Saturday, July 31, 2010

నవ్య మధురా పురి

















అల్లదే!తిరుపతి!
అభినవమౌ మధురా పురి!
చతురు లాటలకు నెలవు
అబ్బురముల పుట్టిల్లు ||

పద్మావతి కవ్వించి – నాంచారు నవ్వించి
శ్రీ వేంకట నాథుని – మోము చిన్నెలను చూచి
పులకించి, దినమణి – ఇల కొసగెను పగలు పళ్ళెరము నిండ
శత కోటీ కిరణ రాశి ||

అలమేలు మంగ కెంపు పెదవి – వంపుల “శ్రీ” లను చుట్టి
చిలిపి హాసముల నెన్నొ – సప్తగిరి వాసుడు సృజియించెను;

అది కాంచిన పద్మాసన సతి లక్ష్మి – మనసున కెర్లింతలు
“నాదు “శ్రీ”ని సవతి పద్మావతి కడ
దాచు ఈ మగనికి – చెప్ప నలవి కానంత పొగరు, గీర్వాణమే! ||

అయ్యారే! అవ్వారి – తలపోతల ,ఈసులు, అసూయలు,మాత్సర్యాల
మధుర మధుర గాధలు – మూపురముల నిలుపుకునీ
త్రి భువనమ్ముల చాటగా - గోమాతలు సాగేను! –
అల్లదే! మధురా పురి – చతురు లాటలకు నెలవు ||

********************************
navya madhuraa puri!
-----------------------------

alladE!tirupati!
aBinavamau madhuraa puri!
chaturu laaTalaku nelavu
abburamula puTTillu ||
padmaavati kavviMchi – naaMchaaru navviMchi
SrI vEMkaTa nAthuni – mOmu chinnelanu chUchi
pulakiMchi, dinamaNi – ila kosagenu pagalu paLLeramu niMDa
Sata kOTI kiraNa raaSi ||

alamElu maMga keMpu pedavi – vaMpula “SrI” lanu chuTTi
chilipi haasamula nenno – saptagiri vaasuDu sRjiyiMchenu;

adi kaaMchina padmaasana sati lakshmi – manasuna kerliMtalu
“naadu “SrI”ni savati padmaavati kaDa
daachu I maganiki – cheppa nalavi kaanaMta pogaru, gIrvaaNamE! ||

ayyaarE! avvaari – talapOtala ,Isulu, asUyalu,maatsaryaala
madhura madhura gaadhalu – mUpuramula nilupukunii
tri bhuvanammula chaaTagaa - gOmaatalu saagEnu! –
alladE! madhuraa puri – chaturu laaTalaku nelavu ||

మెరుపుల బలపములు

















మబ్బుల పలకల పైన
మెరుపుల బలపాల తోటి
సుందర కావ్యాలను
రాస్తూన్నది అంబరం ||

భువనమున ఆమని
అడిగినదీ, ఏమనీ???
_
“వాన దేవుడా!
ఈ – నేల పైకి అడుగిడి
హర్షమ్ముల నొసగుమని "
వేడుకొంది ఆమని! ||

రెక్కలను విప్పార్చి
నింగిలోన ఎగురుతూన్న
పక్షులార! రారండీ!
ప్రకృతికీ కిరీటం
మీ ఛాయలు రత్నమణులు
మమతల ముచ్చట్లు ||

ప్రత్యగాత్మనైనాను ఈ వేళ


















శ్రీ నాధుని తలపు కాంతి సోకగనే
ప్రతి మానవ మానసము
మణిసదనము అగును కదా,
ఔను కదా! ||

హృదయములో భక్తి భావ సాంగత్యం
ఉదయించిన అనుభూతి సౌకుమార్యం
అణువణువున సౌహార్ద్రం పరిపూర్ణం
మణిసదనం, ఔను కదా
ప్రతి మానవ మానసము ||

తృణమైనా పణమైనా ఏక రీతిని
స్వీకరించుటే కదా నీదు ప్రకృతి
మమ్ము మేము మైమరచి - ఓ స్వామి!
“త్వమేవాహమై”నట్టి క్షణములలో
శాంత రస తరంగములకు ప్రభల జాగృతి ||

నిరీక్షణముల ఆవృత్తిగ శ్రీ రమణా!
నిరంతరము సేసెదవు మమ్ము శోధన;
పరీక్షలిటుల సేయ తగదు నీకింక!
అహము వీడి,నిలిచితిని నీ మ్రోల
మహిత - ప్రత్యగాత్మనైనాను ఈ వేళ ||
*********************************
___________________________
SrI naadhuni talapu kaaMti sOkaganE
prati maanava maanasamu
maNisadanamu agunu kadaa, aunu kadaa! ||

hRdayamulO Bakti BAva saaMgatyaM
udayiMchina anuBUti saukumaaryaM
aNuvaNuvuna sauhaardraM paripUrNaM
maNisadanaM, aunu kadaa
prati maanava maanasamu ||

tRNamainaa paNamainaa Eka rItini
svIkariMchuTE kadaa nIdu prakRti
mammu mEmu maimarachi - O svaami!
“tvamEvAhamai”naTTi kshaNamulalO
SAMta rasa taraMgamulaku praBala jaagRti ||

nirIkshaNamula aavRttiga SrI ramaNA!
niraMtaramu sEsedavu mammu SOdhana;
parIkshaliTula sEya tagadu nIkiMka!
ahamu vIDi,nilichitini nI mrOla
mahita - pratyagaatmanainaanu I vELa ||

Thursday, July 29, 2010

వెన్నెలల భమిడి పాత్రలు
















నీ పిలుపు ధ్యానముగ - నీ నామమే తపసుగా
జిలుగు చూపులు ఆయె - రాధ, కన్నీటి చూపులు ||

స్నిగ్ధ తరళాక్షి రాధికా బాల
తన, అనురాగ దళములతొ -
పూల బాటలను పరిచేటి వేళ
వేణు రవళీ లోల! వేరు వివరములేల?
జాగు సేయుదువేల? - ఇది పాడి కాదురా! ||

శరదిందు వెన్నెలలు - భమిడి కొప్పెరలు
విరి చందమామ స్నానాలు సేయ
ఆ నింగి "అదనముగ సిరి కళలు ఇమ్మనుచూ”
నిను కోరుచున్నాది మరల మరల!
రోదసికి గగనము కన్న తల్లి కాన! ||
నగ ధారి కన్నులు కలువల జంట ;
నీ నగవు వైభవము - కేరింత సౌరభము
స్వామి కను దోయి ఇంపు సొంపుల పెంపు
విభుని ముచ్చటలన్ని – ఇతిహాస పెన్నిధులు ||
______________________
nii pilupu dhyaanamuga - nI naamamE tapasugaa
jilugu chUpulu aaye - raadha, kanniiTi chuupulu ||

snigdha taraLAkshi rAdhikaa baala
tana, anuraaga daLamulato -
pUla baaTalanu parichETi vELa
vENu ravaLI lOla! vEru vivaramulEla?
jaagu sEyuduvEla? - idi paaDi kaaduraa! ||

SaradiMdu vennelalu - BamiDi kopperalu
viri chaMdamaama snaanaalu sEya
aa niMgi "adanamuga siri kaLalu immanuchuu”
ninu kOruchunnaadi marala marala!
rOdasiki gaganamu kanna talli kaana! ||
naga dhaari kannulu kaluvala jaMTa ;
nI nagavu vaiBavamu - kEriMta sauraBamu
svaami kanu dOyi iMpu soMpula peMpu
viBuni muchchaTalanni – itihaasa pennidhulu ||

Wednesday, July 28, 2010

ఉషోదయం జనని

















చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!
వేకువ మాతా!హల్ చల్ చల్!
గూళ్ళను విడిచి
విహంగమ్ముల హంగామా!
పిట్టల కువ కువ సందడులు
ప్రకృతి రాణికీ కాలి మువ్వలు:

రైతుల భుజముల
హలములె నగలు,
అవ్వాయ్ తువ్వాయ్ లేగ దూడల
గున గున పరుగులు;

పిల్లలు కట్టే గుజ్జన గూళ్ళు;
సంతోషమ్మే సగము బలమురా!
నిద్దుర మత్తును తుంగల త్రొక్కీ
పని పాటలకూ శ్రీ కారం!

చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!
వేకువ మాతా!హల్ చల్ చల్!

ushOdayaM janani
______________

chiikaTi bUchii! Cal Cal Cal!
vEkuva maataa!hal chal chal!
gULLanu viDichi
vihaMgammula haMgaamaa!
piTTala kuva kuva saMdaDulu
prakRti raaNikii kaali muvvalu:

raitula bhujamula
halamule nagalu,
avvaay tuvvaay lEga dUDala
guna guna parugulu;

pillalu kaTTE gujjana gULLu;
saMtOshammE sagamu balamuraa!
niddura mattunu tuMgala trokkii
pani paaTalakuu SrI kaaraM!
chiikaTi bUchii! Cal Cal Cal!
vEkuva maataa!hal chal chal!

Sunday, July 25, 2010

పరిణయపు వైభవాలు


















శ్రీ వేంకటేశ్వర, పద్మావతీ దేవి
కళ్యాణ వైభవపు ఇంపైన వేడుక;
తొంగి తొంగి చూచు ప్రతి తారక;
వంగి తా గొడుగౌను నీలాల నింగి; ||

పెళ్ళి పెత్తనమంత శ్రీ లక్ష్మిదే,
ఊరకుండే దెటుల ఈ పట్టుల!!?
ప్రజల కేరింతల పెళ్ళి సన్నాయి
భజన సంకీర్తనల మేజు వాణి ||

భక్తి పరవశములు నిండిన చూపుల్ల
ఆణి ముత్తెముల అక్షింతలు;
భక్తుల చిందుల రంగ వల్లికలు
దేవుని పెళ్ళికి ఎల్లరు పెద్దలు ||

***************************
___________________
SrI vEMkaTESvara, padmaavatI dEvi
kaLyaaNa vaiBavapu iMpaina vEDuka;
toMgi toMgi chuuchu prati taaraka;
vaMgi taa goDugaunu nIlaala niMgi; ||

peLLi pettanamaMta SrI lakshmidE,
UrakuMDE deTula I paTTula!!?
prajala kEriMtala peLLi sannaayi
bhajana saMkIrtanala mEju vaaNi ||

bhakti paravaSamulu niMDina chUpulla
aaNi muttemula akshiMtalu;
bhaktula chiMdula raMga vallikalu
dEvuni peLLiki ellaru peddalu ||

Friday, July 23, 2010

ఆద మరచి ఉన్నాది !
















బొండు మల్లెల తోటలందున
నిండు పౌర్ణిమ లలమెనే!
చెలి!- నిండు పౌర్ణిమ లలమెనే!
పున్నమి వెన్నెలల అలలు ప్రేమతో నిమరగా
ఆడెనమ్మా బర్హి! ఆడేను నెమలి! ||
వెన్నున ఉన్నాయి వందల ఈకలు;
దన్నుగా తన కిన్ని పింఛములు ఉన్నవని
ఇన్ని నాళ్ళుగ ఎటుల మరిచేనొ,ఏమో?
మిన్ను "ఇల" వైపునకు వంగి పోయేలాగ
ఆడెనమ్మా మన బంగారు నెమలి!?!
ఆడెనమ్మా బర్హి! ఆడేను నెమలి! ||

ఆ దరిని ఉన్నాది బృందావని!
మోద సమ్మోదముల వేణు గానమ్ములవే!
ఆద మరుపు విడిచి , అట్టె నిలిచిందీ,
వినోద నాట్యములె తన జీవనమ్మనెను!
ఆడెనమ్మా మన బంగారు నెమలి!?!
ఆడెనమ్మా బర్హి! ఆడేను నెమలి! ||

*********************************
aada marachi unnaadi !
_________________

boMDu mallela tOTalaMduna
niMDu paurNima lalamenE!
cheli! niMDu paurNima lalamenE
punnami vennela alalu
prEmatO nimaragaa
aaDenammaa barhi! ADEnu nemali! ||

vennuna unnaayi vaMdala Ikalu;
dannugaa tana kinni piMCamulu unnavani
inni nALLuga eTula marichEno,EmO?
minnu "ila" vaipunaku vaMgi pOyElaaga
aaDenammaa mana baMgaaru nemali
aaDenammaa barhi! ADEnu nemali! ||

aa darini unnaadi bRMdaavani!
mOda sammOdamula vENu gaanammulavE!
Ada marupu viDichi , aTTe nilichiMdii,
vinOda naaTyamule tana jIvanammanenu!
aaDenammaa mana baMgaaru nemali!?!
aaDenammaa barhi! ADEnu nemali! ||

Thursday, July 22, 2010

దేశ వాళీ cartoonists














=========== కార్టూన్ లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
కొంచెం వ్యంగ్యం, కొంచెం హాస్యం మిళాయించిన cartoons ను వేసిన కుంచెలు
ఏ చేతులలో అలంకారాలు ఐనాయో ,
ఈ కారికేచర్సునూ, కార్టూన్సునూ చూసి చెప్పండి!

మీ మనసులలో..........
ఆ యా caricatures రూప శిల్పుల పేర్లు స్ఫురిస్తున్నాయా?,
ఎంతమంది names మీ మదిలో తటిల్లతల్లాగా మెరిసాయో
అంచనా వేసి పరిశీలించుకుంటే,
మన దేశ వాళీ cartoonists పట్ల
మీరు ఎంత అవగాహన కలిగి ఉన్నారో బోధ పడుతుంది.

Wednesday, July 21, 2010

నెల వంక పైన పౌర్ణమి జాబిల్లి

















"ఒకే సారి ఒకే చోట
నెల వంక, జోడీగా
పున్నమీ జాబిల్లి
వెలిసె నెటుల? చెప్పవమ్మ!
ఈ చిక్కు ముడిని విప్పవమ్మ!
ముద్దుగాను అమ్మాయీ!" ||

"జనని గోరు నెల వంక!
ఆ కొన గోటిపైన గోరు ముద్ద –
అరయగాను
అదే నిండు చంద మామ!
ఇదే కదా జవాబు!" ||

“అరెరె! చిటికెలొ చెప్పేసినావు;
ఏమి కిటుకు దాచినావు?
వివరించవోయి, అబ్బాయీ!”
"ఇంతప్పటి నుండీ
కన్న తల్లి ఒడిలోన
వెండి గిన్నె – పాల బువ్వ
మారాము చేస్తు తిన్నాము!
ఆ మాత్రం తెలుసుకోమ?
చిట్కా వేరెందులకు?”

*****************************
_____________
"okE saari okE chOTa
nela vaMka, jODIgaa
punnamii jaabilli
velise neTula? cheppavamma!
iichikku muDini vippavamma!
muddugaanu ammaayI!" ||
"janani gOru nela vaMka!
aa kona gOTipaina
gOru mudda –
arayagaanu
adE niMDu chaMda maama!
idE kadaa javaabu!" ||

“arere! chiTikelo cheppEsinaavu;
Emi kiTuku daachinaavu?
vivariMchavOyi, abbaayI!”
"iMtappaTi nuMDI
kanna talli oDilOna
veMDi ginne – paala buvva
maaraamu chEstu tinnaamu!
aa maatraM telusukOma?
chiTkaa vEreMdulaku?”

******************************

Monday, July 19, 2010

శుక పురాణము
















అందాల చిలకమ్మ
"రామ చిలుక" తనకు బిరుదు
"సితా కోక" కు తన నామమును
ఇచ్చెను అదనపు కానుకగా!

శుక మునికీ తల కట్టు
మన్మధునికి వాహనము

మధుర మీనాక్షి - "చిగురు
కొన గోటి పైన నిలిచిన ముగ్ధత్వమ్ము

"చిలుక పలుకులు" విన వేడుక
"చిలక ముక్కు" చిత్రపు ఉనికి

రా కుమారికి క్లోజ్ ఫ్రెండుట!
చిలకల కొలికీ! నేర్చును చాలా!

aMdaala chilakamma ;
_____________________
"raama chiluka" tanaku birudu
"sitaa kOka" kichchina
tana pErunu adanapu kaanukagaa!

Suka munikii tala kaTTu
manmadhuniki vaahanamu

madhura mInaakshi - "chiguru
kona gOTi paina nilichina mugdhatvammu

"chiluka palukulu" vina vEDuka
"chilaka mukku" chitrapu uniki

raa kumaariki klOj phreMDuTa!
chilakala kolikI! nErchunu chaalaa!

******************************

_________________

Thursday, July 15, 2010

చతురతల దొర
















వల్ల మాలిన కోపమేలయ్యా!
చల్లనయ్యా! తాల్మి దాల్చుమయా!
నీ బుల్లి పెదవుల నవ్వు చిందించు! ||

చల్ల కుండల పగుల కొట్టి
గొల్ల భామల నల్లరెడతావు;
ఒల్ల కుండగ లేవిదేమయ్యా!
పొల్లు పోనీ చిలిపి తనములు
నీదు సొమ్ములిదేమి వింతయ్యా! ||

హరి చందనములను చల్ల మన్నావా
“మన్నారు దేవా”!
విరుల దండల పరిమళాల
సిరి - వాలు చూపుల తేరు నెక్కేవా!
దొరవు చతురతల కెల్లెడల నీవే! ||

@@@@@@@@@@@@@@@

#Kovela


By kadambari piduri,
Jul 15 2010 10:43PM

సుదూర సీమల పరిచయ కర్తలు


















నురుగులు, నురుగులు
నురుగుల బుడగలు
కొలనుల కలువల
దగ్గరి బంధు(వు)లు ||

నురుగుల తేలెడి
వెన్నెల ఆటలు
ఎల్లరి -
ఉల్లాసములకు హేతువులు
మదిని నిండుగా నింపు మోదమ్ములు ||

సెల యేరుల అలలు
మలయానిలముల
వలయపు బొమ్మలు ||

నదిలో తరగలు
తరంగమ్ముల వంపులలోన
నెల వంకల తారంగ క్రీడలు ||
కడలిని కెరటాల్
శంఖ నినాదాల్
ఘుం ఘుం ఘోషల హోరులు, ఓహో! ||
నీటిలొ పడవలు, నెల - వంకల మిత్రులు
లాంచీ, ఓడల పయనాలు,భూమిని కొలిచే దూరాలు

సుదూర సీమల పరిచయ కర్తలు
అవధులు లేని విజ్ఞానాలకు ;
యానాం జర్నీ నామ ఫలకమ్ములు(name boards)||

(rachana -> kadambari )

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

nurugulu, nurugulu
nurugula buDagalu
kolanula kaluvala
daggari baMdhu(vu)lu ||

nurugula tEleDi
vennela aaTalu
ellari -
ullaasamulaku hEtuvulu
madini niMDugaa niMpu mOdammulu ||

sela yErula alalu
malayaanilamula
valayapu bommalu ||

nadilO taragalu
taraMgammula vaMpulalOna
nela vaMkala taaraMga krIDalu ||
kaDalini keraTaal
SaMKa ninaadaal
ghuM ghuM GOshala hOrulu, OhO! ||
nITilo paDavalu, nela - vaMkala mitrulu
laaMchI, ODala payanaalu,bhUmini kolichE dUraalu

sudUra sImala parichaya kartalu
avadhulu lEni vij~naanaalaku ;
yaanaaM jarnI naama phalakammulu(name boards) ||

శృతి గమకములు



















కదలికలనూ, చైతన్యాన్ని
అంటి పెట్టుకున్న నీడలలాగా
ఎన్నెన్నో భావాలు ;
నిశ్శబ్దం చషకంలో
ఎన్నెన్నో శబ్దాలూ, సవ్వడులూ.
శబ్ద బిందు గమకములకు ప్రతిబింబిస్తూ
అనంత రోదసీ విశ్వ విలాసములు !

తంత్రిని గోరు ఆనినంతనే రవళి;
వీణ అచ్చటనే ఉంటున్నది ;
రాగ మాధురి
దశ దిశలా పరివ్యాపిస్తూ
శ్రావ్యంగా, చల్లగా!

Selayeru


By kadambari piduri,
Apr 20 2010 2:23AM
Share|

Wednesday, July 14, 2010

ఆమనికి సుస్వాగతము





















మనోరంజనం
సుధా మాధురి సౌహార్ద్రంగా
విచ్చేసే ఆమనికి
జీవకోటి పలుకునెపుడు
సుస్వాగతము !!!!!!

పూ గుత్తులు
గాలి తెరలపైన
“ పరిమళాల చిత్రాలను”
అప్రతిహతంగా తగిలిస్తున్నాయి.

కవి పాళీ
కలల ప్రపంచమ్ములకు
క్రొమ్మెరుగులు దిద్దుతూంది;

ఊహా కౌశల పరీక్షలలో
ఉత్తీర్ణత సాధించమని ఆమని
కళాకర్త మదిని తట్టి
లలిత లలితముగ నిద్దుర లేపే
శుభ సందర్భము కోరుతు
ఆమనికి
జీవ కోటి పలుకునెపుడు
సుస్వాగతము !

Selayeru


By kadambari piduri,
Jun 4 2010 7:16AM

పుష్పముల ఆరాధన






















అవతార పురుషుని కోసమేను
కువలయమ్ములు, పద్మములు,
మరి, నవ పారిజాతం మల్లెలు ||

స్వామి -
నయన దళముల సొమ్ములై;
అలర చూచును హారముల్
తరళ శోభితం ||

పద్మావతీ -
హృదయోత్పలమ్ముల స్వామితో
అవినాభావపు బంధమే
విరుల ఆరాటం ||



avataara purushuni kOsamEnu
kuvalayammulu, padmamulu,
mari, nava paarijaataM maalalu ||


svaami, nayana daLamula sommulai;
alara chUchunu haaramul
taraLa SOBitaM ||

padmaavatI hRdayOtpalammula
svaamitO
avinaaBaava saMbaMdhamE
virula aaraaTaM ||

Tuesday, July 13, 2010

టింగు రంగా! ఓ మేఘమా!


















అంబరాల హుందాగా
తిరుగాడే జల ధరమా!
టింగు రంగా!- నీ గీర;
పట్ట నలవి కాదుగా! ||

ఓలాల! ఓలాల!
ఆ కోప తాపాలు,
అలుకలు, కినుకలూ
ఏలనే చెప్పుమా! ||

మెరుపుల ఊయలలు
పవనుడు ఇచ్చేను
చల్లంగ మెల్లంగ
ఊగుమా నీరదమ! ||

ఆ ఊపు, ఈ ఊపు
ప్రతి ఊపు నిండా
మధురోహలను
నింపు లోకాల నిండా!

కిల కిలా, కల కలా
నీ కళల నవ్వులు
అత్తరుల వానలు
భువి పైరు పచ్చలు ||

***********************
O mEGamaa! ;
____________
aMbaraala huMdaagaa
tirugaaDE jala dharamaa!
TiMgu raMgaa!- nI gIra;
paTTa nalavi kaadugaa! ||

Olaala! OlAla!
A kOpa tApAlu,
alukalu, kinukaluu
ElanE cheppumaa! ||

merupula Uyalalu
pavanuDu ichchEnu
challaMga mellaMga
Ugumaa nIradama! ||

A Upu, I Upu
prati Upu niMDA
madhurOhalanu
niMpu lOkAla niMDA!

kila kilaa, kala kalaa
nI kaLala navvulu
attarula vaanalu
bhuvi pairu pachchalu ||

***********************

gaganaala taaraaDu
hima biMdu Sata kOTi
maNi pUsa vayyaari jala dharama! ||

lIyumaa!
sogasaina haaraala
alli istaamu! ||

nIlaala niMgilO
siMhaasanammiivu;
laala pOyiMchukuni
navvu pasi paapavIvu! ||