEluu
vasuMdhara pai kuriyu, SItala
tushaara attaru akshitalugaa ||

a – iMdra jaalamu lEmiTO!?
nI karuNA kRpaapta SrI vIkshaNammula CAyalE!

vaasaMta parimaLa malaya vIchii!
maa iMTi vElupu nIve ammaa! ||

dhaaruNini nI anugrahamulu,
kaaruNya varshita chaMdrikalu ||

aa – diviki parachina CatramIvE!
mE - diniki nIvE aMbarammu!
SyaamalaMbaa! aadi SaktI! ||

దేవుని పెళ్ళి సందడి













రేగింది సందడి! _ ఊరేగింపుల సందడి;;
చెలరేగిందీ సందడి _ హోరెత్తే హడావుడీ -
ముందుకు,
మును ముందుకు -
సాగండి సాగండి
భక్త జనులు అందరూ ||

ఊరకూరకే తొట్రు పడకే - ఓ గండ భేరుండమా!
ఉట్రుడియపు కినుక లేల? - ఓ ఆంజనేయ స్వామీ!
స్వామి వారి సేవలోన తరియించేటందుకు -
మీ అందరికీ భాగములు ఉన్నాయి లెండి! ||

కింకిణుల సవ్వడితో క్షీరాబ్ధి పుత్రిక ;;
కంకణాల రవళులతో - శ్రీ అలమేలు మంగమ్మ
బీబీ నాంచారమ్మ - హెచ్చరికలు చేసేరు
అమ్మలార! వైలమే దయ సేయండీ!

అయ్య వారి పరి చర్యల వింత పోటీలూ,
వింత సంజ్ఞలేలనమ్మ?
అందులకేనమ్మా!
స్వామి వారి - ఎదురు చూపు సన్నాహాల్
దేవుని పెళ్ళికి ఎల్లరునూ పెద్దలే!
నిత్య కళ్యాణములు, పచ్చ తోరణమ్ములు ||

Wednesday, November 17, 2010

creativity కి కాదేదీ అనర్హం!



















వైర్లూ, దారాలూ,
ఐస్ క్రీం పుల్లలూ,
చెట్టు కాండములూ,
పెన్సిల్ ములుకులూ -
ఇలా అనేక వస్తువులతో
బొమ్మలను తయారు చేసే వీలు ఉన్నది.
కాస్తంత ఊహా శక్తిని జోడిస్తే చాలు!
ఇవిగో!
ఈ ఫొటోలో (photo) లో
ఎన్నెన్నో బొమ్మలు ఉన్నాయి.
చూస్తున్నారు కదా!
creativity కి కాదేదీ అనర్హం! ఔనా!!!!!!?
మరి ఇంకెందుకు ఆలస్యం?
Ready! Start!

Tuesday, November 16, 2010

వెన్నెల చిరునామా















మురళి గాన వినోదీ!క్రిష్ణా!
నీ మురిపెములు - భక్తి సుధల
రసవత్తర మైమరుపులు ||

చందన,గంధాక్షతలు - తాంబూల చర్వణములు
సొగసు ఆచారములకు - పర్ణ కుటీరములు
నీ తరళ చలన చాలనములు -
మురళి గాన వినోదీ!క్రిష్ణా! ||

అనురాగం పోక ,వక్క
వలపు తమల పాకులు
చనువేమో ఘాటు సున్న
మీ మది తమల పాకు చిలక
లన్ని విడియములు నీవేరా! క్రిష్ణా! ||

శరదృతువు వచ్చినది
సుందర జ్యోత్స్నల నెలవు; ;
శుక్ల పక్ష్ పౌర్ణిమల తెలి వెన్నెల చిరునామా
నీ దరహాసమ్మ్ములు, క్రిష్ణ! ||

(శరదృతువు పున్నమలు )

పుణ్య వ్రత రహస్యము
















శిఖి పింఛ ధారి! గోవిందుడు! – ఆనంద బాలుడు
మందార దామ ప్రియ – మురళీ వినోది ||

ఆటలకు రాజు ఆట ‘ దోబూచీ! దోబూచీ!'
ఆలమంద సందులలో – ఆ గున్న మావి తోపులలో
ఆడేరు బాలునితొ యావన్మందీ!
అమందానందమాయె – యశోదమ్మ హృది చిన్మయి
పంచవమ్మ అందు నుండి – పురిలోని దేవకికి
ఒక్కింత, రవ్వంతా – ఓ జననీ! యశోదమ్మ! ||

రస రమ్య క్రీడలన్ని – స్వంతమాయె వ్రేపల్లెకు!
నీ పూర్వ జన్మ పుణ్య మేదొ – ఓ పల్లియ! తెలుపవమ్మ!
ముల్లోకమ్ములకు – ఆ పుణ్య వ్రత రహస్యము ||

ఆటలలో నిష్ణాతుడు గోవిందుడు

















రామ చక్కని వాడు – మా క్రిష్ణుడు!
మారాములు సేయడమ్మ – బుద్ధిమంతుడు!
బహు బుద్ధిమంతుడు
అమ్మరో! యశోదమ్మ!
నివ్వెర పాటేలనే!??? 2 ||

"గోటి మీద నవనీతపు ముద్దలను నిలిపీ
పెరుగు బువ్వ తినకుండా ఆటలే ఆటలు
ఈ గోటి పైన నేనిట్టే గిరిని నిలుపుతాను! – అంటాడు
ఏమి, గోల,అల్లరి, చిలిపి తనాలు
ఏమి సేతును? నేనేమి సేతును?" ||

"గోళి కాయ ఆటలలో – నిష్ణాతుడు గోవిందుడు
కొన గోట వెన్న ముద్దలో?
అవి,విశ్వ గ్రహ గోళమ్ములో!?
నాకేమో,విభ్రమమో, సంభ్రమమో?
తెలియ జాలకున్నాను!" ||

"ఈ జాలములేమిటో?
మాయా జాలమ్ములు ఏమిటో ?
బోధ పడుట లేదమ్మా!!
ఏమి సేతును? నేనేమి సేతును ?" ||

పుప్పొడుల బాటలు



















మందార దండలను
బహు ప్రీతి ధరియించి
గంతులూ వేయుచూ
వచ్చు వాడెవ్వరే?

పుప్పొడులు దిట్టంగ
హత్తుకుని నవ్వేటి
బాటలకు తెలుసును
‘బాల కిట్టమ్మయే !’ అనీ ||

సిగలోని పింఛములు – సొగసుగా ఊగేను
నింగిలో చందురుడూ – నెమలి కన్నులలోకి
మురిపెముతొ వెన్నియల – గుమ్మరించేనమ్మ! ||

నంద నందన బాల - చరణ ద్వయి "పాళి" *
ఆనంద సుందర క్రీడ "విన్నూత్న బాణి"
నిరతము హసియించు ఉల్లాస జగతి
వ్రేపల్లె సీమకు నిర్వచనమొక్కటే!
ఆ నామమే "నిత్య పర్వంపు ఉగాది "

_______________________

(*=Nib)

Monday, November 15, 2010

అందని అందాలన్ని అందుకున్నాము!
















అంది వచ్చినవమ్మ కోటి అదృష్టాలు
అందుకున్నామమ్మ! ఆనంద బాలునీ
ఆనంద లీలలు అన్ని మావేలే! ||

అంద చందాలన్ని – ఆ చిలిపి నవ్వులవె!
బాల శ్రీ క్రిష్ణుడు - గాన లోలుండు
అందరిలొ వాడె - మన అందరి వాడు ||

అందే, అందే, అందేను – యామిని యందున
ఎగసే యమునా కెరటమ్ములకున్
అంబరమందలి శరత్ పున్నమలు ||

అందే,అందే, అందందే
చిటికెన వ్రేలిపై – నిలిచె గోవర్ధనము
ఆ గిరి గీర్వాణము – గిరి దాటినదీ! కనరమ్మా! ||

అందే, అందే అందినవి – అందని అందాలన్నన్ని –
ఇందునె వెలిసిన వోహోహో!
అద్దిర బన్నా! అని మురిసేనమ్మా
ఈ సీమ, అదె మన వ్రేపల్లె ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
అందుకుంటిమి, ఘనులము మేము!

ప్రాణి కోటి వైవిధ్యతల నీరధి


















జల జల జల పాతము;
ఏరు, నదీ నదములు –
అన్నీ
కడకు "కడలి"కే!
జలధి
అనంత జీవ రాసులకు
ఒడిగా విరాజిల్లుతూన్నది ఇంకా!.......

ఔను మరి!
మనిషి తాకిడి పూర్తిగా
ఇంకా
తగలని చోటు కదా అది!

ప్రాణి కోటి వైవిధ్యతలకు
నిలయంగా నీరధి
ఈలాగున అలరారుట
ఇంకెన్నాళ్ళో మరి!

******************
ప్రాణి కోటి వైవిధ్యతల నీరధి ;

Sunday, November 14, 2010

పెన్సిళ్ళ ములుకులతో బొమ్మలూ - వింత కళలు

































pencil గురించి తమాషా పాయింట్లు:

1. సైన్సు లోకంలో "కెమికల్ లెడ్" వేరు.
చాలామంది పెన్సిళ్ళలో వాడేది ఇదే - నని అనుకుంటూంటారు.

2. penci Lead అనగా - గ్రాఫైట్ ; కార్బన్ కు మరొక రూపాంతరం ఇది.

3. 50 thousand Wordsను ఒక పెన్సిల్ తో రాయ వచ్చును.

4.1862 లో 100,000 డాలర్లకు పెన్సిల్ పై హక్కును అమ్ముకున్నారు.
సుప్రీం కోర్టు తీర్పులు వగైరాలు - పేటెంట్ హక్కులపై -
అనేక సంచలన పరిణామాలు జరిగినాయి.

Thursday, November 11, 2010

కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా!





















కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా!
కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! ||

"కంటిలోన నలకలేవొ పడినవ"నుచు
బులిపిస్తూ,నటనలతో ||

(అను పల్లవి):
నీ కంటనున్న లోకమ్ములు
చీకటులలొ కుంగి పోవు ||

"నీ కన్ను లెర్ర బడిన "వనుచు
తల్లి యశోదా,దేవకి
తల్లడిల్లుచున్నారు
భామినుల మానసములు
తెగిన వీణ తంత్రులాయె! ||

నీ-నిదుర రెప్పలందు-జగతి
హాయిగ శయనించెనోయీ!
కలువ కనుల 'మెలకువ'లో
విశ్వములకు ప్రసాదములు ! ||

Link ( WD ) -

Tuesday, November 9, 2010

బుడి బుడి అడుగులు
















ఆ బాల గోపాలము - అమితానందము
అనితర సాధ్యము అవనిని అందము
అవనిలోన ఆ అందము ||
;;;
బృందా వనముల మృదు పల్లవముల
అడుగుల జాడలు చూడండీ!
ఆ – బుడి బుడి, జడి బడి
కంజ దళాక్షుడు క్రిష్ణునివి! ||
;;;
నడకలు అంటే నడకలు కావవి
నట రాజు మెచ్చిన నాట్యములే!
భరత మహర్షి నాట్య శాస్త్రముకు
ఒన (గూ)కూడిన లక్షణ లక్ష్యములే! ||

Monday, November 8, 2010

నాట్యములకు మారు పేరులు
















ఆ బాల గోపాలము - అమితానందము ||
చిడి ముడి చిందులు, తప్పటడులు
నర్తనమ్ములే ఆయెనులే!
ఆ బాల గోపాలము - అమితానందము
అనితర సాధ్యము అవనిని అందము
అవనినిలోన ఆ అందము ||

తక ధిమి తక ధిమి
క్రిష్ణమ్మ - అలసట నెరుగని చిందులాటలు –
నాట్యమ్ముల కవి మారు పేరులు
ఆ బాల గోపాలము
అమితానందము ||

శారద వీణా రాగ శృతులు
క్రిష్ణుని మురళీ గానములందున
విడిది సేయగా వచ్చినవి
ఆ బాల గోపాలము
అమితానందము ||
తక ధిమి తక ధిమి చిందులాడగా
చరణ కింకిణీ రవములందున
హాయిగ ఊగగ వచ్చెనవే!
ఆ బాల గోపాలము
అమితానందము ||