Thursday, December 29, 2016

అల్లరులలో మేటి వాడు

నందకిశోరుడు, క్రిష్ణుడు ; 
బలరామునికి తమ్ముడు,
పింఛధారి, గోవర్ధన గిరిధారి, 
అల్లరులలో మేటి వాడు ; || 
;
రోహిణీ పిన్నమ్మ, యశోదమ్మలు; 
నవనీతమ్ములు, జున్ను, మీగడలు ; ; 
కొసరి కొసరి ఇస్తేను తీసుకున్నాడు ; 
తీసుకున్నాడు, సరే!;
పుచ్చుకున్న క్రిష్ణుడు ఎటు వెళ్ళినాడమ్మా!? ;
క్రిష్ణుడు ఎటు వెళ్ళినాడమ్మా!? ||
;
యమునా దరి చేరాడు ముద్దుగుమ్మడు ; 
చిరు తిళ్ళు తెచ్చారు కన్నయ్య నేస్తాలు, 
గోపెమ్మలు, రాధమ్మలు ;
కొంగులలో దాచి దాచి తెచ్చారు ; ||
;
తినుబండారములతోటి 
సరగున వచ్చేసారు మిత్రులు, 
ఇదిగొ సర్వం నీకేను! - అంటుంటే ; 
'కాకి ఎంగిలిలు చేసి చేస్తే - 
తనకు బాగా పనికివచ్చును, 
సరి సరి! సరే సరే!!
;
;- అల్లరులలో మేటి వాడు ; blogillu LINK

శ్రీ గోదాదేవి, శుకము

శ్రీ గోదాదేవి భుజమున నిలిచిన
తేనెల పలుకుల చిలకమ్మా! 
పన్నీటి పలుకులను
చిలకరించుమా! చిలకరించుమా! !||
;
లోకములను బ్రోచిన స్వామి ;
విధి నిర్వహణలోన సతమతమౌతూను ; 
అలసి ఉన్నాడు, ఓ కీరమా!
విధి నిర్వహణ వలన ; 
బహు డస్సి ఉన్నాడు ; 
తేనెల పలుకుల తోటి సేదదీర్చమ్మా!! : || 
;
శ్రీరంగనాయకి సతి కూడ ; 
భాగస్వామిని పతి విధిని ; 
అస్తారుబిస్తారు అయ్యి ఉన్నాది ;
పని ఒత్తిడి తోడ 
అస్తారుబిస్తారు అయ్యి ఉన్నాది ;
తేనెల పలుకుల తోటి సేదదీర్చమ్మా!! : || 
;
kusumaamba1955 rachana ;

Friday, December 16, 2016

భజరే!

భజరే! భజరే! భజరే! భజరే! 
కృష్ణ ముకుందం! గోకుల హాసం!
దేవకి తనయం! యశోద మోదం! ;;
యమునాతీరం! యామిని శోభా సౌరభ
           వ్యాపిత హృత్తేజం! :  ||
కస్తూరి తిలకం తేజిత ఫాలం ; 
కౌస్తుభ మణి  హారం;
మరకతాభరణ ధారీ, శోభిత ; 
నీల మేఘ ఘన సమున్నత వక్షం! :  || 

=============================;

                     BajarE!

BajarE! BajarE! BajarE! BajarE! 
kRshNa mukumdam! gOkula hAsam! 
dEwaki tanayam! yaSOda mOdam! ;;
yamunaateeram! yAmini SOBA sauraBa
           wyApita hRttEjam! :  ||



kastuuri tilakam tEjita phAlam ; 
kaustuBa hAram;
maNi marakataabharaNa dhaarii, SOBita ; 
niila mEGa ghana samunnata waksham! :   || 
;
[ పాట 119 ;  బుక్ పేజీ 124  , శ్రీకృష్ణగీతాలు ] 
బృహత్తర విధి ;  కిరీట ధారిణి. కోణమానిని తెలుగు ప్రపంచం ;  LINK :-
;

శ్రీకార సీమ

మజిలీల మలుపులలో కాలూన లేనైతి కృష్ణా! 
        పసిబాల లీలగా, ఇటుల - పడి లేవ లేనైతి ; :  || 
;
ఈ కోన, ఆ కోన, చీకటుల 
  బాట,కూన దాటగ గలదా!? ; 
    రక్కసి ముళ్ళేవి గుచ్చుకోకుండా! :  || 
;
ఈ కొండ ఆ కొండ, మిట్ట పల్లాలను 
     ఎక్కి, చేరగ గలనా!? 
         చక్కని వెన్నెలల  శ్రీకార సీమను ;  || 
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
;
;                     Sreekaara seema ;-  
;
majiliila malupulalO kaalUna lEnaiti kRshNA! pasibaala 
liilagaa, iTula - paDi lEwa lEnaiti ; :  || 

ii kOna, A kOna, chIkaTula bATa,kUna 
dATaga galadA!? ; rakkasi muLLEwi guchchukOkumDA! :  || 

ii komDa A komDa, miTTa pallAlanu ekki, chEraga galanA!? 
chakkani wennelala  Sreekaara seemanu ;  ||
;
[ పాట 116  ;  బుక్ పేజీ 122  , శ్రీకృష్ణగీతాలు ]  ;  
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

నా తోట

నా తోట ఏ గాలి వీయించుతావో, 
నా వీట ఏ మధువు ఒలికించుతావో ;  || 
పాటలాధరమున 'కన్నీటి ఆట ' ; 
జాలువారేనురా ; జారిపోయేనురా :   
   హంసవై నీవె ఈదులాడేవు ; 
   రాయంచవై నీవె తానమాడేవు :  || 
;
ఎద పంజరములోన ; మలిసంజె వెలుగులు ;; 
కొలువు చేసేనురా, జిలుగు పూసేనురా! ;; 
   చిలుకవై నీవే పలుకులను నింపు : 
   రాచిలుకవై నీవే పాటలను నింపు :  ||
;  
==================;
              naa tOTa ;-;-
;
naa tOTa E gaali weeyimchutaawO, 
naa wITa E madhuwu olikimchutaawO ;  || 
pATalAdharamuna 'kannITi ATa ' ; 
jaaluwaarEnuraa ; jaaripOyEnuraa :   
   hamsawai neewe iidulADEwu ; 
   raayamchawai neewe taanamADEwu :  || 
;
eda pamjaramulOna ; 
malisamje welugulu ;; 
koluwu chEsEnurA, jilugu pUsEnurA! ;; 
   chilukawai neewE palukulanu nimpu : 
   raachilukawai neewE pATalanu nimpu :  ||
;
[ పాట 116  ;  బుక్ పేజీ 121  , శ్రీకృష్ణగీతాలు ]  - 
;
***************************************:
;













;  ↴116
నూట పదహార్లు, నాకు చాలు! ;-
1942 లో “దీన బంధు” సినిమా నిర్మాణం ;  చిత్తూరు నాగయ్య ; 
1970 లో ఢిల్లీ ఆంధ్ర సంఘము - సభను ఏర్పాటు చేసింది.
అక్కడ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్
"మీకు ఎట్టి సన్మానం కావాలి?" అని అడిగారు.
"నూట పదహారు రూపాయలు, శాలువా చాలును."
అన్నాడు శంకరంబాడి.
***************************************:
;
ఇప్పటికి ఇవి నూట పదహార్లు ;   =
ippaTiki iwi nUTa padahaarlu ;                
;
 ▼▼▼▼▼▼▼▼▼▼▼▼

దివ్య మజిలీ

గుండె లో లోతుల కందళించిన వేళ ; 
కృష్ణా! ఏ పూవుగా నేను పూయ గల దానను!? ; 
ఏ గాలిగా నేను వీయగలదానను!?!? :  ||
;
వెలుతురుల 'అచ్చెరువు' వెల్లువలు  రేకెత్త ;  
తొలి సందె మలి సందె, ఊయలై నన్నూప 
;      ఏ హంసగా నేను ఈదులాడేను : 
       ఏ పాపగా నేను ఊగులాడేను ;  || 
;
కలలు కలతల దూరి ఉప్పెనగ పెనగ ; 
ఈ నేల, ఆ నింగి - నేస్తులై నను పిలువ ; 
        ఏ తరగలై నేను ఉరకలెత్తేను ; 
        ఏ దివ్య మజిలీలో సుంత ఆగేను ;  || 
;
================================; 
;
                     diwya majilii ;- 
;
gumDe lO lOtula kamdaLimchina wELa ; 
kRshNA! E puuwugA nEnu pUya gala dAnanu!? ; 
E gAligA nEnu wIyagaladA!? :  ||

weluturula achcheruwu welluwalu rEketta ; 
toli samde mali samde, uuyalai nannuupa 
            E hamsagA nEnu IdulADEnu : 
            E pApagA nEnu UgulADEnu ;  || 
;
kalalu kalatala duuri uppenaga penaga ; 
ii nEla, aa nimgi - nEstulai nanu piluwa ; 
            E taragalai nEnu urakalettEnu ; 
             E diwya majiliilIlO sumta aagEnu ;  || 
;
[ పాట 115  ;  బుక్ పేజీ 120  , శ్రీకృష్ణగీతాలు ]
చంద్రికలలో స్నానాలు JLD  [ link ] ;

Tuesday, December 13, 2016

బుల్ బుల్ మాసం Karthika

కార్తీకం బుల్ బుల్ మాసం ;
భలే సందడి విహారములతో!
పిక్నిక్ ఆటలు, విహార యాత్రలు 
పొరపొచ్చాలను తొలగించి 
నిర్మించేటి స్నేహ వారధికి  

పట్టువిడుపులు, దోస్తీలు
మైత్రీ అలకలు చిట్టి మెరుపులు 
పట్టు కుచ్చులు చిరు నవ్వుల చిందులు
చేతులు కలిపి చేతము నేస్తం!  

================;  

kaarteekam bul bul maasam ;
bhalE samdaDi wihaaramulatO!
piknik ఆటlu, wihaara yaatralu 
porapochchaalanu tolagimchi 
nirmimchETi snEha waaradhiki  

paTTuwiDupulu, dOstiilu
maitree alakalu chiTTi merupulu 
paTTu kuchchulu chiru nawwula chimdulu
chEtulu kalipi chEtamu nEstam!  
;

Monday, December 12, 2016

వెన్నెలలో స్నానాలు


వెన్నెలలో స్నానమేల? చందమామా! 
కన్నులలో తళుకులేల? చందమామా! :  || 
;
రాధ వలపు కన్నులలో నాదు మానసం ; 
పెను చిక్కులన్ని తొలగించి మక్కువ చూపి ; 
మగువ తోటి నా మనవిని చందమామా! 
విన్నవించు - మా మొర విని చందమామా! :  || 
;
ఆమె చూపు కరువాయెను ; 
నాదు మనసు చీకటాయెను చందమామా! ; 
చిటికెడంత కరుణ కురిసి చందమామా! ; ; 
ఇదే మంచి తరుణమని తెలిసి ; 
తారుణ్యత మది నెంచి ; 
మాకు జతను కూర్చుమోయి చందమామా!; 

సువ్వీ! సువ్వీ! అనుచు 
జానపదం అవవోయీ! చందమామా! ; 
జాణ నింగి చుక్క తోటి చందమామా! ;  ||

; ==================,

          nagu mOmu ;- 
;
nagu mOmu chUpaka nannEDipistAwu; pATa chAlunu kRshNA! :
'tEne rasa SAlalO parawaSAla tEla ; kRshNA! parawaSAla tEla ; ||

mumdu janmamulOna oDalella chillulugA chEsukuni ; 
muraLi - tapamaacharimchenu ; nee arachEta chErEnu; 
adi, gaaraalu pOyEnu! ; bahu gaaraalu pOyEnu! : ||

telisinadi kiTuku, telisenu lOguTTu ; 
toli wratamu nE chEsi, wENuwE autAnu ; 
nee wEli mudralu , mudrala muddulu nE pomdutaanu ; 
wE wElugaa nEnu pomdi teeredanu, kRshNA! || 
బృందావనమే రాధామనోహరం... 
[ పాట 113  ;  బుక్ పేజీ; 118  , శ్రీకృష్ణగీతాలు ]   
      [bhawuka ]

నగు మోము

నగు మోము చూపక నన్నేడిపిస్తావు; 
పాట చాలును కృష్ణా! :
'తేనె రస శాల'లో పరవశాల తేల ; 
కృష్ణా! పరవశాల తేల ; ||
;
ముందు జన్మములోన ఒడలెల్ల చిల్లులుగా చేసుకుని ; 
మురళి - తపమాచరించెను ; నీ అరచేత చేరేను; 
అది, గారాలు పోయేను! ; బహు గారాలు పోయేను! : ||
;
తెలిసినది కిటుకు, తెలిసెను లోగుట్టు ; 
తొలి వ్రతము నే చేసి, వేణువే ఔతాను ; 
నీ వేలి ముద్రలు , ముద్రల ముద్దులు నే పొందుతాను ; 
వే వేలుగా నేను పొంది తీరెదను, కృష్ణా! || 
;
==================,

             nagu mOmu ;- 
;
nagu mOmu chUpaka nannEDipistAwu; pATa chAlunu kRshNA! :
'tEne rasa SAlalO parawaSAla tEla ; kRshNA! parawaSAla tEla ; ||

mumdu janmamulOna oDalella chillulugA chEsukuni ; 
muraLi - tapamaacharimchenu ; nee arachEta chErEnu; 
adi, gaaraalu pOyEnu! ; bahu gaaraalu pOyEnu! : ||

telisinadi kiTuku, telisenu lOguTTu ; 
toli wratamu nE chEsi, wENuwE autAnu ; 
nee wEli mudralu , mudrala muddulu nE pomdutaanu ; 
wE wElugaa nEnu pomdi teeredanu, kRshNA! || 
బృందావనమే రాధామనోహరం... 
[ పాట 114  ;  బుక్ పేజీ 119  , శ్రీకృష్ణగీతాలు ]  
;

Friday, December 9, 2016

పాల వెన్నెల

పాల వెన్నెలలోన కరిగిపోయెను జగతి!!; 
నీ వాలు చూపులలోన ; 
జారి పోయె నా మది! 
రాధా! జారి- పోయింది నా మది! :  ||  

ఆమె ;- 
రామ చిలుకలకు పలుకులు కరువై ;  
ఉలకవు, పలకవు, ఎందులకో!? : 
అతను ;-  
తేనెల సోనల తలపులన్నిటిని 
దోచిన జాణవు, నీ వలననే!
కీరవాణికి అలకలు, కినుకలు! :  || 

ఆమె ;-  
జిలిబిలి చూపుల పూల దొంతరలు ; 
పేర్చితి వేలనో? ఎందులకో? ;; 
అతను ;- 
నా మదిని దోచిన మంద గమనవు! 
పూలశయ్యలు నీ కొఱకే! అవి నీ కొఱకే! :  ||
;
; ==========================;
;;
                         paala wennela ;-
;
paala wennelalOna karigipOyenu jagati!!; 
nee waalu chuupulalOna ; 
jAri pOye nA madi! 
raadhA! jAri- pOyimdi nA madi! :  ||  

aame ;- 
raama chilukalaku palukulu karuwai ; 
ulakawu, palakawu, emdulakO!? : 
atanu ;-  
tEnela sOnala talapulanniTini 
dOchina jANawu, nI walananE!
keerawaaNiki alakalu, kinukalu! :  || 

aame ;-  
jilibili chuupula puula domtaralu ; 
pErchiti wElanO? emdulakO? ;; 
atanu ;- 
naa madini dOchina mamda gamanawu! 
pUlaSayyalu nI ko~rakE! awi nI ko~rakE! :  ||
;
[ పాట 112 ;  బుక్ పేజీ 117  , శ్రీకృష్ణగీతాలు ]  

▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ▼ ▼ ► ► ▼▼▼▼▼▼▼▼

Thursday, December 8, 2016

మెరుపు మేనా

మెరుపు మేనాలోన ; 
     రావేమి చెలియా!
గడుసు మొయిలుల తోసి, పారేసి ;; 
    దాటి దాటీ త్వరగ రావేమి, రాధికా! :  ||  

పున్నములు తెలబోయె ; 
  వెన్నెలలు వెలివోయె ; 
    చిన్నబోయెను రేయి ; 
       అన్నె పున్నెము లెంత 
        మాత్రమూ ఎరుగనిదమ్మా, 
              ఈ విదియ రేయి! :  ||

సన్నజాజుల తావి ; 
  కన్నె మోజుల జారి ; 
   చిన్నబోయెను తోట ; 
     చిన్నబుచ్చకు చెలియ! 

       ఏ నేరమూ ఎరుగనిదమ్మ! 
            పరిమళపు ఈ తోట :  || 
;
=========================;
;
;     merupu mEnaa ;- 
;
merupu mEnaalOna ; 
     raawEmi cheliyA!
gaDusu moyilula tOsi, paarEsi ;; 
    daaTi daaTii twaraga rAwEmi, rAdhikaa! :  ||  

punnamulu telabOye ; 
  wennelalu weliwOye ; 
    chinnabOyenu rEyi ; 
       anne punnemu lemta 
        maatramuu eruganidammaa, 
              ii widiya rEyi! :  ||

sannajaajula taawi ; 
  kanne mOjula jaari ; 
   chinnabOyenu tOTa ; 
     chinnabuchchaku cheliya! 

       E nEramuu eruganidamma! 
            parimaLapu I tOTa :  || 
;
[ పాట 11 ;  బుక్ పేజీ 11  , శ్రీకృష్ణగీతాలు ]  

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼,

వీడ్కోలు

తాళ లేని పున్నమికి ; 
కర్పూర విడెమిచ్చి ; 
వేళ కాని వేకువకు ; 
మలి వీడ్కోలును పలికి : || 

చెలి జడలో మొగలి పూవు తావిని ; 
నేనై ఉందును ; 
ఉందును నేనిచటనే, 
సదా సదా, నిరంతరం ;  || 

రాధ జడ పరిమళాల తరాజు ; 
తుమ్మెదల కూడలి అయె ; 
రాధ కేశ వేదిక ;  || 

ఏమని చెప్పుదును ; 
తక్కిన పుష్పాల వేదనలు ; 
భ్రమరము లన్నియు చేరిన 
సీమ ఇదే ఆయెను - అని ; 

తమ వంకకు అవి 
    రావడమే మరిచినవని - 
తక్కిన పూవులు అన్నింటీ ; 
విలవిలలు, కృంగి కృశించుటలు ;  || 

==============================;
;
          weeDkOlu

tALa lEni punnamiki ; 
karpuura wiDemichchi ; 
   wELa kaani wEkuwaku ; 
mali weeDkOlunu paliki : || 
cheli jaDalO mogali puuwu taawini ; 
nEnai umdunu ; 
umdunu nEnichaTanE, 
sadaa sadaa, niramtaram ;  || 
raadha jaDa parimaLAla taraaju ; 
tummedala kuuDali aye ; 
raadha kESa wEdika ;  || 
Emani cheppudunu ; 
takkina pushpaala wEdanalu ; 
bhramaramu lanniyu chErina 
seema idE Ayenu - ani ; 
tama wamkaku awi 
    raawaDamE marichinawani - 
takkina puuwulu annimTii ; 
wilawilalu, kRmgi kRSimchuTalu ;  || 

***********************,
 ;-  [ పాట 111 ;  బుక్ పేజీ 115  , శ్రీకృష్ణగీతాలు ] 

Wednesday, December 7, 2016

ఆమని

ఆమని పాడెను, ఏమని? ; 
  రాధిక నిలిచిన తావుననే ; 
    బీడు కూడ బృందావని అగునని ;  
      అంతేనని! అది అంతేనని! :  || 
;
నెలవంకకు నెలవేది? 
        "నీ చిరూవ్వు!" 
;
వలరాజుకు సెలవేది? ; 
        "నీ చిరు కోపం!" :  
తొలి చుక్కకు కొలువేది? 
        "నీ కనుపాప" 
 ; 
====================;
;
                        aamani ;- 

aamani pADenu, Emani? ; 
  raadhika nilichina taawunanE ; 
    biiDu kUDa bRmdAwani agunani ;  
      amtEnani! adi amtEnani! :  || 
;
nelawamkaku nelawEdi? 
        "nI chiruawwu!" 
;
walaraajuku selawEdi? ; 
        "nee chiru kOpam!" :  
toli chukkaku koluwEdi? 
        "nI kanupaapa" 
;
;
[ పాట 110 ;  బుక్ పేజీ 115  , శ్రీకృష్ణగీతాలు ] 
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ;

చిద్విలాసుడు

అంబరము చుంబించు ;
   అనుపమ ద్యుతి తోడ ; 
రాజిల్లు అందాల తండ్రికి ;
;    అభివందనం! శుభవందనం! :  || 

వక్షమున మక్కువతొ రమణీ మణిని 
  దాచిన ఉద్విగ్న మూర్తికి అభివందనం!;  
ఉరగమున పవళించి ; 
  చిద్విలాసము చిందు 
   రాజీవలోచనునికి అభివందనం! ;        
;    అభివందనం! శుభవందనం! :  ||  

చరణముల సుర గంగ ముదమున ఉప్పొంగ ; 
    కరమున అభయము - ముద్రగా ఉన్నట్టి
     శ్రీకృష్ణ మూర్తికి అభివందనం!
జగముపై ప్రస్ఫుటముగ ప్రేమ 
   కురిపించు శ్రీశ్రీనివాసునికి ;    
;    అభివందనం! శుభవందనం! :  ||
====================================;
;
              chidwilaasuDu 
;
ambaramu chumbimchu ;
   anupama dyuti tODa ; 
raajillu amdaala tamDriki ;
    abhiwamdanam! SuBawamdanam! :  || 

wakshamuna makkuwato ramaNI maNini 
  daachina udwigna muurtiki ; abhiwamdanam!;  
uragamuna pawaLimchi ; 
  chidwilaasamu chimdu 
   raajeewalOchanuniki ; 
       abhiwamdanam! 
   abhiwamdanam! SuBawamdanam! :  || 

charaNamula sura gamga mudamuna uppomga ; 
    karamuna abhayamu - mudragaa unnaTTi
     SreekRshNa mUrtiki; 
jagamupai prasphuTamuga prEma 
   kuripimchu SreeSreeniwaasuniki ;    
        abhiwamdanam! SuBawamdanam! :  || 
;
[ పాట 109 ; బుక్ పేజీ 114  , శ్రీకృష్ణగీతాలు ] 
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ;

మందార దామములు

మందార దామముల 
     ముదమార శయనించు ; 
ఇందీవరాక్ష! శ్రీ బృందా విహారీ! 
      నా హృదయారవిందమే ఆరామము! ;
                 నీకు ఆరామము! ;  || 

వేణు గానము తోడ ; 
స్థాణువులనైనా , 
కరిగించివేతువు 
నీవు కరిగించివేతువు :  || 

శిఖి పింఛములు కదుల ; 
చిరు గాలులకు రేగు ; 
పులకింతలు ఇవి, 
వేల వేలు; వేలాది వేలు :  || 

కస్తూరి తిలకమున ; 
కరిగి తన్మయమొదు 
శీతల కిరణములు ; 
వేలకు వేలు; వేలాది వేలు :  || 
;
=======================;
;
            mamdaara daamamulu ;- 
;
mamdaara daamamula 
    mudamaara Sayanimchu ; 
imdeewaraaksha! SrI bRmdA wihArI! 
     naa hRdayaarawimdamE Araamamu! 
                    neeku Araamamu!  || 

wENu gaanamu tODa ; 
sthANuwulanainA , 
karigimchiwEtuwu neewu :  || 

SiKi pimCamulu kadula ; 
chiru gaalulaku rEgu ; 
pulakimtalu iwi, 
wEla wElu; wElAdi wElu :  || 

kastuuri tilakamuna ; 
karigi tanmayamodu 
SItala kiraNamulu ; 
wElaku wElu; wElAdi wElu :  || 
;
[ పాట 108 ; బుక్ పేజీ 113  , శ్రీకృష్ణగీతాలు ] 
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ; 

పండుగ రోజు

గోకులవాసుని, నందకుమారుని ; 
  సందు లేక నా గుండెలలోన ; 
     నిండిన నాడే పండుగ రోజు ;  || 

   నిగమగోచరుడు అతడేనంట ; 
     నిర్మల భావుకుడత డేనంట : 
       నా మది దోపని తెరవేమో : 
         తలుపులు తెరువని తీరేమో!? ;  ||

కుంజర వరదుడు అతడేనంట! 
  సుందర శ్యాముడు అతడేనంట! 
   నా మది మందిర మందున,  
    ఇతడు - నిలువని తుళువల తనముల 
        తెరుగేమో, ఈ తీరేమో ;  ||
;
               pamDuga rOju :- 
;
gOkulawaasuni, namdakumaaruni ; 
  samdu lEka nA gumDelalOna ; 
    nimDina nADE pamDuga rOju ;  || 

    nigamagOcharuDu ataDEnamTa ; 
     nirmala BAwukuData DEnamTa : 
      nA madi dOpani terawEmO : 
       talupulu teruwani tIrEmO!? ;  ||

kumjara waraduDu ataDEnamTa! 
  sumdara SyAmuDu ataDEnamTa! 
   naa madi mamdira mamduna,  
    itaDu niluwani tuLuwala tanamula 
        terugEmO, I teerEmO ;  ||
;
[ పాట 107 ; బుక్ పేజీ 112  , శ్రీకృష్ణగీతాలు ]  
 
▼▼▼▼▼▼▼▼▼▼▼▼  ▼▼▼▼▼▼▼▼▼▼▼▼

కనుగొనవే!

నందకుమారుని వెదుకులాడవే! 
ఆనందధామము మార్గము కనవే! 
   మనసా! వేగమె మార్గము కనుగొనవే! ;  || 

దాగుడు మూతల - కోమల దేహుడు ; 
దాగేనెటనో? దాగేనెటనో? ;  || 

చరణ పద్మముల, కంటకమ్ములు గుచ్చుకొనునో ఏమో - 
అనుచూ రాధిక డెందము భీతిని వణుకును ; 
కృష్ణ చరణ పద్మములను నిమిరేను రాధిక ; 
     శ్యామల కృష్ణా! రావా! రావా! కనరావా! 
       కోమలు లందరు వెదుకులాడగ ; 
        కొలనున శౌరి, దాగేనేమో, దాగేనేమో, :  ||

శీతము కమ్మును నీటను నానిన ;
అని క్షోభించును - ఈ రాధిక హృదయము ; 
వేగమె రా!రా!రాస విహారీ! 
రాధా మానస రాజ్య విహారీ! 
               చేరగ రావా! :  || 

=====================================;

;
                  kanugonawE! :- 

namdakumaaruni wedukulaaDawE! 
aanamdadhaamamu maargamu kanawE! 
   manasA! wEgame maargamu kanugonawE! ;  || 

dAguDu mUtala - kOmala dEhuDu ; 
daagEneTanO? daagEneTanO? ;  || 

charaNa padmamula, kamTakammulu guchchukonunO EmO - 
anuchuu raadhika Demdamu BItini waNukunu ; 
kRshNa charaNa padmamulanu nimirEnu rAdhika ; 
     SyAmala kRshNA! rAwA! rAwA! kanarAwA! 
       kOmalu lamdaru wedukulADaga ; 
        kolanuna Sauri, daagEnEmO, daagEnEmO, :  ||

SItamu kammunu nITanu nAnina ;
ani kshOBimchunu - I rAdhika hRdayamu ; 
wEgame rA!rA!rAsa wihaarI! 
raadhaa maanasa raajya wihaarI! 
               chEraga raawA! :  || 
;
[ పాట 106 ; బుక్ పేజీ 111  , శ్రీకృష్ణగీతాలు ]
 
▼▼▼▼▼▼▼▼▼▼▼▼  ▼▼▼▼▼▼▼▼▼▼▼▼

Tuesday, December 6, 2016

మధుర కావ్యము

ద్వారకలోన దొరవై ఉంటివి ; 
మధురా నగరికి మధుర కావ్యమౌ ; 
ఈ గోపిక నీకు గురుతుకు వచ్చునా!? 
కృష్ణా! గుర్తుకు వచ్చునా!? :  ;  || 

తొలకరి ఋతువు మమతల పుష్పము ; - 
తొలకరి నిటుల మబ్బులు వీడెను ; 
జాలిని వీడి, మాయమైనవి నీలి మబ్బులు ; 
           ఈ విధి లీల లేలనో!? కృష్ణా!  
              ఈ విధి లీలలి వేలనో!?   :  ;  || 

చంద్రుని వెన్నెల ఎపుడైన వీడునా!? 
అలలు అంబుధికి దూరములగునా!? 
రాలిన పూలను దోసిట నింపి ; 
ఓ విరించీ! ఇటుల నాటకమేల ఆడెదవు!? 
వినోద మేల చూపి నవ్వెదవు!? :  || 

అమవస, పున్నమి కెదురు చూచును ; 
శిశిరము తలుపులు తెరచి ఉంచెను ; 
వసంతానికి స్వాగత మనుచును ; 
అశ్రు ముత్యముల రాశి నిలిపెను ; 
ఈ రాధిక నీకై ; 
అశ్రు ముత్తెములతొ రాసి - 
నిలిపెను లేఖా పత్రమును ;   || 
;
====================================;
;
          madhura kaawyamu ;- 
;
dwaarakalOna dorawai umTiwi ; 
madhurA nagariki madhura kAwyamau ; 
ii gOpika nIku gurutuku wachchunaa!? 
kRshNA! gurtuku wachchunA!? :  ;  || 

tolakari Rtuwu mamatala pushpamu ; - 
tolakari niTula mabbulu weeDenu ;
jaalini weedi, maayamainawi neeli mabbulu ; 
      I widhi lIlali wElanO!? 
         I widhi lIla liwElanO!? : :  ||  

chamdruni wennela epuDaina weeDunA!? 
alalu ambudhiki duuramulagunaa!? 
rAlina puulanu dOsiTa nimpi ; 
O wirimchI! iTula nATakamEla aaDedawu!? 
winOda mEla chUpi nawwedawu!? :  || 

amawasa, punnami keduru chuuchunu ; 
SiSiramu talupulu terachi umchenu ; 
wasamtaaniki swaagata manuchunu ; 
aSru mutyamula raaSi nilipenu ; 
ii raadhika, kRshNaa! neekai ; 
aSru muttemulato rAsi - 
nilipenu lEKA patramunu ;   || 
;
[ పాట 105 ; బుక్ పేజీ 110  , శ్రీకృష్ణగీతాలు ] 

కోమలీ!

పల్లవ తను వల్లరీ! రాధికా! కోమలీ! 
అల్లన జాబిలి చేసెను అల్లరి ;   || 

జిలిబిలి జిలిబిలి ఆ అంబరము ; 
తొలి తొలి వలపుల చెలిమి - మన కోసం ; 
సిరి సిరి వెన్నెల మన సొంతం ; 
సరి సరి సరిగమ ఆసాంతం ;  || 

పరిమళ భరితము ఈ విశ్వం ; 
దరిశన మొసగెను సౌందర్యం ; 
పరిసర కాంతులు ప్రేమలకు ; 
కులుకుల పరిచయ వేదికలైనవి ; 
నీ ఒడియే మరకత ఆసనము ; 
నీ ఒడియే నాకు - 
          అతిశయ శోభిత సింహాసనం ;  || 

పరిణత పొందిన దొక కలిమి ; 
విరళత చూపిన దొక చెలిమి ; 
విరి శర తాడిత కృష్ణునికి ; 
తడిసిన తాంబూల మైనదిలే! ; 
నీ నగవే నాకు కర్పూర విడియం ;  ||

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
;
                   kOmalI!  ;- 

pallawa tanu wallarI! raadhikA! kOmalI! 
allana jaabili chEsenu allari ;   || 

jilibili jilibili aa ambaramu ; 
toli toli walapula chelimi - mana kOsam ; 
siri siri wennela mana somtam ; 
sari sari sarigama aasaamtam ;  || 

parimaLa bharitamu ii wiSwam ; 
dariSana mosagenu saumdaryam ; 
parisara kaamtulu prEmalaku ; 
kulukula parichaya wEdikalainawi ; 
nee oDiyE marakata aasanamu ; 
nee oDiyE naaku - 
 atiSaya SOBita sim haasanam ;  || 

pariNata pomdina doka kalimi ; 
wiraLata chuupina doka chelimi ; 
wiri Sara tADita kRshNuniki ; 
taDisina tAmbuula mainadilE! ; 
nee nagawE naaku karpuura wiDiyam ;  ||
;
 [ పాట 103 ; బుక్ పేజీ 108  , శ్రీకృష్ణగీతాలు ]

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

Monday, December 5, 2016

సిరి వెన్నెల మాలిక

గోపిక లందరు వలయము తీరి ; 
కన్నుల విందుగ ఆడిరిలే! 
కన్నుల పండుగ చేసిరిలే! ;  ||

పాల కుండలు, నిండుగ వెన్నలు ; 
నడుమను కృష్ణుని కూర్చుండ బెట్టి ; 
గోపిక లందరు ఆడిరిలే!;  ||  

తెలి తెలి పాలను వాని ఛాయలు ; 
నీలపు వన్నెగ విరిసెనులే!; 
వంగుచు నాట్యా లాడుచు సొగసుగ ; 
కదలెడి భామలు మురిసిరిలే!;;   ||  

తేర్చిన 'వెన్నల దొంతులు ' ఒక పరి ; 
'తెల్లని కలువలు' గా తోచె ; 
నడుమను కదిలే కృష్ణుని నీడలు ; 
నీలపు పుప్పొడి యౌనని ; 
నిండుగ తొణికెడు భ్రమ తోచె! ;  || 

తిరిగెడు కన్నెలు, వేయి రంగుల ; 
కోటి రేకుల పూవులు కాబోలనిపించె! ; 
ఇన్ని వింతల పూవులు ఔరా! 
నీటిని విడిచి, 
ఇటుల నేలను నేడు ;; 
ఎటుల ; 
పూసిన వనుచును సంభ్రమించుచు ; 
'కలువల రేడు' పరుగున వచ్చి ; 
'వెన్నెల చూపుల' వీక్షించె! :  ||   
;
================================;
;
                 siri wennela maalika ;- 
;
gOpikalamdaru walayamu teeri ; 
kannula wimduga ADirilE! 
; kannula pamDuga chEsirilE! ;  ||

paala kumDalu, nimDuga wennalu ; 
naDumanu kRshNuni kUrchumDa beTTi ; 
gOpika lamdaru ADirilE!;  ||  

teli teli paalanu waani CAyalu ; 
neelapu wannega wirisenulE!; 
wmguchu nATyA lADuchu sogasuga ; 
kadaleDi BAmalu murisirilE!;;   ||  

tErchina 'wennala domtulu ' oka pari ; 
'tellani kaluwalu ' gaa tOche ; naDumanu 
kadilE kRshNuni nIDalu ; 
neelapu puppoDi yaunani ; 
nimDuga toNikeDu Brama tOche! ;  || 

tirigeDu kannelu, wEyi ramgula ; 
kOTi rEkula pUwulu kaabOlanipimche! ; 
inni wimtala puuwulu aurA! 
nITini wiDichi, 
iTula nElanu nEDu ;; 
eTula ; 
puusina wanuchunu sambhramimchuchu ; 
'kaluwala rEDu ' paruguna wachchi ; 
wennela chuupula ' weekshimche! :  ||
;
[ పాట 102 ; బుక్ పేజీ 107  , శ్రీకృష్ణగీతాలు ] 

త్రుళ్ళి పడుచు రాధ

కన్నుదోయి నులమబోకురా ;
కంటిలోన నలకలేవొ పడిన వనుచు ; 
నీ కంట నున్న లోకములు ; 
చీకటిలో క్రుంగిపోవురా! :  || 
;
నీ కన్నులేమొ ఎర్రవారె ననుచును ; 
భామినులు, రాధమ్మ తల్లడిల్లుచున్నారు ; 
రాధా హృత్ గమక మాల ; 
తెగిన వీణ తంత్రి ఆయె!  || 
;
అశ్రు గోళమందున ; 
రేయి శయనించేను ;
       హాయి! హాయి! ; 
తొలి సంజె ఉద్భవించె ననుచు ; 
త్రుళ్ళి పడుచు రేయి లేచె ; 
త్రుళ్ళి పడుచు రాధ లేచె! :  || 
 { see ;-  కన్నులలో లోకములు ;- 
కనులు నలుపబోకురా ; 
కంటిలోన నలకలేవో పడిన  ......... ;
;
==========================;
;
               truLLi paDuchu lEche ;- 
;
kannudOyi nulamabOkuraa ;
kamTilOna nalakalEwo paDina wanuchu ; 
nii kamTa nunna lOkamulu ; 
cheekaTilO krumgipOwurA! :  || 
'
nee kannulEmo errawaare nanuchunu ; 
bhaaminulu, raadhamma tallaDilluchunnaaru ; 
raadhaa hRt gamaka maala ; 
tegina weeNa tamtri aaye!  || 
;
aSru gOLamamduna ; 
rEyi SayanimchEnu ;
       haayi! haayi! ; 
toli samje udbhawimche nanuchu ; 
truLLi paDuchu rEyi lEche ; 
truLLi paDuchu rAdha lEche! :  || 
;

{ # see ;- 
25 జూన్, 2016 - కన్నులలో లోకములు. 
"కంటిలోన నలకలేవొ పడినవమ్మ! ; 
నా కంటిలోన నలకలేవొ పడినవమ్మ!”; అనుచు 
నలుపబోకురా, నల్లనయ్య! నలుపబోకురా || ; 
నీ చల్లని వీక్షణముల ; 
యుగములన్ని – క్షణములుగా ; 
కరిగిపోవురా! కృష్ణా! 
కరిగిపోవురా! || } & కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! - 
;
తెలుగు ...telugu.webdunia.com/.../కన్ను-దోయి-నులమ-బోకురా-కృష్ణయ్యా-10...
కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! 
2 "కంటిలోన నలకలేవొ పడినవ"నుచు బులిపిస్తూ,నటనలతో 
(అను పల్లవి): నీ కంటనున్న లోకమ్ములు చీకటులలొ కుంగి పోవు. 
"నీ కన్ను లెర్ర బడిన "వనుచు 
తల్లి యశోదా,దేవకి తల్లడిల్లుచున్నారు భామినుల ........ 

 ▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ 
 [ పాట 101 ; బుక్ పేజీ 106  , శ్రీకృష్ణగీతాలు ]     
14 ఆగ, 2009 - కన్ను దోయి నులమ బోకురా
⇫⇭⇭Ҝ

 


















▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ 

కరుణ కలుగునా!?

రాగమయి రాధికా! 
నన్నేలగ జాగు ఏల? 
ఈలాటి జాగు ఏల? ; || 
;
'సందె కన్నె' చెక్కిళ్ళు 
   ఎర్రబారె రోషముతో ; 
మోము తిప్పె అటువైపుకు ; 
నీలి కురుల నిటు విసరెను ; || 
;
రజని కాంత వయ్యారి, 
   చంద్రవంక ముక్కెరను ; 
చుక్కల వడ్డాణమును 
   ధరియించీ వచ్చినది ; 
మొయిలు పూల చెండులను 
   అవల పారవేసె నావల ;  ||

కినుక కింక అంతూ దరి లేదాయని ; 
ఈ కృష్ణునిపై కరుణ ఏల కలుగదనుచు ; 
రవ్వంత అనుగ్రహము చూపదేల యనుచు ; 
         రజనికాంత కలత బారె!;  ||
;          
==================================;
;
            karuNa kalugunA!? 
;
raagamayi raadhikaa! 
nannElaga jAgu Ela? 
iilaaTi jAgu Ela? ; || 
;
'samde kanne ' chekkiLLu 
   errabAre rOshamutO ; 
mOmu tippe aTuwaipuku ; 
niili kurula niTu wisarenu ; || 
;
rajani kaamta wayyaari, 
   chamdrawamka mukkeranu ; 
chukkala waDDANamunu 
   dhariyimchii wachchinadi ; 
moyilu puula chemDulanu 
   awala paarawEse naawala ;  ||
;
kinuka kimka amtuu dari lEdaayani ; 
ii kRshNunipai karuNa Ela kalugadanuchu ; 
rawwamta anugrahamu chuupadEla yanuchu ; 
         rajanikaamta kalata bAre!;  ||

[ పాట 100 ; బుక్ పేజీ 105  , శ్రీకృష్ణగీతాలు ] 
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ 

ఈ వేళ

వీణా తంత్రి మ్రోగనన్నది ; 
'తంతులమారి' రాని ఈ వేళ :  || 
;
హారశింజితము గుసగుస మన్నది చెవిలోన ; 
కౌస్తుభధారి అధరామృతమ్ము ఏదని? 
చేలాంచలము మర్మరము లాడినది ;
బింబాధరుని చుంబనమేదని?" ;  || 

గోపీ వస్త్రాపహారి దరి లేడే మనుచును : 
కంకణ నిక్వాణము వీనులలోన ఊదినది ; 
గళమున ఊగే వకుళ మాలిక లడిగెను 
పుండరీకుని జాడలు ఏవని? ;  || 
;
మంజీరములు ఘొల్లుమన్నవి ; 
వ్రజ విహారి వచ్చేదెపుడని? 
రాధా హృదయమ్మిపుడు చాల తల్లడిల్లేను ; 
గోపీలోలుడు రాలేదేమనుచును ;  
        డీలా పడుతున్నది ;:  ||  
;
==================================;
;
            ii wELa ;-   
;
weeNA tamtri mrOganannadi ; 
'tamtulamaari ' raani ii wELa :  || 
;
haaraSimjitamu gusa gusa mannadi chewilOna ; 
kaustuBadhAri adharaamRtammu Edani? 
chElaamchalamu marmaramu lADinadi ;
bimbaadharuni chumbanamEdani?" ;  || 

gOpI wastraapahaari dari lEDEmanuchunu : 
kamkaNa nikwANamu weenulalOna uudinadi ; 
gaLamuna uugE wakuLa maalika laDigenu 
pumDareekuni jADalu Ewani? ;  || 
;
mamjiiramulu ghollumannawi ; 
wraja wihaari wachchEdepuDani? 
raadhaa hRdayammipuDu chaala tallaDillEnu ; 
gOpiilOluDu raalEdEmanuchunu ;  
        DIlaa paDutunnadi ;:  ||  
;
[ పాట 99 ; బుక్ పేజీ 104  , శ్రీకృష్ణగీతాలు ]
;  
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ 

నటన సూత్రధారీ!

కుంజ విహారీ! 
మంజుల పద యుగళ 
   నటన సూత్రధారీ! శౌరీ! :  ||  
;
ఆలమందలను కాచీ కాచీ ; 
నీదు తనులత వాడి పోయెరా!! 
విరుల వీవన తోటి విసరనీయుమురా! :  || 
;
కాళీయునిపై ఆడీ ఆడీ ;
అలసితివేమో! సొలసితివేమో!? 
నీ పద పద్మములను ; 
వత్తనీయరా! నను వత్తనీయరా!:  || 
;
కువలయమును మర్దించి మర్దించి ; 
కరకమలములు నొచ్చినవేమో ; 
హరి చందనమును అలదనీయరా ; 
      కొంచెము అలదనీయరా! :  || 
ఈ రాధిక కోసం నడచీ నడచీ ; 
నీదు సుకుమార దేహము బడలిన దేమో! 
నాదు తనువునే శయ్యగ నీవు ; 
      కునుకు తీయరా కాసింత!; : ||

                 naTana suutradhaarI! ;-
;
kumja wihaarI! 
mamjula pada yugaLa 
   naTana suutradhaarii! SaurI! :  ||  
;
aalamamdalanu kaachii kaachii ; 
nii tanuulata wADi pOyerA!/ yEnurA! 
wirula weewana tOTi wisaraneeyumurA! :  || 
kALIyunipai ADI ADI ;
alasitiwEmO! nii pada padmamulanu ; 
wattaniiyarA! nanu wattaniiyarA!:  || 
;
kuwalayamunu mardimchi mardimchi ; 
karakamalamulu nochchinawEmO ; 
hari chamdanamunu aladaniiyaraa ; 
      komchemu aladaniiyaraa! :  || 
ii raadhika kOsam naDachI naDachI ; 
niidu sukumaara dEhamu baDalina dEmO! 
naadu tanuwunE Sayyaga neewu ; 
      kunuku teeyarA kAsimta!; : ||
;
 [ పాట 98  ; బుక్ పేజీ 103 , శ్రీకృష్ణగీతాలు ]